Tuesday 10 July 2018

బీసిలకు కావలసింది 34 శాతం కాదు 52 శాతం

బీసిలకు కావలసింది 34 శాతం కాదు 52 శాతం

బీసిలకు 54 శాతం రిజర్వేషన్లు  ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది ...శ్రవణ్ దాసోజు

సుప్రీం కోర్టులో కొట్లాడాల్సింది బీసీలకు 52 శాతం కోసం

దామాషా ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ కొట్లాడుతుంటే  అడ్డుకుంటోందనడం అనైతికం

కులగణన చేయమని కోర్టుకెళ్లింది మేమేనన్న శ్రవణ్



హైదరాబాద్ :  ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం  కాంగ్రెస్ పార్టీ పై బట్టకాల్చి మీదవేయడం సరికాదని, అసలు కుల గణ న చేయకుండా బీసిలలో ఏకులాలలో ఎంత మంది ఉన్నారనే సమగ్ర సమాచారం సేకరించకుండా ఆదరాబాదరాగా ఎన్నికల ప్రహసనాన్ని మొదలు పెట్టి బీసీలను మోసం చేయాలనుకున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, 52%  రిజర్వేషన్ల కోసం కోట్లాడినమని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు తెలిపారు.


బీసిలకు కావలసింది 34 శాతం కాదు.... 52 శాతం

తాము దామాషా ప్రకారం 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతుంటే ఇవాల్టికి కూడా ముఖ్యమంత్రిగారు 34 శాతం రిజర్వేషన్ లు ఇస్తాననడం దీని కోనం సుప్రీంకోర్టుకు వెళుతాననడం బీసిలను మోసగించడమేనని  54 శాతం ఉన్న బీసిలకు  న్యాయబద్దంగా ఉన్న హక్కులను కాలరాయడమేనని శ్రవణ్ దాసోజు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమగ్ర కుటుంబ సర్వేప్రకారం బీసి లసంఖ్య 52 శాతం ఉందని చెప్పిన ప్రభుత్వం.. మరిప్పుడు 34 శాతం రిజర్వేషన్ల కోసం కోర్టులో కొట్లాడుతాననండ ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే న్యాయం చేయాలనుకుంటే అనుకుంటే బీసి లకు 54 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని  అదికూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని శ్రవణ్ దాసోజు గుర్తుచేశారు.


సుప్రీం కోర్టులో కొట్లాడాల్సింది బీసీలకు 54 శాతం కోసం

సుప్రీంకోర్టు లో కొట్లాడాల్సింది 34 శాతం రిజర్వేషన్ల కోసం కాదని , 52 శాతం కోసమని శ్రవణ్  అన్నారు.

బీసిలకు న్యాయం చేయమని కాంగ్రెస్ పోరాడుతుంటే....అడ్డుకుంటోందనడం ముఖ్యమంత్రే అనడం అనైతికమన్నారు.


ముఖ్యమంత్రి చేతిలోనే రిజర్వేషన్లు

బీసిల వర్గీకరణ అమలు చేయడానికి ఏ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసిలకు సమగ్ర న్యాయం చేసే అవకాశం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దీనివల్ల ముస్లీంల తోపాటు, వందకు పైగా ఉన్న బీసీలకు చెందిన  చిన్నకులాలకు  రాజకీయపాధికారత కల్పించే అధికారంముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా తాత్సారం చేస్తూ కోర్టుల్లో  కొట్లాడుతాననడం ముఖ్యమంత్రి దాటవేత ధోరణికి నిదర్శనమని శ్రవణ్ అన్నారు.


కులగణన విషయం పై హైకోర్టు ఇచ్చిన  తీర్పు అమలు పరుస్తరా లేదా..శ్రవణ్

ఇంతవరకు హైకోర్టు తీర్పున ఆదారంగా బీసిల కులగణన మొదలు పెట్టిన దాఖాలాలు లేవు ఎందుకు ఈ వివక్ష మీ చేతిలో ఉన్న అధికారనాన్ని వినియోగించి బీసిలకు న్యాయం చేయకుండా శ్రవణ్ దుయ్యబట్టారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళుతాననడం బీసిలను మోసగించడమేనని, తాము 54 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతున్నామని అందుకోసమే కోర్టు తలుపు తట్టామని చెప్పారు. సమగ్ర సర్వేలో చేపట్టిన గణాంకాల ఆధారంగా ప్రభుత్వమే 52 శాతం బీసీలున్నారని  చెప్పిందని,  కోర్టు కూడా కులగణన చేయాలని తద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అసలు కోర్టు తీర్పులను అమలు చేసే ఆలోచన ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. 190 కులాలున్న కర్ణాటక రాష్ట్రంలో 80 :20 నిష్పత్తిలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న విషయం గమనించాలని  అదే విధంగా ఇక్కడ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


స్వప్నారెడ్డితో కాంగ్రెస్ కు ఏం సంబంధం

పార్టీలతో సంబంధంలేని పంచాయితీ ఎన్నికలను  పార్టీలకు అంటగట్టడం ముఖ్యమంత్రికి తగదని శ్రవణ్ హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పోసానిపేటకు చెందిన వి.స్వప్నారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని ఎవరు కోర్టుకు వెళ్లినా కాంగ్రెస్ ను ఆడిపోసుకోవడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని ,కోర్టు మొట్టికాయలు వేసి ప్రతిసారి తన  వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నెపం కాంగ్రెస్ పార్టీపై వేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని శ్రవణ్ విమర్శించారు.



 పంచాయతీ రాజ్ చట్టంలో 2018 లో  ఏ ఆధారంతో  34 శాతం రిజర్వేషన్లు పెట్టారని ఇందుకు గల  కారణాలేంటో తెలపాలని శ్రవణ్ ప్రశ్నించారు.  ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సుప్రీంకోర్టులో 54 శాతం రిజిర్వేషన్లు సాధించవచ్చని,  సామాజిక ఆర్ధిక వెనుక బాటుతనం తోపాటు బీసి లు ఎదుర్కోంటున్న రాజకీయ వెనుకబాటు తనాన్ని  పరిపూర్ణంగా విశ్లేశించి కోర్టుకు సరైన నివేదికలు సమర్పిస్తే ఏ కోర్టు రిజర్వేషన్లను అడ్డుకోదన్నారు. పామాజిక న్యాయం కూడా రాజ్యాంగంలో అంతర్భాగమేనని గుర్తుంచుకోవాలని మేమేంతో మాకంతేనని కోట్లాడుతున్న బీసిలకు  న్యాయం చేయాలని శ్రవణ్  విజ్నప్తి చేశారు.

No comments:

Post a Comment