Saturday 9 June 2018

ముఖ్య‌మంత్రి కేసిఆర్‌కు లేఖ‌ : బి.సిల‌ జ‌నాభాకు అనుగుణంగా న్యాయ‌బ‌ద్ద‌మైన వాటా ఇవ్వాలి : శ్రవణ్ దాసోజు

ఎబిసిడి వ‌ర్గీక‌ర‌ణను అమ‌లు చేయాలి.
ఇంటింటికి తిరిగి బి.సి జ‌నాభా గ‌ణ‌న‌ చేయాలి
లోప‌భూయిష్టంగా పంచాయ‌తీ చ‌ట్టం
ఆర్‌.టి.సిపై ఎస్మా అంటే త‌స్మాత్ జాగ్ర‌త్త‌...దాసోజు శ్ర‌వ‌న్





పంచాయ‌త్ రాజ్ చ‌ట్టం లోప‌భూయిష్టంగా ఉంద‌ని, అందులోని అంశాలు ఒక‌దానికి ఒక‌టి విరుద్దంగా ఉన్నాయ‌ని ప్ర‌ధానంగా బి.సి జ‌నాభా గ‌ణ‌న విష‌యంలో బి.సిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో బి.సిల‌కు న్యాయ‌బ‌ద్ద‌మైన వాటా రావాలంటే శాస్థ్రీయంగా జ‌నాభా గ‌ణ‌న జ‌ర‌పాల‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బి.సి సాధికారిక క‌మిటీ స‌భ్యులు దాసోజు శ్ర‌వ‌న్ అన్నారు. శ‌నివారం నాడు గాంధీభవ‌న్ ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో బి.సిల‌కు న్యాయ‌మైన వాటా రావాలంటే ప‌క్కాగా బి.సి జ‌న‌భా జ‌ర‌పాల‌ని, ఇంటింటికి తిరిగి బి.సి జ‌నాభా లెక్క‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం రూపొందించిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం సెక్ష‌న్ 13 ప్ర‌కారం 15 రోజుల‌లో జ‌నాభా లెక్క‌లు చేప‌ట్టి రిజ‌ర్వేష‌న్ల అమ‌లు చేయాల‌ని నిబంధ‌న పెట్టార‌ని 12 వేల పంచాయ‌తీలలో జ‌నభా లెక్క‌లు తేల్చాలంటే 15 రోజుల స‌మ‌యంలో ఎలా స‌రిపోతుంద‌ని ఇది కేవ‌లం తూతూ మంత్రంగా జ‌రిగే కార్య‌క్ర‌మంగా మాత్ర‌మే చేప‌డుతున్నార‌ని చెట్ల కింద కూసొని జ‌నాభా గ‌ణ‌న జ‌రుగుతుంద‌ని దీని వ‌ల్ల బి.సిల‌కు చాల న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సెక్ష‌న్ 17 ప్ర‌కారం బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్  ఆధారంగా  జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్
ప్ర‌క్రియ చేప‌డుతామ‌ని పేర్కొన్నార‌ని అయితే 2011లో చేప‌ట్టిన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం చేప‌డితే బి.సిల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేప‌ట్టిన సంద‌ర్భంలో బి.సిలు 52 శాతం ఉన్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించార‌ని కానీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మాత్రం 2011 లెక్క‌ల ఆధారంగా చేప‌డుతామ‌ని అన‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా బి.సిల‌కు అన్యాయం చేసేందుకు కుట్ర‌లో భాగ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌తంలో న్యాయ‌స్థానాల‌లో నిమ్మ‌క్ రాజ్ ఆంద్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వానికి జ‌రిగిన పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేసులో న్యాయ‌స్థానం జ‌న‌భా గ‌ణ‌న శాస్త్రీయంగా ఇంటింటికి తిరిగి చేప‌ట్టాల‌ని తీర్పు చెప్పింద‌ని ఆయ‌న అన్నారు.

