Saturday 14 July 2018

వృత్తి నిపుణుల భాగస్వామ్యంతో కాంగ్రెస్‌ ముసాయిదా మ్యానిఫెస్టో–శ్రవణ్‌



వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను నిపుణుల భాగస్వామ్యంతో రూపొందిస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ వెల్లడించారు.
న్యూఢిల్లీలో శనివారం అఖిల భారత ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ (ఎఐపిసి) జాతీయ సదస్సులో డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సమర్పించారు. ఏఐపిసికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. రాజకీయాల్లో చేరేందుకు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనుకాడుతున్న వృత్తి నిపుణుల్లో ఏఐపిసి ఉత్సాహం నింపుతోందని వెల్లడించారు. రాజకీయాలంటే ఆసక్తి చూపడానికి ఏమాత్రం ఇష్టపడని వృత్తి నిపుణులు ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషించేందుకు, వారిలోని సృజనాత్మకతను దేశం కోసం ఉపయోగించేందుకు ఇది గొప్ప వేదికగా నిలిపేలా చేయడం అభినందించదగ్గ పరిణామమని శ్రవణ్‌ చెప్పారు.
ఈ కీలక సదస్సులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్‌ (ఎఐపిసి) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవరాలతోపాటు దేశ వ్యాప్తంగా వంద మంది నిపుణులు హాజరయ్యారు.
5 వ నవంబర్, 2017 న తెలంగాణ రాష్ట్ర వృత్తి నిపుణుల కాంగ్రెస్‌ విభాగం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యూనిట్‌కు బాగా స్పందన లభించిందని, లభిస్తున్న వృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ.. తెలంగాణ యూనిట్‌ గణనీయ పెరుగుదలను తెలియజేశారు. తెలంగాణ యూనిట్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఏడు చాప్టర్లను ప్రారంభించిందని, ఇందులో సభ్యుల సంఖ్య 432కు చేరడంతో తమలో ఉత్సాహాన్ని మరింత పెంచుతోందన్నారు. మొత్తం 25 ఈవెంట్స్‌ను నిర్వహించామని, ‘పెద్ద నోట్ల రద్దు–కుప్పకూలిన భారత ఆర్థిక వ్యవస్థ, ఈవీఎంల వల్ల అనర్ధాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ, బీమా బిల్లు–2017 వల్ల ప్రజలకు నష్టాలు, సమగ్రాభివృద్ధి–లక్ష్యాలు ... వంటి 25 అంశాలపై వృత్తినిపుణులతో సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పారు. అవే కాకుండా ఐటీ ఉద్యోగుల హక్కులు–కార్మిక చట్టాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలపై గ్రూప్‌ల్లో చర్చలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించామని వివరించారు. ఇవే కాకుండా కథువా, ఉన్నావ్‌ రేప్‌ సంఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు.
శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ.. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు ఒకో చాప్టర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 17 చాప్టర్లకు బదులు తెలంగాణలోని 31 జిల్లాకో ఒక చాప్టర్‌ను వచ్చే మూడు నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక అంశాల వర్క్‌షాపులు నిర్వహిస్తామని చెప్పారు. వృత్తి నిపుణుల సాయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రజల ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేస్తామని, అందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున తమ వంతు పాత్ర శక్తివంచన లేకుండా పోషిస్తామని శ్రవణ్‌ హామీ ఇచ్చారు.
పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన వాటిపై ప్రతిపాదనల్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విన్నవించారు. వృత్తి నిపుణులు సేవలు ఉపయోగించుకోవాలని రాహుల్‌గాంధీ చేసిన ప్రతిపాదనను సద్వినియోగం చేసుకుంటామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి పారదర్శక ప్రభుత్వం అందించేందుకు దోహదపడతామని శ్రవణ్‌ చెప్పారు.

Congress will involve Professionals to draft manifesto: Sravan

Hyderabad, July 14: TPCC Chief Spokesperson Dr. Dasoju Sravan said that the Congress party would involve professionals in drafting the party's manifesto for next elections.

Making a comprehensive power-point presentation in the national convention of All India Professional Congress (AIPC) in New Delhi on Saturday, Sravan said that there has been tremendous response to the APIC across Telangana State. Sravan, who heads the Telangana chapter of APIC, said that the organisation has provided a great platform to professionals who hesitate to join active politics, but are keen on playing a role in nation building with their innovative ideas.

