Tuesday 26 June 2018

బి.సి కుల గ‌ణ‌న జ‌రిపించి ఎన్నిక‌లు జ‌ర‌పాలి.. హైకోర్టు తీర్పునైనా గౌర‌వించండి



బి.సి కుల గ‌ణ‌న జ‌రిపించి ఎన్నిక‌లు జ‌ర‌పాలి.. హైకోర్టు తీర్పునైనా గౌర‌వించండి

ఒక్క‌రోజులో స‌క‌ల జ‌నుల స‌ర్వే చేసిన‌, రెవిన్యూ రికార్డుల ప‌రిశీల‌న చేసిన స‌ర్కార్‌కు ఇది క‌ష్ట‌మా

కుల గ‌ణ‌ణ జ‌ర‌ప‌కుండా ఎన్నిక‌ల‌కు పోక‌పోతే బి.సి వ్య‌తిరేకి అయిన‌ట్టే.. టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌న్


కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా తెలంగాణ ప్ర‌బుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సిద్ద‌ప‌డింద‌ని, కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌ల‌ను గౌర‌వించ‌క‌పోయినా క‌నీసం హైకోర్టు ఆదేశాలైనా పాటించి బి.సిల‌లో కులాల వారీగా జ‌నాభా లెక్క‌లు చేసి పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బి.సిల‌లోని అన్ని ఉప కులాల‌కు రాజ‌కీయంగా న్యాయం జ‌రుగుతుంద‌ని ఈ విష‌యాన్నే తాము అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వానికి విన్న‌వించినా ప‌ట్టించుకోలేద‌ని చివ‌ర‌కు న్యాయ‌స్థాన్నాని సంప్ర‌దించాల్సి వ‌చ్చింద‌ని ఈ విష‌యంలో హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులైనా గౌర‌వించాల‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ శ్ర‌వ‌న్ దాసోజు అన్నారు. మంగ‌ళ‌వారం నాడు గాంధీభ‌వ‌న్ లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను స్వాగ‌తిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


ప్ర‌బుత్వం బి.సి జ‌నాభా లెక్క‌ల‌ల‌ను ఒక్కో ద‌గ్గ‌ర ఒక్కో ర‌కంగా ప్ర‌క‌టించింద‌ని, లోప‌భూయిష్టంగా లెక్క‌లుండ‌డం వ‌ల్ల బి.సిల‌కు రాజ‌కీయంగా అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. 2014లో తెలంగాణ రాగానే ప్ర‌భుత్వం చేప‌ట్టిన సమ‌గ్ర కుటుంబ స‌ర్వేలో తెలంగాణ‌లో 52 శాతం జ‌నాభా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింద‌ని, అంతేకాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో ముస్లీం రిజ‌ర్వేష‌న్ల బిల్లు విష‌యంలో బి.సిలు 37 శాతంగా పేర్కొన్నార‌ని, పంచాయ‌తీ బిల్లు చ‌ట్టంలో 34 శాతంగా పేర్కొన్నార‌ని  మ‌రి ఏది నిజ‌మో ప్ర‌భుత్వ‌మే చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ర‌కంగా ప్ర‌భుత్వం ఒక్కొ ద‌గ్గ‌ర ఒక్కొ విధంగా లెక్క‌లు పేర్కొన‌డం ఏమిట‌ని, జ‌నాభా ప్రాతిప‌దిక‌న వాటా కేటాయించాల‌ని అప్పుడే బి.సిల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.


ప్ర‌బుత్వం ఒక‌వైపు బి.సి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఎబిసిడిఇ విభ‌జ‌న చేసి ఎన్నిక‌ల‌కు పోతామ‌ని ప‌త్రికా మాధ్య‌మాల‌కు లీకులు ఇస్తుంద‌ని మ‌రోవైపు హైకోర్టు ఆదేశించినా కూడా కౌంట‌ర్ అఫ‌డివిట్ వేయ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వానికి బి.సిల‌లో కుల గ‌ణ‌న చేయాలంటే పెద్ద క‌ష్టం కాద‌ని, గ‌తంలో ఒక్క రోజులో 4 కోట్ల జ‌న‌భా ఉన్న తెలంగాణ‌లో స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేశామ‌ని చెప్ప‌కున్నార‌ని, ప‌క‌డ్బందీగా కోటికి పైగా ఉన్న స‌ర్వే నెంబ‌ర్ల‌ను రెవిన్యూ భూ ప్ర‌క్షాళ‌న చేశామ‌ని గొప్ప‌లు చెప్ప‌కున్నార‌ని అంత గొప్ప‌గా ఉన్నామ‌ని చెప్ప‌కుంటున్న ప్ర‌భుత్వానికి చిత్తశుద్ది ఉంటే బి.సి కులాల గ‌ణ‌న పెద్ద‌గా క‌ష్ట‌మైన ప‌ని కాద‌ని, క‌ర్ణాట‌క మాదిరిగా అక్క‌డ 190 బిసి కులాలుంటే రెండు వ‌ర్గాలుగా ఎ.బి వ‌ర్గీక‌ర‌ణ చేసి ఎ.కు 80 శాతం బి.కు 20 శాతం వాటా ఇచ్చి ఎన్నిక‌లు నిర్వ‌హించార‌ని అక్క‌డి మాదిరిగానే ఇక్క‌డ కూడా చేయ‌వ‌చ్చున‌ని అన్నారు.  బి.సిల విష‌య‌మై ప్ర‌బుత్వం నిర్ల‌క్ష్యం చేస్తే టిఆర్ ఎస్‌ను బి.సి వ్య‌తిరేకంగా గుర్తించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.


బి.సిల‌కు రాజ‌కీయంగా స్థానికి సంస్థ‌లు మొద‌టి మెట్టు అని వారు స‌ర్పంచ్‌లుగా, ఎం.పిటిసిలుగా, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లుగా ఎదిగితే రాబోయే రోజుల్లో వారికి రాజ‌కీయంగా మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, 119 మంది ఎం.ఎల్‌.ఎలు ఉంటే కేవ‌లం 20 మంది బి.సిలు మాత్ర‌మే ఎం.ఎల్‌.ఎలుగా ఉన్నార‌ని అటు రాజ్యంగ ర‌క్ష‌ణ లేక ఇటు ఆధిప‌త్య కులాల అండ లేక బి.సిలు క‌ట్టు బానిస‌లుగా వోట్లు వేసే యంత్రాలుగా మారుతున్నార‌ని, ఇప్ప‌టికీ దాదాపు వంద కులాలకు క‌నీస రాజ‌కీయ ప్రాతినిధ్యం లేక అణ‌చివేత‌కు గుర‌వుతున్నార‌ని ఆయ‌న ఆవేధ‌న వ్యక్తం చేశారు.   కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొది సారిగా జ‌రుగుతున్న ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో నైనా సామాజిక న్యాయం జ‌ర‌గాల‌ని రాజ్యంగ సాధికారిత ల‌భించాల‌ని తాను కోర్టును ఆశ్ర‌యించాన‌ని ఆయ‌న వివ‌రించారు.


ఈ విష‌యంలో  బి.సి స‌బ్బండ కులాలు ఐక్యంగా పోరాడాల‌ని ఆయన పిలుపునిచ్చారు. బిసిలకు గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌లు, మంగ‌లి క‌త్తులు, చాక‌లి బండ‌లు, ఇస్తిరి పెట్టేలు వ‌ద్ద‌ని వారికి రాజ‌కీయ అధికారం కావాల‌ని, మా జ‌నాభా ఎంతో మాకు అంత వాటా కావాల‌నే డిమాండ్‌తోనే బిసిలు పోరాడి సాధించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

కోర్టుకు పోయారు కాబ‌ట్టి ఎన్నిక‌ల‌ను ఆపి ఆ నింద‌ను బి.సిల‌పై వేసే కుట్ర‌ల‌కు ప్ర‌బుత్వం పాల్ప‌డ‌వ‌ద్ద‌ని వెంట‌నే స్పందించి బి.సి కుల గ‌ణ‌న చేసి వ‌ర్గీక‌ర‌ణ విభ‌జించి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


Friday 22 June 2018

బీసి ఉపకులాల రిజర్వేషన్లు కాంగ్రెస్ విజయమే..


