Sunday 1 July 2018

తెలంగాణ తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవని హెచ్చరిక : శ్రవణ్ దాసోజు




భూయజమానులకు,కౌలురైతులకు  పంచాయితీ పెడుతున్న కేసీఆర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర బహిరంగ సభలో కేసీఆర్  వైఫల్యాలను ఎండగట్టిన శ్రవణ్
తెలంగాణా తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవని హెచ్చరిక

హైదరాబాద్:  రైతుబంధు పథకం  కౌలు రైతుల కు వర్తింపచేయబోమంటూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  చేసిన ప్రకటన ను  టీసిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్రంగా  ఖండించారు.  
ఇవాళ దేవరకద్ర నియోజకవర్గంలో డోకూరి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో  జరిగిన  బహిరంగ సభలో  వందలాది మంది టీఆర్ ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా  ముఖ్యఅతిధిగా హాజరయిన శ్రవణ్ దాసోజు మాట్లాడారు. కేసీఆర్ రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలనుఆయన ఈసందర్భంగా దుయ్యబట్టారు. నిజమైన రైతుకు లబ్దిచేకూర్చకుండా బడాబాబులకు,  భూస్వాములకు లబ్దిచేకూర్చేలా రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ అసంబద్ద నిర్ణయం వల్ల సుమారు 60 లక్షల ఎకరాల భూమిని సాగుచేస్తున్న కౌలు రైతులకు  నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం వల్ల సుమారు 13 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన సన్న,చిన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం భూస్వాములకు  లబ్దిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధు పేరిట పెద్దమొత్తం లో చెక్కులు భూస్వాములకు  ఇచ్చారని అదే చిన్న సన్నకారు రైతులకు కేవలం స్వల్పమొత్తంలో చెక్కులు అందించారన్నారు. దాదాపు 1.5 లక్షల రైతులు కేవలం 100 రూపాయల చెక్కులు తీసుకున్నారని, ఇదెలా రైతుబంధు అవుతుందో . కేసీఆర్ ఎలా రైతుబంధువు అవుతారో చెప్పాలని డిమాండ్ చేసారు.  భూయాజమాన్య హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టంలో చిన్న సవరణ చేసి కౌలు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేసే అవకాశం ఉన్నా విస్మరించారని ఆరోపించారు. దీనివల్ల నిజమైన భూ యజమానులకెలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు. భూయజమానులకు హక్కులను రక్షిస్తూనే ఎండనకా వాననకా చెముడోడ్చి కష్టపడుతున్న కౌలురైతులను కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని శ్రవణ్ విజ్నప్తి చేసారు.సమగ్రకుటుంబ సర్వేలో స్పష్టంగా ఉన్న కౌలురైతుల వివరాలు సమగ్రకుటుంబ సర్వే లో సమగ్రంగా  కౌలు రైతుల వివరాలున్నా... ఎంత మంది కౌలురైతున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియదనడం పై శ్రవణ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అలాగే ఇటీవలి భూసర్వేలో సైతం కౌలురైతులు, భూయజమానుల వివరాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్ వైఫల్యాలను బట్టబయలు చేసిన శ్రవణ్
టీఆర్ఎస్ పాలనలో  వైఫల్యాల చిట్టాను శ్రవణ్ బయటపెట్టారు. ఎన్నికల ముందు నాలుగు నెలల్లో ఇస్తానన్న12 శాతం  ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లును నాలుగేళ్లు గడిచినా ఇవ్వలేదని దీని వల్ల గడిచిన నాలుగేళ్లుగా వారు అనేక అవకాశాలను కోల్పోయారని గుర్తుచేశారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములన కబ్జాకోరల్లోంచి విడిపిస్తామని ముస్లీం లపరం చేస్తామని చెప్పి ఒక్క ఎకరం కూడా వెనక్కి తీసకురాలేకపోయారని దుయ్యబట్టారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు 7865 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్ లోని దర్గాహసన్ షావలి  భూముల్లో ఆక్రమణలు తొలగించేందకు వక్ఫ్ బోర్డుకు  జ్యూడిషియల్ అధికారాలు ఇస్తామన్న   మానిఫెస్టోలో  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని శ్రవణ్ ఆరోపించారు.

తెలంగాణా తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవు
అధికార మదంతో తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన తెలంగాణా తల్లి సోనియా గాంధీని అమ్మా బోమ్మా అంటూ మాట్లాడిన ఐటి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని  శ్రవణ్ అన్నారు. పక్కరాష్ట్రంలో రాజకీయంగానష్టపోయినా ఫర్వేలేదని  కడుపు చించకుని  సోనియా తెలంగాణా ఇచ్చినవిషయం మరిచి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వందలాది మంది బిడ్డల ఆత్మత్యాగాలను గుర్తించిన సోనియాగాంధీ ని తూలనాడితే పుట్టగతులుండవని హెచ్చరించారు.





No comments:

Post a Comment