బ‌.సిల కుల గ‌ణ‌న శాస్త్రీయంగా చేయ‌క‌పోతే బి.సి ఎబిసిడి వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కులాల‌కు అన్యాయం జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో   బి.సిల‌లోని చిన్న కులాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.  చ‌ట్ట ప్ర‌కారం ఎన్నిక‌ల‌లో కూడా ఎబిసిడీ వ‌ర్గీక‌ర‌ణ ప్ర‌కారం రిజర్వేష‌న్ల కేటాయింపులు జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వం ఈ కేసుల ఆధారంగా ఇంటింటికి తిరిగి ఎందుకు చేప‌ట్ట‌డం లేద‌ని, కోర్టు తీర్పుల‌ను ఎందుకు గౌర‌వించ‌డం లేద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 73వ రాజ్యంగ స‌వ‌ర‌ణ‌ను ఎందుకు ఉల్లంఘిస్తున్నార‌ని, ఇదంతా బి.సిల‌కు న‌ష్టం జ‌రిగే కార్య‌క్ర‌మాల‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో బి.సిలైన ఉద్య‌మ సిద్దాంత క‌ర్త‌ జ‌య‌శంక‌ర్ నుంచి మొద‌లుకొని శ్రీ‌కాంత‌చారి, కానిస్టేబుల్ కృష్ణ‌య్య, యాద‌య్య‌లు తెలంగాణ ఉద్య‌మంలో బ‌లయ్యార‌ని, 1500 మంది ఆత్మ‌త్యాగాలు చేస్తే అందులో మెజారిటీగా బి.సిలే త్యాగాలు చేశార‌ని కానీ ఇప్ప‌డు బిసిల‌ను బిచ్చ‌గాళ్ళుగా మార్చుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో ఉప స‌ర్పంచ్‌కు చెక్ ప‌వ‌ర్ ఇవ్వ‌డ‌మంటే బి.సి, ఇత‌ర రిజ‌ర్వేష‌న్ స‌ర్పంచ్‌ల‌పై ఉప స‌ర్పంచ్‌ల పెత్త‌నాన్ని పెంచ‌డానికేన‌ని ఆయ‌న అన్నారు.
ఏదేమయినప్పడికి   రాజ్యాంగపరమైన హక్కులను పొందడంలో  మాత్రం వెనుకంజలో ఉన్నమ‌ని మరిముఖ్యంగా తెలంగాణాలో త‌మ‌కు న్యాయంగా రావాల్సిన సామాజిక, ఆర్ధిక వనరులు, రాజకీయ అవకాశాల పొందడంలో ఓబీసిల  పట్ల ఉద్దేశ్యపూర్వకమైన సాచివేత  ధోరణి కొనసాగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