రిజర్వేషన్లతో అన్ని ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం లభించనుందని వ్యాఖ్య.

రిజర్వేషన్ల కోసం కోర్టు తలుపు తట్టిన విషయాన్ని గుర్తుచేసిన శ్రవణ్





సమగ్ర కులగణన చేపట్టి తద్వారా బీసి ఉపకులాలకు 52 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్.

తెలంగాణా సర్కార్ బీసి లకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించనుందన్న విషయాన్ని స్వాగతిస్తున్నామని తద్వారా బీసి వర్గంలోని అన్నికులాలకు ప్రాతినిధ్యం లభించనుందని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు హర్హం వ్యక్తం చేశారు.

అధికారికంగా ప్రకటించక పోయినా బీసిలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించనుందన్న విషయం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ  బిసి ఉపకులాల రిజర్వేషన్ల కోసం చేసిన పోరాట ఫలితం ద్వారానే ప్రకటన వెలువడనుందని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి  శ్రవణ్ దాసోజు అన్నారు. శుక్రవారం మధ్యహ్నం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రవణ్ అణగారిన వర్గాలకు, అట్టడుగున ఉన్న 100 కులాలకు ఇవాళ ప్రాతినిధ్యం రానుందని పెద్దయెత్తున ప్రజాప్రతినిధులుగా అవకాశాలొస్తాయని అంబేధ్కర్ కలలు గన్న సమసమాజం స్ధాపించేందుకు దోహదమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెద్ద సంఖ్యలో ముస్లీంలకు అవకాశాలు

బీసి ఉపకులాల రిజర్వేషన్ల  వల్ల  ముస్లీం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వస్తాయని దీంతో  500 కు పైగా ముస్లీంలు  సర్పంచ్ లుగా మారనున్నారని  ఇది ఆ వర్గాలకు పెద్ద ప్రయోజనాన్ని కలిగించనుందని శ్రవణ్ తెలిపారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో విద్యాఉపాధి రంగాల్లో పేద ముస్లీం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఇవాళ మరో మారు వారి కి పంచాయితీ ఎన్నికల ద్వారా రాజ్యాధికారంలో కూడా అంతే వాటా కల్పించేందుక కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు.

బీసి ఉపకులాల రిజర్వేషన్ల కోసం స్వయంగా కోర్టుకెక్కిన విషయాన్ని గుర్తు చేసిన శ్రవణ్

బీసి లకు వర్గీకరణ కోసం ముఖ్యమంత్రికి లేఖలు రాసామని , ఎన్నో ప్రజావేదికల పై పోరాడామన్నారు. బీసి వర్గీకరణ శాస్త్రీయంగా చేపట్టాలని కోరామని తెలిపారు.  టీఆర్ ఎస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు  సిద్దమైన  పరిస్ధితుల్లో బీసి ఉపకులాలకు న్యాయమైన రిజర్వేషన్లు సాధించేందుకు వ్యక్తిగతంగా తాను హైకోర్టు తలుపు తట్టానని, న్యాయమూర్తి రామచంద్రరావు బీసిలకు అనుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్నినివేదిక కోరారని గుర్తుచేశారు.  దీంతో ప్రభుత్వం సైతం తాము కోరిన విధంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు  సుముఖత వ్యక్తం చేసిందని , సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ప్రభుత్వమే  లీకుల ద్వారా వెల్లడించిందని శ్రవణ్ అన్నారు.

బీసిల కు సాధికారత

బీసి ఉపకులాలల్లోని బీసి ఏ 8 శాతం, బీసిబి 11 శాతం, బీసి సి 1 శాతం, బీసి డి 9  బీసి ఈ 5 శాతం రిజర్వేషన్ల వల్ల అన్ని కులాలకు ప్రాతినిధ్యం వస్తుందన్నారు..బీసి ఉపకులాల వారిగా రిజర్వేషన్లు పెంచితే ఇబ్బందులొస్తయన్న అపోహలున్నప్పటికి  ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అక్కడ ఉన్న 190 బీసి కులాలను రెండు వర్గాలుగా విభజించిందని బీసిఏ వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు, బీసి బి వర్గానికి 80 శాతం రిజర్వేషన్లు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇచ్చారని ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుపేద బీసి కులాలకు, సాధికారత లభించాలని కోరుకుందని అదే రీతిలో తాము పోరాటం చేశామని బీసిలకు రిజర్వేషన్ల అంశాన్ని పార్టీ తరఫున పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లామని గుర్తుచేశారు. తమ పోరాట ఫలితమే రిజర్వేషన్లు పెంపుదల జరిగిందని ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నమని తెలిపారు.

సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్

గతంలో సుప్రిం కోర్టు మరియు హైకోర్టు లు ఇచ్చిన తీర్పుల ను గౌరవించి సమగ్ర సర్వే తరహాలో బీసి ఉపకులాల గణన శాస్త్రీయంగా చేపట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఏ కులం వాళ్లు , ఏ ఊళ్లో ఎక్కువ గా ఉంటే ఆ ఊరి పదవులు వారికే కేటాయించాలి.  అంతేకాకుండా బీసిలు 52 శాతం ఉన్నారని ప్రభుత్వమే చెప్పిందని అలాంటప్పుడు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.  మేమెంతో.. మాకంతే  స్ధాయిలో అవకాశాలు కల్పించాలని ఇందుకోసం కులగణన చేపట్టి శాస్రీయంగా రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

సస్టెయినబుల్  డెవలప్ మెంట్ గోల్స్ ....కాంగ్రెస్ మానిఫెస్టో 2019 అంశంపై సమావేశం

ఆల్ ఇండియా ప్రోఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 23 ఉదయం 10 గంటలకు, రెడ్ హిల్స్ లోని ప్యాప్ట్సీ భవన్  లో యూఎన్ డీపి ద్వారా నిర్ధేశించిన బడిన 17 అభివృద్ది లక్ష్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు సమావేశం జరగనుందని, ఇందులో రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన విధానాలు, మానిఫెస్టో తయారికి సంబంధించిన చర్చలు జరుగుతాయని శ్రవణ్ దాసోజు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొననున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు విద్యావేత్తలు నిపుణులు సాధారణ పౌరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.


Video : 

Wednesday 20 June 2018

BCs need political empowerment, not sops: Sravan Dasoju






Hyderabad, June 20: Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Sravan Dasoju said that the TRS Government was doing gross injustice with Backward Classes in Telangana State in the forthcoming Pachayat Raj elections by taking up reservation of seats in a scientific manner.

Addressing a press conference at Gandhi Bhavan on Wednesday, Sravan said that TRS Government was just trying to please the BC communities by distributing sheeps, fish or other tools to make them continue their ancestral professions. However, at political level, Chief Minister K. Chandrashekhar Rao has been conspiring  to suppress the BCs. He said the erroneous reservation of seats for BCs was aimed at preventing their political empowerment. Instead of taking actual percentage of BC population into consideration to reserve the seats, the State Government has been banking on various estimations to deny BCs their due share in power in Panchayat Raj elections.

Sravan said there were lot of contradictions in the figures pertaining to actual population of BCs in Telangana. Estimating the BC population to be 34% in 1999, same figure was used in implementation of reservation policy. However, only 34% seats have been reserved for BCs in the new Panchayat Raj Act although the Intensive Household Survey conducted by the State Government in August 2014 has estimated the BC population to be 52%. Strangely, he said the same government has estimated the BC population as 37% while presenting the Bill to enhance quota from 4% to 12% for Muslims under BC-E. "Which number should we trust? Is it 34%, 52% or 37%?" he asked.