Besides Rahul Gandhi, AIPC National Chairman Shashi Tharoor, former union minister Milind Deora and over 100 experts from across the country were present in the convention.

Launched on 5th November, 2017, Sravan informed that the Telangana unit of All India Professional Congress (AIPC) has registered a significant growth. The Telangana unit launched 7 chapters on 10th February this year and the Number of Fellows has reached 432. It organised more than 25 events which include discussions on 'Demonetization- Disaster of  Indian Economy', Financial Resolution & Deposit Insurance Bill, 2017 and Need for Abandoning of EVMs to Save Democracy, symposium on Integrating Sustainable Development Goals (SDG’s), seminar on Rights of IT Employees and Labor Laws and   Group Discussion on education and Employment Issues in Telangana. Protest was also held seeking Justice for Asifa and condemning Kathua and Unnao Rape incidents, he said.

Sravan informed that the AIPC plans to create one chapter in each Lok Sabha constituency (17 Chapters) or one chapter in each district (31 districts) in next 3-4 months. It will also constitute special Task Forces to derive inputs for election manifesto for both State and National level on various subjects.  A series of workshops on vital issues such as education, employment, health and agriculture will also be organised. With the help of Professionals, the Congress party will come up with a people's manifesto, he said.

Proposals were given to Congress president Rahul Gandhi on how to utilise the services of professionals for strengthening the party and in also evolving best policies for people. Sravan said that the Congress party should promise an accountable and transparent government as envisaged by professions and he emphasised that professionals must be given opportunities within the party hierarchy and also to content in forthcoming elections. Sravan also emphasised inorder to attract the professionals to politics and in particular towards AIPC, political reforms are needed where in role of money in elections is curtailed..A

Tuesday 10 July 2018

బీసిలకు కావలసింది 34 శాతం కాదు 52 శాతం

బీసిలకు కావలసింది 34 శాతం కాదు 52 శాతం

బీసిలకు 54 శాతం రిజర్వేషన్లు  ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది ...శ్రవణ్ దాసోజు

సుప్రీం కోర్టులో కొట్లాడాల్సింది బీసీలకు 52 శాతం కోసం

దామాషా ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ కొట్లాడుతుంటే  అడ్డుకుంటోందనడం అనైతికం

కులగణన చేయమని కోర్టుకెళ్లింది మేమేనన్న శ్రవణ్



హైదరాబాద్ :  ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం  కాంగ్రెస్ పార్టీ పై బట్టకాల్చి మీదవేయడం సరికాదని, అసలు కుల గణ న చేయకుండా బీసిలలో ఏకులాలలో ఎంత మంది ఉన్నారనే సమగ్ర సమాచారం సేకరించకుండా ఆదరాబాదరాగా ఎన్నికల ప్రహసనాన్ని మొదలు పెట్టి బీసీలను మోసం చేయాలనుకున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, 52%  రిజర్వేషన్ల కోసం కోట్లాడినమని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు తెలిపారు.


బీసిలకు కావలసింది 34 శాతం కాదు.... 52 శాతం

తాము దామాషా ప్రకారం 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతుంటే ఇవాల్టికి కూడా ముఖ్యమంత్రిగారు 34 శాతం రిజర్వేషన్ లు ఇస్తాననడం దీని కోనం సుప్రీంకోర్టుకు వెళుతాననడం బీసిలను మోసగించడమేనని  54 శాతం ఉన్న బీసిలకు  న్యాయబద్దంగా ఉన్న హక్కులను కాలరాయడమేనని శ్రవణ్ దాసోజు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమగ్ర కుటుంబ సర్వేప్రకారం బీసి లసంఖ్య 52 శాతం ఉందని చెప్పిన ప్రభుత్వం.. మరిప్పుడు 34 శాతం రిజర్వేషన్ల కోసం కోర్టులో కొట్లాడుతాననండ ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే న్యాయం చేయాలనుకుంటే అనుకుంటే బీసి లకు 54 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని  అదికూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని శ్రవణ్ దాసోజు గుర్తుచేశారు.


సుప్రీం కోర్టులో కొట్లాడాల్సింది బీసీలకు 54 శాతం కోసం

సుప్రీంకోర్టు లో కొట్లాడాల్సింది 34 శాతం రిజర్వేషన్ల కోసం కాదని , 52 శాతం కోసమని శ్రవణ్  అన్నారు.