The Congress leader said BCs are not a single community/group. They are referred to a category comprising of 113 communities divided into A, B, C, D and E groups. Therefore, he said reservation of seats without categorisation would cause huge injustice to various small communities which never got any representation in any of the elected bodies in the State. The existing 29% reservation is sub-divided among five groups of A - 7% (Aboriginal Tribes, Vimukthijatis, Nomadic and Semi-Nomadic Tribes, Orphans etc.,); B - 10% (Vocation Groups); C - 1% (SC converts into Christianity); D - 7% (Other Backward Classes) and E - 4% (Socially and educationally backward classes among Muslims). Therefore, in a broader perspective, the categorisation of reserved seats would benefit all communities in a broader manner and increase their representation in Panchayat Raj institutions. With 34% reservation, the quota for BC-A will increase to 8.2%; BC-B to 11.7%; BC-C to 1.2%; BC-D to 8.2% and BC-E to 4.8%. He said KCR talks of enhancing Muslims quota to 12%. However, by not agreeing for categorisation, he is preventing the increase in BC-E quota from 4% to even 4.8%.

Sravan pointed out that of 113 communities in all five categories, there were several communities which never got any representation in any elected posts. Citing figures of last elections, he said of 441 ZPTC, 196 were reserved for BCs. However, as many as 88 BC communities had no representation. Similarly, of 434 MPPs, 82 communities had no representation in 206 BC reserved seats. Of 6,490 MPTCs, 3267 were reserved for BCs and no one from 49 communities got elected to the post. Likewise, of 4,147 elected from BC reserved seats out of 8,692 Sarpanches, there was no representation from 57 communities. There is not a single councillor from 66 communities (898/1453) and 90 communities among Corporators (228/408). Of 55 Municipal Chairmen, 36 were reserved for BCs. Therefore, 99 BC communities had no representative on these posts.

Just 20 out of 119 MLAs (16.8%), 12 out of 40 MLCs and only 3 out of 17 Lok Sabha MPs belong to Backward Classes although their population is estimated to be around 52%, Sravan said.


Therefore, Sravan demanded that the State Government conduct door-to-door enumeration of BC population and implement categorisation in BC reserved seats in Panchayat Raj elections.


బి.సిల‌కు మంగ‌లి క‌త్తులు, ఇస్త్రి పెట్టెలు, చాక‌లి బండ‌లు, చేపలు, గొర్రెలు, బ‌ర్రెలేనా.. పాలానాధికారం మాకొద్దా... మా వాటా మాకివ్వండి: దాసోజు


తెలంగాణ వ‌స్తే మా వాటా మాకొస్త‌ద‌ని, అన్ని ప‌నులు ప‌క్క‌న పెట్టి క‌నీసం అస్తిత్వం కూడా లేని స‌బ్బండ  కులాలు ఉద్య‌మంలో పాలు పంచుకుంటే నేడు తెలంగాణ వ‌చ్చాక వారికి పాల‌నాధికారంలో పాలు ఇవ్వ‌కుండా గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌లు, చాక‌లి బండ‌లు, మంగలి క‌త్తులు ఇస్తూ  ఆఖ‌రికి రాజ్యంగ బ‌ద్ద‌మైన హ‌క్కుల‌ను కూడా కాల‌రాస్తున్నార‌ని,  తెలంగాణ వ‌స్తే సామాజిక న్యాయం ఏర్ప‌డుతుంద‌ని విశ్వ‌సించిన వెనుక‌బ‌డిన కులాల‌కు కేసిఆర్ ప్ర‌భుత్వం తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌న్ కుమార్ విమ‌ర్శించారు. 

గాంధీభ‌వ‌న్‌లో బుధ‌వారం నాడు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాబోయే పంచాయ‌తీ ఎన్నిక‌లు లోప‌భూయిష్టంగా ఇష్టారాజ్యంగా జ‌రిపేందుకు మ‌రి ముఖ్యంగా బి.సి గొంతు కోసేందుకు కేసిఆర్ స‌ర్కార్ స‌మాయాత్తం అయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. 1999లో బి.సిల జ‌నాభా ప్రాతిప‌దిక‌న 34 శాతం వాటా కేటాయించార‌ని, కానీ నేడు పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో కూడా అదే 34 శాతాన్ని కేటాయించి బి,సిలకు అన్యాయం చేస్తున్నార‌ని, ఇదే ప్ర‌భుత్వం గ‌తంలో స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే జ‌రిపిన‌పుడు బి.సిలు 52 శాతం ఉన్న‌ట్టుగా ప్ర‌క‌టించి అంతేకాకుండా ముస్లీంల‌కు 12 శాతం రిజర్వేష‌న్లు క‌ల్పిస్తూ చేసిన బిల్లులో 37 శాతం బి.సిలు ఉన్న‌ట్టు  లెక్క‌లు చూపించిన ప్ర‌భుత్వం , తీరా పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో  34 శాతానికి మాత్ర‌మే బి.సి ల‌ను కుదించ‌డం న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు. అందుచేత 

అందుచేత కొత్త రాష్ట్రంలో కొత్త‌గా వ‌స్తున్న పంచాయ‌తీ ఎన్నిక‌లు రాజ్యాధికారానికి తొలి మెట్ల‌ని, వీటిలో అన్యాయం జ‌రిగితే పై వ‌ర‌కు బి.సిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అందువ‌ల్ల తాను ఈ విష‌యాలపై న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాన‌ని ఆయ‌న వివ‌రించారు. తాను బి.సి ఈ విష‌యంలో చివ‌ర వ‌ర‌కు పోరాడుతాన‌ని, ఇక్క‌డ అన్యాయం జ‌రిగితే బి.సిల‌కు రాజ‌కీయంగా నిలువెల్ల అన్యాయం జ‌ర‌గుతుంద‌న అన్నారు. 

తెలంగాణ ఉద్య‌మంలో బి.సిల భాగ‌స్వామ్యం చాల పెద్ద‌గా ఉంద‌ని ప్ర‌తి కులం జెఎసీలు పెట్టి ఉపాధిని ప‌క్క‌న పెట్టి బ‌జార్ల ప‌డి కోట్లాడార‌ని ఉద్య‌మంలో అనేక కులాలు ముందుకొచ్చాయ‌ని వాట‌న్నింటిని గుర్తించాల‌ని ఆయ‌న అన్నారు. అందుకోసం ఇంటింటికి తిరిగి కులాల వారీగా స‌ర్వే చేయాల‌ని అప్పుడే బి.సిల‌కు కులాల‌వారిగా న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. బి.సిల‌లో అనేక కులాలున్నాయ‌ని, వారికి విద్యా, ఉపాధి రంగాల‌లో ఏ ర‌కంగా 25 శాతం వాటాను  వ‌ర్గీక‌ర‌ణ చేసి బి.సి రిజ‌ర్వేష‌న్లు కేటాయిస్తున్నారో అలాగే 34 శాతం పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల‌లో కూడా ఎబిసిడీఇ వ‌ర్గీక‌ర‌ణ చేసి రిజ‌ర్వేష‌న్ల కేటాయింపులు జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముస్లీంల‌కు ఇచ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్లు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో అమ‌లు ప‌రిస్తే పెద్ద ఎత్తున ముస్లీంలు కూడా రాజ‌కీయంగా ఎదిగే అవ‌కాశ‌ముంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. కేసిఆర్ 12 శాతం రిజ‌ర్వేష‌న్లు పేప‌ర్ల మీద పెట్టి మోసం చేస్తే కాంగ్రెస్ మాత్రం అన్ని వ‌ర్గాల‌కు స‌మాన న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటుంద‌ని ఆయ‌న అన్నారు. 

బి.సిల‌లో దాదాపు 113 కులాలుంటే దాదాపు వంద కులాల‌కు పైగా క‌నీస రాజ‌కీయ ప్రాతినిధ్యం ల‌భించ‌లేద‌ని అంటు, ప్ర‌భుత్వం ఎబిసిడిఇ వ‌ర్గీక‌ర‌ణ డిమాండ్‌ను అమ‌లు చేస్తే ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస రాజ్యధికారం నోచుకొని పేద కులాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో మొత్తం 441 జ‌డ్‌పిటిసిల‌లో 196 జ‌డ్‌పిటిసి స్తానాలు బి.సిల‌కు కేటాయిస్తే 88 కులాల‌కు ప్రాతినిధ్యం లేద‌ని, ఎం.పి.పిలు 434 ఉంటే బి.సిల‌కు 206 కేటాయించార‌ని వాటిలో 82 బి.సి కులాల‌కు ప్రాతినిధ్యం లేద‌ని, ఎం.పి.టి.సిలు 6490 ఉంటే బిసిల‌కు 3267 కేటాయించార‌ని అందులో 49 బి.సి కులాల‌కు ప్రాతినిధ్యం ంలేదని 8,692 స‌ర్పంచ్ స్థానాలుంటే 4,147 బి.సిల‌కు కేటాయిస్తే 57 బిసి కులాల‌కు ప్రాతినిధ్యం లేద‌ని, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు 1453 ఉంటే బిసిల‌కు 898 కేటాయించార‌ని అందులో 66 కులాల‌కు స్థానం లేద‌ని, జిహెచ్ఎంసి తో స‌హా ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ల‌లో 408 కార్పోరేట‌ర్ల స్థానాలుంటే 228 బి.సిల‌కు కేటాయిస్తే 90 కులాల‌కు బి.సి కులాల‌కు స్థానం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. మున్సిప‌ల్ చైర్మ‌న్లు 55 మంది ఉంటే బి.సిల‌కు కేటాయించిన‌వి 36 అని అందులో 99 బి.సి కులాల‌కు ప్రాతినిధ్యం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. 

తెలంగాణ‌లో 119 అసెంబ్లీ స్థానాలుంటే  బి.సిలు కేవ‌లం 20 మంది మాత్ర‌మే ఉన్నార‌ని,  52 శాతం ఉన్న బిసిల‌కు 16.8 మాత్ర‌మే ప్రాతినిధ్యం ఉంద‌ని ఎం.పీలు 17 మంది ఉంటే కేవలం 3 మాత్ర‌మే బి.సిలున్నార‌ని, ఎం.ఎల్‌.సిలు 40 మంది ఉంటే కేవ‌లం 12 మంది మాత్ర‌మే ఉన్నార‌ని మొత్తంమీద బి.సిల‌కు రాజ్యధికారంలో స‌మ‌తుల్య‌మైన వాటా ల‌భిస్త‌లేద‌ని సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని క‌న్న క‌ల‌లు క‌ల్ల‌లు అవుతున్నాయ‌ని బాధ వ్య‌క్తం చేశారు. 

ప్ర‌భుత్వం భేష‌జాల‌కు పోకుండా ఇంటింటి స‌ర్వే చేసి బి.సి ఘ‌న‌న పూర్తి చేసి ఆ విధంగా బి.సి వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుగునంగా రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని, పేద కులాల‌కు న్యాయం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒక రోజులోనే స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేసిన ఈ ప్ర‌భుత్వం బి.సి కుల గ‌ణ‌న‌ చేయ‌డానికి కేవ‌లం ప‌ది రోజుల్లో పూర్తి చేయ‌వ‌చ్చున‌ని, బి.సిల‌కు రాజ్యంగ ప‌ర‌మైన హ‌క్కుల‌ను కాల రాయ‌వ‌ద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

Press Meet VideoLink : https://youtu.be/0ZiXHJUAFdg

Tuesday 19 June 2018

PR Polls: Sravan Dasoju approaches High Court over BC reservation



Hyderabad, June 19: Accusing TRS Government of doing injustice with Backward Classes, TPCC Chief Spokesperson Dr. Dasoju Sravan has approached the High Court seeking its intervention in ensuring scientific approach to reservation of seats for BC communities and its sub groups  and compliance of statutory provisions in the forthcoming Panchayat Raj elections.

The Honorable High Court of Andhra Pradesh & Telangana accepted writ petition WP No. 477/ 2018 and Honorable Justice MS Ramchander Rao, after hearing both the versions today, directed the GP, government of Telangana to inform the court whether enumeration of BC population is being done and if so how it is being done. And the case is posted to Monday, 25th June, 2018

Sravan requested the High Court to direct the government to ensure that the seats meant for BCs are sub divided among the sub-groups (BC A, B, C, D, E) through a scientific BC population enumeration. Referring to the petition, Sravan demanded that the Government of Telangana must avoid being biased towards BCs and ensure that statutory justice is done.

The petitioners, Dr. Dasoju Sravan and B. Ravindranath, filed a petition before the High Court stating that the authorities were not properly determining the reservation for backward classes, more specifically the allotment of the offices of the sarpanches and other posts of Panchyat Raj institutions in each district mandal, village level. They alleged that there was no data or information available as to the population of the backward classes at the state, district, mandal and village level. Further, they contended that there was total lack of information about the percentage of each sub-category of backward classes at all levels. Consequently, the total seats meant for BC community could not be sub-divided among the five groups as also directed by the court.

As per Telangana Panchayat Raj Act, the BC communities are entitled for 34% reservation, As per existing  present, 29% reservation in education and education sectors, the reservation is sub-divided among five groups of A - 7% (Aboriginal Tribes, Vimukthijatis, Nomadic and Semi-Nomadic Tribes, Orphans etc.,); B - 10% (Vocation Groups); C - 1% (SC converts into Christianity); D - 7% (Other Backward Classes) and E - 4% (Socially and educationally backward classes among Muslims). Sravan alleged in his petition that Telangana government did not provide any clarity as how this reservations for BC subcategories is implemented though very clear judgments were given by supreme court and as well by high court of Andhra Pradesh in various occasions. 

Sravan said that the conjoint reading of Article 15(4) along with Section 2(1) of the Act makes it clear that backward classes for the purposes of the Act would be as BC-A, BC-B, BC-C, BC-D and BC-E as a corollary the 34% reservation for backward classes provided under Section 17(4) would have be allocated among these sub-categories proportionally. This is not being done now in the present elections, he said.

Sravan also expressed in his petition that there are serious contradictions and confusions in the panchayat raj act and the way BC population is being estimated. While under Section 13 of Panchayat Act, the government talks of doing enumeration of BC voters, the Section 17 intends to allocate the percentage of reservation based on the percentage of population. Subsequently, the government is taking into consideration the BC population figures projected by the Directorate of Economics and Statistics. These contradictions are leading to gross injustice to all  BCs. 

Sravan alleged that government is not doing any BC population enumeration, except media reports of such exercises, the government agencies did not place any information in the public domain relating to this exercise," he said and also complained that the authorities did not furnish the information sought under the Right to Information Act. He said reservations made in favour of BCs based on erroneous and cursory estimation of their population were challenged in 1987, 2006 and 2012. The High Court of Andhra Pradesh had also directed that these reservations should be reviewed from time to time," he said in the petition.

Sravan appealed to the State Government to conduct a door-to-door survey to get the real number of BCs, along with their sub-categories. He also claimed that this exercise could be completed in not more than 10 days.

"In the absence of such an exercise being undertaken the allotment of seats reserved for backward classes and their sub categories at the mandal and district village level would be subject to wholesale manipulation and result in gerrymandering of constituencies by virtue of ensuring that seats which should be reserved for the backward classes are left open for others to participate in the said elections resulting in violation of the letter and spirit of reservation process set out under the Act. The allotment to sub groups also will suffer. Any wholesale reservation being accorded to an omnibus backward classes constituency would not be in accordance with Section 17 of the Act inasmuch as a reading of provisions would clearly show that the reservations under Section 17 would have to be made category-wise of the backward classes as mentioned above and in the proportion of reservation that would be available to them in the total 34% available to BCs," he said. 