బీసిలకు న్యాయం చేయమని కాంగ్రెస్ పోరాడుతుంటే....అడ్డుకుంటోందనడం ముఖ్యమంత్రే అనడం అనైతికమన్నారు.


ముఖ్యమంత్రి చేతిలోనే రిజర్వేషన్లు

బీసిల వర్గీకరణ అమలు చేయడానికి ఏ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసిలకు సమగ్ర న్యాయం చేసే అవకాశం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దీనివల్ల ముస్లీంల తోపాటు, వందకు పైగా ఉన్న బీసీలకు చెందిన  చిన్నకులాలకు  రాజకీయపాధికారత కల్పించే అధికారంముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా తాత్సారం చేస్తూ కోర్టుల్లో  కొట్లాడుతాననడం ముఖ్యమంత్రి దాటవేత ధోరణికి నిదర్శనమని శ్రవణ్ అన్నారు.


కులగణన విషయం పై హైకోర్టు ఇచ్చిన  తీర్పు అమలు పరుస్తరా లేదా..శ్రవణ్

ఇంతవరకు హైకోర్టు తీర్పున ఆదారంగా బీసిల కులగణన మొదలు పెట్టిన దాఖాలాలు లేవు ఎందుకు ఈ వివక్ష మీ చేతిలో ఉన్న అధికారనాన్ని వినియోగించి బీసిలకు న్యాయం చేయకుండా శ్రవణ్ దుయ్యబట్టారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళుతాననడం బీసిలను మోసగించడమేనని, తాము 54 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతున్నామని అందుకోసమే కోర్టు తలుపు తట్టామని చెప్పారు. సమగ్ర సర్వేలో చేపట్టిన గణాంకాల ఆధారంగా ప్రభుత్వమే 52 శాతం బీసీలున్నారని  చెప్పిందని,  కోర్టు కూడా కులగణన చేయాలని తద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అసలు కోర్టు తీర్పులను అమలు చేసే ఆలోచన ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. 190 కులాలున్న కర్ణాటక రాష్ట్రంలో 80 :20 నిష్పత్తిలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న విషయం గమనించాలని  అదే విధంగా ఇక్కడ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


స్వప్నారెడ్డితో కాంగ్రెస్ కు ఏం సంబంధం

పార్టీలతో సంబంధంలేని పంచాయితీ ఎన్నికలను  పార్టీలకు అంటగట్టడం ముఖ్యమంత్రికి తగదని శ్రవణ్ హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పోసానిపేటకు చెందిన వి.స్వప్నారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని ఎవరు కోర్టుకు వెళ్లినా కాంగ్రెస్ ను ఆడిపోసుకోవడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని ,కోర్టు మొట్టికాయలు వేసి ప్రతిసారి తన  వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నెపం కాంగ్రెస్ పార్టీపై వేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని శ్రవణ్ విమర్శించారు.



 పంచాయతీ రాజ్ చట్టంలో 2018 లో  ఏ ఆధారంతో  34 శాతం రిజర్వేషన్లు పెట్టారని ఇందుకు గల  కారణాలేంటో తెలపాలని శ్రవణ్ ప్రశ్నించారు.  ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సుప్రీంకోర్టులో 54 శాతం రిజిర్వేషన్లు సాధించవచ్చని,  సామాజిక ఆర్ధిక వెనుక బాటుతనం తోపాటు బీసి లు ఎదుర్కోంటున్న రాజకీయ వెనుకబాటు తనాన్ని  పరిపూర్ణంగా విశ్లేశించి కోర్టుకు సరైన నివేదికలు సమర్పిస్తే ఏ కోర్టు రిజర్వేషన్లను అడ్డుకోదన్నారు. పామాజిక న్యాయం కూడా రాజ్యాంగంలో అంతర్భాగమేనని గుర్తుంచుకోవాలని మేమేంతో మాకంతేనని కోట్లాడుతున్న బీసిలకు  న్యాయం చేయాలని శ్రవణ్  విజ్నప్తి చేశారు.

Sunday 1 July 2018

తెలంగాణ తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవని హెచ్చరిక : శ్రవణ్ దాసోజు




భూయజమానులకు,కౌలురైతులకు  పంచాయితీ పెడుతున్న కేసీఆర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర బహిరంగ సభలో కేసీఆర్  వైఫల్యాలను ఎండగట్టిన శ్రవణ్
తెలంగాణా తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవని హెచ్చరిక

హైదరాబాద్:  రైతుబంధు పథకం  కౌలు రైతుల కు వర్తింపచేయబోమంటూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  చేసిన ప్రకటన ను  టీసిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్రంగా  ఖండించారు.  
ఇవాళ దేవరకద్ర నియోజకవర్గంలో డోకూరి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో  జరిగిన  బహిరంగ సభలో  వందలాది మంది టీఆర్ ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా  ముఖ్యఅతిధిగా హాజరయిన శ్రవణ్ దాసోజు మాట్లాడారు. కేసీఆర్ రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలనుఆయన ఈసందర్భంగా దుయ్యబట్టారు. నిజమైన రైతుకు లబ్దిచేకూర్చకుండా బడాబాబులకు,  భూస్వాములకు లబ్దిచేకూర్చేలా రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ అసంబద్ద నిర్ణయం వల్ల సుమారు 60 లక్షల ఎకరాల భూమిని సాగుచేస్తున్న కౌలు రైతులకు  నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం వల్ల సుమారు 13 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన సన్న,చిన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం భూస్వాములకు  లబ్దిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధు పేరిట పెద్దమొత్తం లో చెక్కులు భూస్వాములకు  ఇచ్చారని అదే చిన్న సన్నకారు రైతులకు కేవలం స్వల్పమొత్తంలో చెక్కులు అందించారన్నారు. దాదాపు 1.5 లక్షల రైతులు కేవలం 100 రూపాయల చెక్కులు తీసుకున్నారని, ఇదెలా రైతుబంధు అవుతుందో . కేసీఆర్ ఎలా రైతుబంధువు అవుతారో చెప్పాలని డిమాండ్ చేసారు.  భూయాజమాన్య హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టంలో చిన్న సవరణ చేసి కౌలు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేసే అవకాశం ఉన్నా విస్మరించారని ఆరోపించారు. దీనివల్ల నిజమైన భూ యజమానులకెలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు. భూయజమానులకు హక్కులను రక్షిస్తూనే ఎండనకా వాననకా చెముడోడ్చి కష్టపడుతున్న కౌలురైతులను కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని శ్రవణ్ విజ్నప్తి చేసారు.సమగ్రకుటుంబ సర్వేలో స్పష్టంగా ఉన్న కౌలురైతుల వివరాలు సమగ్రకుటుంబ సర్వే లో సమగ్రంగా  కౌలు రైతుల వివరాలున్నా... ఎంత మంది కౌలురైతున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియదనడం పై శ్రవణ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అలాగే ఇటీవలి భూసర్వేలో సైతం కౌలురైతులు, భూయజమానుల వివరాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్ వైఫల్యాలను బట్టబయలు చేసిన శ్రవణ్
టీఆర్ఎస్ పాలనలో  వైఫల్యాల చిట్టాను శ్రవణ్ బయటపెట్టారు. ఎన్నికల ముందు నాలుగు నెలల్లో ఇస్తానన్న12 శాతం  ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లును నాలుగేళ్లు గడిచినా ఇవ్వలేదని దీని వల్ల గడిచిన నాలుగేళ్లుగా వారు అనేక అవకాశాలను కోల్పోయారని గుర్తుచేశారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములన కబ్జాకోరల్లోంచి విడిపిస్తామని ముస్లీం లపరం చేస్తామని చెప్పి ఒక్క ఎకరం కూడా వెనక్కి తీసకురాలేకపోయారని దుయ్యబట్టారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు 7865 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్ లోని దర్గాహసన్ షావలి  భూముల్లో ఆక్రమణలు తొలగించేందకు వక్ఫ్ బోర్డుకు  జ్యూడిషియల్ అధికారాలు ఇస్తామన్న   మానిఫెస్టోలో  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని శ్రవణ్ ఆరోపించారు.

తెలంగాణా తల్లిని తూలనాడితే పుట్ట గతులుండవు
అధికార మదంతో తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన తెలంగాణా తల్లి సోనియా గాంధీని అమ్మా బోమ్మా అంటూ మాట్లాడిన ఐటి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని  శ్రవణ్ అన్నారు. పక్కరాష్ట్రంలో రాజకీయంగానష్టపోయినా ఫర్వేలేదని  కడుపు చించకుని  సోనియా తెలంగాణా ఇచ్చినవిషయం మరిచి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వందలాది మంది బిడ్డల ఆత్మత్యాగాలను గుర్తించిన సోనియాగాంధీ ని తూలనాడితే పుట్టగతులుండవని హెచ్చరించారు.