1. పంచాయితీరాజ్ ఎన్నికలలో బీసీ ఉపకులాలకు న్యాయమైన వాటా కోరుతూ  హైకోర్ట్ తలుపు తట్టిన శ్రవణ్ దాసోజు.
2. బీసీకుల గణన వివరాలు తెలపాలని తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్ట్ న్యాయమూర్తి శ్రీ రామచంద్రరావు,
3. కేసును జూన్ 25 కు వాయిదా వేసిన న్యాయమూర్తి



హైదరాబాద్, జూన్ 19: రాబోయే పంచాయత్ రాజ్ ఎన్నికల్లో బిసి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో  తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిని అవలంబించలేదని ఆరోపిస్తూ టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు హైకోర్టు తలుపు తట్టారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ఉమ్మడి హైకోర్ట్  WP No. 20477/2018 పిటీషన్ ద్వారా స్వీకరించి, పిటిషనర్, ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత తెలంగాణా ప్రభుత్వానికి బీసి జన గణన చేస్తున్నారా, ఒకవేళ చేస్తుంటే వివరాలను కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ తదుపరి వాదనలకు ఈనెల 25కు వాయిదా వేసినట్లు తెలిపింది.

వెనుకపడిన కులాల సమగ్రమైన గణన చేపట్టాలని, వెనుకబడిన తరగతులు అంటే 5 ఉపకులాలు (బీసీ ,బీసీబీ, బీసీసి , బీసీడి, బీసీ) గా విభజించాలని, జనాభా గణనలో శాస్త్రీయ విధానం అవలంబించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును శ్రవణ్ అభ్యర్ధించారు. పిటిషన్ ఆధారంగా బీసీ కులాల అన్నిరంగాల్లో ఎదిగేందుకు తగిన భరోసా కల్పించాలని, న్యాయం చేయాలని తెలంగాణా ప్రభుత్వాన్ని శ్రవణ్ డిమాండ్ చేశారు

శ్రవణ్ తోపాటు మరో పిటీషనర్ బి. రవీంద్రనాథ్  లు తెలంగాణా ప్రభుత్వం ఆదరాబాదరాగా  వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు నిర్ణయించారని, అన్నిజిల్లాల్లో మండల స్ధాయి, గ్రామస్ధాయిలో ప్రత్యేకంగా సర్పంచ్ కార్యాలయాల కేటాయింపు మరియు పంచాయత్ రాజ్ సంస్థల ఇతర అధికారాలను అధికారులు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను సరిగా గుర్తించలేదని వారు ఆరోపించారు. రాష్ట్రస్ధాయినుంచి మొదలుకొంటే జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఎక్కడా  వెనుకబడిన తరగతుల జనాభాకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచలేదని  ఆరోపించారు. అంతేకాక, అన్ని స్థాయిలలో వెనుకబడిన కులాలు, ఉపకులాల దామాషా కు చెందిన సమాచారం లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఆధారంగా  బీసి కులాలకు ఉద్దేశించిన 5 ఉపకులాల  గణన సరిగా చేపట్టలేదని  తెలిపారు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 15(4) సెక్షన్ 2(1) ప్రకారం  వెనుకబడిన తరగతులు అంటే బీసీ , బీసీబీ, బీసీసి , బీసీడి, బీసీఈలుగా విభజించారని గ్రూపులన్నింటికి కలిపి సెక్షన్ 17(4) ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఏర్పరిచారని. కాని దురదృష్టవశాత్తూ దామాషా ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికలు జరగబోవడం లేదని  శ్రవణ్ తెలిపారు.

తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం విద్యా రంగంలో బీసీ లకు గతంలో ఉన్న 29 శాతం రిజర్వేషన్లకు గాను  34 శాతం రిజర్వేషన్లు ఏర్పరించిదని  రిజర్వేషన్లు ఐదు ఉప విభాగాలు గా అమలు పరిచేందుకు బీసీ 7శాతం, (అబోరిజినల్ ట్రైబ్స్,విముక్తజాతులు,నోమాడిక్ మరియు సెమీ నోమాడిక్ జాతులు, అనాధలు మొదలయినవారు) బీసీబీ 10శాతం (వోకేషన్ గ్రూపులు) బీసీసి  1శాతం (క్రిస్టియన్ కన్వర్ట్ ఎస్సీలు) బీసీడీ  7శాతం (ఇతర వెనుకబడిన తరగతులు), బీసీ 4శాతం (పేద మరియు వెనుకబడిన ముస్లీం మైనార్టీలు) గా విభజించారని పేర్కోన్నారు. గతంలో సుప్రీం కోర్టు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు స్ఫష్టంగా ఉన్నా సూచనలేవీ  తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు సమగ్రంగా లేవని శ్రవణ్ తన పిటీషన్లో ఆరోపించారు.

తెలంగాణా  పంచాయతీరాజ్ యాక్ట్  2018 లో ఎన్నో గందరగోళాలు, తికమకలున్నాయని  శ్రవణ్ తెలిపారు. పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం  బీసీ ఓటర్లను  గణన  చేస్తామని చెప్పి తర్వాత ఏమాత్రం పొంతన లేకుండా సెక్షన్ 17 ప్రకారం బీసీ జనాభా లెక్కలు తీస్తారని తెలిపారు తదుపరిబీసీ ప్రభుత్వం ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ చేత అంచనా వేసిన బిసి  జనాభా గణాంకాలు పరిగణనలోకి తీసుకుని, రిజర్వేషన్స్ ప్రకటిస్తారని తెలిపి మొత్తం గందరగోళం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా  బీసీకులాలకు అన్యాయం చేయడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం బీసీ కులాల గణన ను సక్రమంగా చేపట్టలేదని కేవలం మీడియా మాధ్యమాల వద్ద మాత్రమే బీసీ కులాల వివరాలున్నాయని  ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని తెలపడంలేదని శ్రవణ్ ఆరోపించారు. విషయంలో అధికారులు  వద్దనుంచి ఆర్ టి ద్వారా అడిగితే కూడా ఎలాంటి సమాచారం కూడా రావడం లేదని ఆయన ఫిర్యాదుచేశారు. తెలంగాణా ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా అసలైన బీసీ కుల గణనఉపకులాల వర్గీకరణ చేపట్టాలని కోరారు. బీసీ ఉప కులాలకు న్యాయమైన వాటా  పంచాయితీరాజ్  ఎన్నికలలో కల్పించాలని కోరుతూశాస్త్రీయ పద్దతిలో బీసీ కుల గణన  కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తిచే యొచ్చని కోర్టుకు తెలిపారు.

Saturday 9 June 2018

TPCC Chief Spokesperson Dr. Dasoju Sravan demands enumeration of OBC Voters

PR Polls: Congress demands enumeration of OBC Voters

Hyderabad, June 9: Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokespersons Dr. Dasoju Sravan demanded that the reservation of seats for BCs in the forthcoming Panchayat Raj elections be done in a scientific manner only on the basis of a door-to-door enumeration to get exact figures of voters belonging to backward classes and implement rule of reservation as per A,B,C, D classification among BCs.



Addressing a press conference at Gandhi Bhavan on Saturday, Sravan said that the OBC population constitutes more than 52%, as per “Samagra Kutumba Survey (SKS)” taken up by Telangana Government in 2014.  However, he said that the OBCs were being denied their due share in socio-economic resources and political opportunities. "The saga of deliberate deprival and denial of justice is apparently being reflected even in forthcoming Panchayat Raj elections. The New Panchayatraj Act is totally confusing and contradicting the very spirit of 73rd constitutional amendment and subsequent verdicts of High Court of Andhra Pradesh nullifying the OBC reservations," he said.



Sravan wrote a letter to Chief Minister K. Chandrashekhar Rao, the Chief Secretary and Telangana State Commission for Backward Classes Chairman in this regard.



He stated that Telangana, being a new State, should implement 73rd constitutional amendment to establish appropriate democratic processes and precedence.



"The 73rd amendment by incorporation of Article 243D provided for reservation of seats/elected officers to members of the schedule castes, schedule tribes and backward classes of citizens. Article 243 D (6) granted power to the legislature for making provisions for reservation of seats in any Panchayat Raj officers or Chair Persons at Panchayats in any level in favour of backward classes of citizens.   Even prior to these amendments, erstwhile State of Andhra Pradesh had made provisions for reservations of seats in favour of backward classes of citizens. These reservations made before and after the 73rd amendment were reflected in the earlier Panchayat Raj Act of 1966 and the Panchayat Raj Act 1994.   The present Telangana Panchayat Raj Act, 2018 also provides for such reservations.



Sravan pointed out that these reservations are made in favour of backward classes of citizens have always been challenged due to the unscientific method in which the population of backward classes has been estimated. And the reservations made on the basis of such unscientific or erroneous methods have resulted in serious challenges before the Honourable High Court of Andhra Pradesh and has also lead to observations being made by the Honourable High Court. He also listed out various cases that were reported from 1987 to 2012.



"The Telangana Panchayat Raj Act, 1994 has now been repeated and replaced by the Telangana Panchayat Raj Act, 2018.   Under the 2018 Act, Section 17 provides for reservation for office of Sarpanch for members of schedule castes, schedule tribes, backward classes and women.   Section 17(7) provides for the manner in which the reservation for backward classes is to be done.  The provisions of Section 17 (7) show that for the purposes of determining number of officers of Sarpanches to be reserved for backward classes, the District Collector would have to arrive at this number on the basis of the proportionate percentage of population of backward classes in the State and in the Mandal.  It also provides that the Mandal backward classes percentage is the figure as projected by the directorate of economics and statistics," he pointed out.



However, Section 13 of the Panchayat Raj act also stipulates that the government shall identify all the backward classes voters as per schedule of not more than 15 days, which shall be issued by the Government.



"In view of the earlier challenges to the fixation of reservation for backward classes especially in view of the faulty methods followed by the State for making such calculations, it is necessary that the provisions of Section 13 are applied properly both in letter and spirit in the new state of Telangana. Such compliance would require a door to door enumeration of the members of backward classes to ascertain the population of the backward classes. Any failure to make such enumeration or any faulty enumeration on the basis of cursory surveys or on the basis of simple surveys would not be sufficient for the purpose of Section 13 of the Panchayat Raj Act, 2018," Sravan said.



Sravan said a door to door enumeration would also clearly show that the backward classes population in Telangana exceeds 52% of the general population. Therefore, he said reservation for BCs would have to be made in accordance with these figures. "Any estimate or calculation made on extrapolation would only result in injustice to the backward classes as this extrapolation etc., would look to reduce the actual population of the backward classes and thereby depriving the backward classes of the reservation that they are entitled to," he said. (eom)



ముఖ్య‌మంత్రి కేసిఆర్‌కు లేఖ‌ : బి.సిల‌ జ‌నాభాకు అనుగుణంగా న్యాయ‌బ‌ద్ద‌మైన వాటా ఇవ్వాలి : శ్రవణ్ దాసోజు

ఎబిసిడి వ‌ర్గీక‌ర‌ణను అమ‌లు చేయాలి.
ఇంటింటికి తిరిగి బి.సి జ‌నాభా గ‌ణ‌న‌ చేయాలి
లోప‌భూయిష్టంగా పంచాయ‌తీ చ‌ట్టం
ఆర్‌.టి.సిపై ఎస్మా అంటే త‌స్మాత్ జాగ్ర‌త్త‌...దాసోజు శ్ర‌వ‌న్





పంచాయ‌త్ రాజ్ చ‌ట్టం లోప‌భూయిష్టంగా ఉంద‌ని, అందులోని అంశాలు ఒక‌దానికి ఒక‌టి విరుద్దంగా ఉన్నాయ‌ని ప్ర‌ధానంగా బి.సి జ‌నాభా గ‌ణ‌న విష‌యంలో బి.సిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో బి.సిల‌కు న్యాయ‌బ‌ద్ద‌మైన వాటా రావాలంటే శాస్థ్రీయంగా జ‌నాభా గ‌ణ‌న జ‌ర‌పాల‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బి.సి సాధికారిక క‌మిటీ స‌భ్యులు దాసోజు శ్ర‌వ‌న్ అన్నారు. శ‌నివారం నాడు గాంధీభవ‌న్ ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో బి.సిల‌కు న్యాయ‌మైన వాటా రావాలంటే ప‌క్కాగా బి.సి జ‌న‌భా జ‌ర‌పాల‌ని, ఇంటింటికి తిరిగి బి.సి జ‌నాభా లెక్క‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం రూపొందించిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం సెక్ష‌న్ 13 ప్ర‌కారం 15 రోజుల‌లో జ‌నాభా లెక్క‌లు చేప‌ట్టి రిజ‌ర్వేష‌న్ల అమ‌లు చేయాల‌ని నిబంధ‌న పెట్టార‌ని 12 వేల పంచాయ‌తీలలో జ‌నభా లెక్క‌లు తేల్చాలంటే 15 రోజుల స‌మ‌యంలో ఎలా స‌రిపోతుంద‌ని ఇది కేవ‌లం తూతూ మంత్రంగా జ‌రిగే కార్య‌క్ర‌మంగా మాత్ర‌మే చేప‌డుతున్నార‌ని చెట్ల కింద కూసొని జ‌నాభా గ‌ణ‌న జ‌రుగుతుంద‌ని దీని వ‌ల్ల బి.సిల‌కు చాల న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సెక్ష‌న్ 17 ప్ర‌కారం బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్  ఆధారంగా  జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్
ప్ర‌క్రియ చేప‌డుతామ‌ని పేర్కొన్నార‌ని అయితే 2011లో చేప‌ట్టిన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం చేప‌డితే బి.సిల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేప‌ట్టిన సంద‌ర్భంలో బి.సిలు 52 శాతం ఉన్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించార‌ని కానీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మాత్రం 2011 లెక్క‌ల ఆధారంగా చేప‌డుతామ‌ని అన‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా బి.సిల‌కు అన్యాయం చేసేందుకు కుట్ర‌లో భాగ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌తంలో న్యాయ‌స్థానాల‌లో నిమ్మ‌క్ రాజ్ ఆంద్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వానికి జ‌రిగిన పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేసులో న్యాయ‌స్థానం జ‌న‌భా గ‌ణ‌న శాస్త్రీయంగా ఇంటింటికి తిరిగి చేప‌ట్టాల‌ని తీర్పు చెప్పింద‌ని ఆయ‌న అన్నారు.

బ‌.సిల కుల గ‌ణ‌న శాస్త్రీయంగా చేయ‌క‌పోతే బి.సి ఎబిసిడి వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కులాల‌కు అన్యాయం జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో   బి.సిల‌లోని చిన్న కులాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.  చ‌ట్ట ప్ర‌కారం ఎన్నిక‌ల‌లో కూడా ఎబిసిడీ వ‌ర్గీక‌ర‌ణ ప్ర‌కారం రిజర్వేష‌న్ల కేటాయింపులు జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వం ఈ కేసుల ఆధారంగా ఇంటింటికి తిరిగి ఎందుకు చేప‌ట్ట‌డం లేద‌ని, కోర్టు తీర్పుల‌ను ఎందుకు గౌర‌వించ‌డం లేద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 73వ రాజ్యంగ స‌వ‌ర‌ణ‌ను ఎందుకు ఉల్లంఘిస్తున్నార‌ని, ఇదంతా బి.సిల‌కు న‌ష్టం జ‌రిగే కార్య‌క్ర‌మాల‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో బి.సిలైన ఉద్య‌మ సిద్దాంత క‌ర్త‌ జ‌య‌శంక‌ర్ నుంచి మొద‌లుకొని శ్రీ‌కాంత‌చారి, కానిస్టేబుల్ కృష్ణ‌య్య, యాద‌య్య‌లు తెలంగాణ ఉద్య‌మంలో బ‌లయ్యార‌ని, 1500 మంది ఆత్మ‌త్యాగాలు చేస్తే అందులో మెజారిటీగా బి.సిలే త్యాగాలు చేశార‌ని కానీ ఇప్ప‌డు బిసిల‌ను బిచ్చ‌గాళ్ళుగా మార్చుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో ఉప స‌ర్పంచ్‌కు చెక్ ప‌వ‌ర్ ఇవ్వ‌డ‌మంటే బి.సి, ఇత‌ర రిజ‌ర్వేష‌న్ స‌ర్పంచ్‌ల‌పై ఉప స‌ర్పంచ్‌ల పెత్త‌నాన్ని పెంచ‌డానికేన‌ని ఆయ‌న అన్నారు.
ఏదేమయినప్పడికి   రాజ్యాంగపరమైన హక్కులను పొందడంలో  మాత్రం వెనుకంజలో ఉన్నమ‌ని మరిముఖ్యంగా తెలంగాణాలో త‌మ‌కు న్యాయంగా రావాల్సిన సామాజిక, ఆర్ధిక వనరులు, రాజకీయ అవకాశాల పొందడంలో ఓబీసిల  పట్ల ఉద్దేశ్యపూర్వకమైన సాచివేత  ధోరణి కొనసాగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

ఆర్‌.టి.సిపై ఎస్మా అంటే త‌స్మాత్ జాగ్ర‌త్త‌
ఆర్‌.టి.సి కార్మికులు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా పాల్గొన్నార‌ని వారు న్యాయప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మె చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి నోటీసు ఇస్తే ఎస్మా ప్ర‌యోగిస్తామ‌ని కేసిఆర్ హెచ్చ‌రిస్తున్నార‌ని ఇది రాజ్యంగ విరుద్దమ‌ని దాసోజు శ్ర‌వ‌న్ అన్నారు. ఎస్మా ప్ర‌యోగిస్తే త‌స్మాత్ జాగ్ర‌త్త అని ఆయ‌న హెచ్చ‌రించారు. స‌మ్మె కార్మికుల ప్రాథ‌మిక హ‌క్కు అని స‌మ్మెలు చేయ‌క‌పోతే తెలంగాణ ఎలా వ‌చ్చేద‌ని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో స‌మ్మెలు చేయాల‌ని పిలుపునిచ్చిన కేసిఆర్ ఇప్ప‌డు అధికారంలోకి రాగానే స‌మ్మెలు అంటే ఉలిక్కి ప‌డుతున్నార‌ని తెలంగాణ ఉద్య‌మంలో స‌మ్మెల‌పైన ఉక్కుపాదం మోపితే తెలంగాణ వ‌చ్చేదా.. కేసిఆర్ సి.ఎం అయ్యే వారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఆర్‌.టి.సి నిజాం వార‌స‌త్వ సంద‌ప అని ఇప్ప‌టికీ ఆర్‌.టి.సి నెంబ‌ర్ ప్లేట్ల‌కు జ‌డ్ అనే అక్ష‌రంతో అని నిజాం వార‌స‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. వంద‌ల ఏళ్ళ చ‌రిత్ర ఉన్న ఆర్‌.టి.సిని మూస్తేస్తామ‌ని అని అన‌డం కేసిఆర్ మూర్ఖ‌త్వ‌మ‌ని అన్నారు. ఆర్‌.టి.సి కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌కు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని కార్మిక సంఘాల‌తో సామ‌ర‌స్య పూర్వ‌క చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. ఎయిర్ బ‌స్‌ల‌లో తిరిగే కేసిఆర్‌కు ఎర్ర బ‌స్‌ల‌లో తిరిగే పేద‌ల క‌ష్టాలు తెలియ‌డం లేద‌ని, ఆర్‌.టి.సి స‌మ్మె చేస్తే పేద ప్ర‌యాణీకుల‌తోపాటు పాలు, కూర‌గాయ‌లు అమ్మ‌కునే వేలాది మంది రైతులు న‌ష్ట‌పోతార‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం వాస్త‌వ విరుద్దంగా ప‌నిచేస్తే ఉద్య‌మం తీవ్ర‌త‌రం అవుతుంద‌ని అన్నారు. ప్రైవేట్ సంస్థ‌లు బాగా ప‌నిచేస్తున్నాయ‌ని వారికి ఎలా లాభాలు వ‌స్తున్నాయ‌ని కేసిఆర్ మాట్లాడ‌డం ఆయ‌న అవివేకానికి ప‌రాకాష్ట అన్నారు. ప్రేవేట్ సంస్థ‌ల‌ను నియంత్రిస్తే ఆర్‌.టి.సి లాభాల బాట‌లో ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు.
...........................................................

09.06.2018
శ్రీయుత  కల్వకుంట చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ గారికి.,

ఆర్యా..

విషయం: పంచాయతీరాజ్ ఎన్నికల్లో  రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్ కేటాయింపులు... తెలంగాణా రాష్ట్రంలో ఓబీసి ఓటర్ల సర్వే నిర్వహించడం, తద్వారా ఓబీసీలకు న్యాయం చేయడం కోసం అభ్యర్ధన.

మీ ప్రభుత్వం  2014 లో చేపట్టిన సమగ్రకుటుంబ సర్వే ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో..దాదాపు గా 90 శాతం మంది బీసిలు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ జనాభాతో ఉందన్న విషయం మీకు తెలిసిందే. ఇందులో దాదాపు మెజారిటీగా  52 శాతం జనాభా కేవలం బీసి వర్గాలదే కావడం విశేషం.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలమంతా జీవితాలను ఫణంగా పెట్టి పోరాటం చేసాము. ఉద్యమం కోసం మా జీవితాలను త్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటు సహకరించాము. రాష్ట్రం  ఏర్పడితే బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క ఆశయంతో ఈ పోరాటం లో ముందుండి నడిచాము. కాని  దురదృష్టకరమేమంటే రాజ్యాంగ పరమైన హక్కులను పొందడంలో మాత్రం వెనకబడ్డాం. మరి ముఖ్యంగా తెలంగాణాలో మాకు న్యాయంగా రావాల్సిన సామాజిక, ఆర్ధిక వనరులు, రాజకీయ అవకాశాల కల్పించడంలో ఓబీసిల  పట్ల పాలకుల ఉద్దేశ్యపూర్వకమైన సాచివేత  ధోరణి కొనసాగుతోందన్నది సుస్పష్టం.

వెనుకబడిన తరగతి వర్గాల హక్కుల ఉల్లంఘన, వారిపట్ల సాచివేత ధోరణి, అన్యాయం రాబోయే పంచాయితీరాజ్ ఎన్నికల్లోకూడా అమలయ్యేట్లు కనిపిస్తొంది. మీరు తెచ్చిన పంచాయితీ రాజ్ చట్టం పూర్తిగా అర్ధంకాకుండగా, గందరగోళంగా ఉన్నది. 73 వ రాజ్యాంగ సవరణ లో ఓబీసిల రిజర్వేషన్ అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలను మీ ఇష్టారీతిగా మార్పులు చేర్పులు చేసి  నిర్వీర్యం చేసే విధంగా రూపొందించారు.   కాబట్టి ఈ సందర్భంగా మేము కొన్ని వాస్తవాలతో కూడిన నివేదికను మీముందుంచదలిచాము. దయచేసి పరిశీలించి తగిన చర్య తీసుకోగలరని కోరుతున్నాము.

పంచాయతీరాజ్ వ్యవస్ధలను బలోపేతం చేయడానికి, అనేక అంశాలతో కూడిన వివిధ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం73 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్ధలకు సంక్రమింపచేసింది. దీనివల్లే పంచాయతీరాజ్ వ్యవస్ధలు బలోపేతం కావడానికి దోహదపడింది. ఈ రాజ్యాంగ సవరణ లో ఉన్న విశాల దృక్ఫధం కలిగిన అంశాల వల్లే  కొత్త రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికయి అధికారం చేపట్టే అవకాశం కలిగింది. కాబట్టి తెలంగాణా రాష్ట్రం లో విధిగా 73 వ రాజ్యంగ సవరణ మార్పులను అమలు చేయాలనికోరుతున్నాం.

73 వ రాజ్యాంగ సవరణ లోని ఆర్టికల్243(డీ) ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. వెనుకబడిన కులాలకు చెందిన వారిని  ఎన్నికునేందుకు ఏర్పాటుచేయబడింది. ఆర్టికల్ 243(డీ)(6) ద్వారా శాసనసభకు అనేక అధికారాలు కల్పించింది. ఇందులో ముఖ్యంగా  పంచాయితీరాజ్ కు సంబందించిన సీట్ల రిజర్వేషన్లను సవరించేందుకు  అనేక నిబంధనలను ఏర్పాటు చేయబడ్డాయి.

గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనుకబడిన తరగతుల అభ్యున్నతికోసం వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ లను 73 వ రాజ్యాంగ సవరణ ప్రాతిపదికగా చేసుకుని, అంతకుముందు కూడా వచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ 1966 మరియు పంచాయితీరాజ్ యాక్ట్ 1994, ఇటీవల తెలంగాణా ప్రభుత్వం  తెచ్చిన 2018 పంచాయాతీరాజ్ యాక్ట్ లో కూడా స్పష్టంగా  పేర్కొన్నారు.

వెనుకబడినతరగతుల ప్రయోజనాలకోసం ఏర్పాటుచేసిన రిజర్వేషన్లను ప్రతీసారి అశాస్త్రీయమైన విధానాలతో తయారుచేస్తూ వాస్తవ  జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాం. ఇలాంటి అశాస్త్రీయమైన, దోషపూరిత విధానాల ఆధారంగా రూపొందించిన రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ముందు పెను సవాళ్లుగా నిలిచాయి. ఈ పరిణామాలన్నీ హైకోర్టు నిశిత పరిశీలనకు దారితీసాయి.

సామూహిక బీసీ జన గణనకు బదులుగా  ప్రభుత్వం తరుచుగా పైపై లెక్కల ద్వారా, గతంలో బీసీ ఆర్ధిక సంస్ధ  వారు లెక్కించిన వివరాల ఆధారంగా వెనుకబడిన తరగతుల జనాభాను అంచనా వేసింది, 1987లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫుల్ బెంచ్ లో సత్యనారాయణ రెడ్డి వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1987(1)ఏ ఎల్ టీ 665(ఎఫ్ బీ)  వారు పై గణనకు ఎలాంటి చట్టబద్దత, న్యాయపరమైన ప్రాధాన్యత లేదని తేల్చింది. ఆయాజిల్లాలలో ఈ నామమాత్రపు లెక్కలు  గణాంకాలు ద్వారా  రిజర్వేషన్ల ను ఏర్పాటు చేయజాలరని తేల్చింది. ఈరక మైన తీర్పు వచ్చినప్పడికి ఆనాటి ప్రభుత్వం మళ్లీ పాత నిబంధనల ప్రకారమే ప్రభుత్వం 2006 లో ఎన్నికలు నిర్వహంచింది. 

ఆ తర్వాత 2012లో కూడా పంచాయతీరాజ్ సంస్ధల ఎన్నికలు సమయంలో పాత  రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడం జరిగింది. అప్పడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్  డివిజన్ బెంచ్  (నిమ్మక జయరాం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం W.P No. 31639 & others of 2011) తన తీర్పులో రాష్ట్రప్రభుత్వం తప్పనిసరిగా పూర్తిస్ధాయి జనాభా గణన నివేదిక ఇవ్వాలని, ప్రజలనుంచి  అభ్యంతరాలు స్వీకరించాలని రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. అలాగే సమయానుసారంగా రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆంద్రప్రదేశ్  హైకోర్ట్ ఆదేశించింది. ఆతర్వాత పంచాయతీరాజ్ సంస్దలకు ఎన్నికలు వెనుకబడినతరగతులకు , ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు ప్రకటించినతర్వాత  నిర్వహింపబడ్డాయి.

తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం 1994 స్ధానంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మళ్లీ పునరావృతమైంది.  2018 యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం సర్పంచ్ మరియు ఎస్టీ ఎస్సీ వెనుకబడిన తరగతుల మహిళలకోసం రిజర్వేషన్లు కేటాయించబడుతాయి. సెక్షన్ 17(7) లోని నిభంధన ల ప్రకారం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు చేయబడ్డాయి. సెక్షన్ 17(7) నిభంధనల ప్రకారం  వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేయబడ్డ సర్పంచ్ ల  సంఖ్యను జిల్లా కలెక్టర్ రాష్ట్రం మరియు మండల స్ధాయి సంఖ్య ఆధారంగా వెనుకబడిన తరగతుల జనాభా ప్రాతిపదిక లో చేపడుతారు.  ఈ గణాంకాలన్నీ  డైరెక్టర్ ఆఫ్ గణాంక శాఖ ఆధ్వర్యంలో  చేపడుతారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 13  ఒప్పందం ప్రకారం  ప్రభుత్వం తప్పనిసరిగా 15రోజుల్లో వెనుకబడిన తరగతుల ఓటర్లును గుర్తించాలని చెబుతోంది.

ఈ సందర్భంలో ఇటీవలి పరిణామాల నేపధ్యంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ వర్తింపజేయడంలో తెలంగాణా ప్రభుత్వం మళ్లీ తప్పుడు విధానాలను, తప్పుడు లెక్కలను అనుసరిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 13 ను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని మనసా వాచా కర్మణా కొత్తరాష్ట్రం అమలు చేయాల్సిన అవసరముంది. ఇందులో భాగంగా వెనకబడిన తరగతుల డోర్ టూ డోర్ జనాభా గణన చేపట్టాల్సిన అవసరముంది . దీనిలో ఏదైనా సర్వేలోపాలున్నా,తప్పుడులెక్కలు చేసినా, పైపై సర్వేలు చేసినా సెక్షన్ 13  పంచాయతీరాజ్ యాక్ట్ 2018  ను అపహాస్యం చేయడమే అవుతుంది.కాబట్టి కట్టుదిట్టంగా గణన నిర్వహించాలి.

సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణా రాష్ట్రంలోని  వెనుకబడిన తరగతుల జనాభా 52 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది.  కాబట్టి ఈ వివరాల ప్రకారమే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను అమలు పరచాలి. కాని ఇతర ఏ అంచనాలు, లెక్కల ద్వారా చేపట్టిన విధానాల అవలంబించినా వెనుకబడిన తరగతుల వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇది సహజంగా ఉన్న జనాభాను తగ్గించడమే కాకుండా, అది వారి రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందన్నది నిర్వివాదాంశం.

సరైన గణాంకాలు చేపట్టకపోతే  గణనలో అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగంలో పోందుపరిచిన సెక్షన్ 17 యొక్క  సూత్రీకరణ కు విఘాతం కలిగిస్తుంది. అశాస్త్రీయ విధానాల ద్వారా మండలాల్లో, మరియు ఇతర గ్రామాల్లో  వెనుకబడిన తరగతుల వర్గాల కు చెందిన ప్రాతినిధ్యాన్ని లేకుండా చేసే దుర్మార్గమయిన చర్యకు దారితీస్తుంది. 

కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ,మరియు ఇతర సంబంధిత అధికారులకు  మా యొక్క విన్నపమేమంటే  వెనకబడిన తరగతుల ఓటరు జనాభా గణన విస్తృత మైన శాస్త్రీయ దృక్కోణంతో డోర్ టూ డోర్ గా చేపట్టాలని కోరుతున్నాం.  అంతే కాకుండా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన విధంగా 52 శాతం ఉన్న బిసీలకు, అంతే మొత్తంలో  52 శాతం రిజర్వేషన్లు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కల్పించాలని విజ్నప్తి. 
.......
మీ శ్రేయోభిలాషి.

(Dr. శ్రవణ్ దాసోజు)
ముఖ్యఅధికార ప్రతినిధి, టీపీసీసీ.