ఆర్‌.టి.సిపై ఎస్మా అంటే త‌స్మాత్ జాగ్ర‌త్త‌
ఆర్‌.టి.సి కార్మికులు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా పాల్గొన్నార‌ని వారు న్యాయప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మె చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి నోటీసు ఇస్తే ఎస్మా ప్ర‌యోగిస్తామ‌ని కేసిఆర్ హెచ్చ‌రిస్తున్నార‌ని ఇది రాజ్యంగ విరుద్దమ‌ని దాసోజు శ్ర‌వ‌న్ అన్నారు. ఎస్మా ప్ర‌యోగిస్తే త‌స్మాత్ జాగ్ర‌త్త అని ఆయ‌న హెచ్చ‌రించారు. స‌మ్మె కార్మికుల ప్రాథ‌మిక హ‌క్కు అని స‌మ్మెలు చేయ‌క‌పోతే తెలంగాణ ఎలా వ‌చ్చేద‌ని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో స‌మ్మెలు చేయాల‌ని పిలుపునిచ్చిన కేసిఆర్ ఇప్ప‌డు అధికారంలోకి రాగానే స‌మ్మెలు అంటే ఉలిక్కి ప‌డుతున్నార‌ని తెలంగాణ ఉద్య‌మంలో స‌మ్మెల‌పైన ఉక్కుపాదం మోపితే తెలంగాణ వ‌చ్చేదా.. కేసిఆర్ సి.ఎం అయ్యే వారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఆర్‌.టి.సి నిజాం వార‌స‌త్వ సంద‌ప అని ఇప్ప‌టికీ ఆర్‌.టి.సి నెంబ‌ర్ ప్లేట్ల‌కు జ‌డ్ అనే అక్ష‌రంతో అని నిజాం వార‌స‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. వంద‌ల ఏళ్ళ చ‌రిత్ర ఉన్న ఆర్‌.టి.సిని మూస్తేస్తామ‌ని అని అన‌డం కేసిఆర్ మూర్ఖ‌త్వ‌మ‌ని అన్నారు. ఆర్‌.టి.సి కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌కు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని కార్మిక సంఘాల‌తో సామ‌ర‌స్య పూర్వ‌క చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. ఎయిర్ బ‌స్‌ల‌లో తిరిగే కేసిఆర్‌కు ఎర్ర బ‌స్‌ల‌లో తిరిగే పేద‌ల క‌ష్టాలు తెలియ‌డం లేద‌ని, ఆర్‌.టి.సి స‌మ్మె చేస్తే పేద ప్ర‌యాణీకుల‌తోపాటు పాలు, కూర‌గాయ‌లు అమ్మ‌కునే వేలాది మంది రైతులు న‌ష్ట‌పోతార‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం వాస్త‌వ విరుద్దంగా ప‌నిచేస్తే ఉద్య‌మం తీవ్ర‌త‌రం అవుతుంద‌ని అన్నారు. ప్రైవేట్ సంస్థ‌లు బాగా ప‌నిచేస్తున్నాయ‌ని వారికి ఎలా లాభాలు వ‌స్తున్నాయ‌ని కేసిఆర్ మాట్లాడ‌డం ఆయ‌న అవివేకానికి ప‌రాకాష్ట అన్నారు. ప్రేవేట్ సంస్థ‌ల‌ను నియంత్రిస్తే ఆర్‌.టి.సి లాభాల బాట‌లో ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు.
...........................................................

09.06.2018
శ్రీయుత  కల్వకుంట చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ గారికి.,

ఆర్యా..

విషయం: పంచాయతీరాజ్ ఎన్నికల్లో  రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్ కేటాయింపులు... తెలంగాణా రాష్ట్రంలో ఓబీసి ఓటర్ల సర్వే నిర్వహించడం, తద్వారా ఓబీసీలకు న్యాయం చేయడం కోసం అభ్యర్ధన.

మీ ప్రభుత్వం  2014 లో చేపట్టిన సమగ్రకుటుంబ సర్వే ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో..దాదాపు గా 90 శాతం మంది బీసిలు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ జనాభాతో ఉందన్న విషయం మీకు తెలిసిందే. ఇందులో దాదాపు మెజారిటీగా  52 శాతం జనాభా కేవలం బీసి వర్గాలదే కావడం విశేషం.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలమంతా జీవితాలను ఫణంగా పెట్టి పోరాటం చేసాము. ఉద్యమం కోసం మా జీవితాలను త్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటు సహకరించాము. రాష్ట్రం  ఏర్పడితే బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క ఆశయంతో ఈ పోరాటం లో ముందుండి నడిచాము. కాని  దురదృష్టకరమేమంటే రాజ్యాంగ పరమైన హక్కులను పొందడంలో మాత్రం వెనకబడ్డాం. మరి ముఖ్యంగా తెలంగాణాలో మాకు న్యాయంగా రావాల్సిన సామాజిక, ఆర్ధిక వనరులు, రాజకీయ అవకాశాల కల్పించడంలో ఓబీసిల  పట్ల పాలకుల ఉద్దేశ్యపూర్వకమైన సాచివేత  ధోరణి కొనసాగుతోందన్నది సుస్పష్టం.

వెనుకబడిన తరగతి వర్గాల హక్కుల ఉల్లంఘన, వారిపట్ల సాచివేత ధోరణి, అన్యాయం రాబోయే పంచాయితీరాజ్ ఎన్నికల్లోకూడా అమలయ్యేట్లు కనిపిస్తొంది. మీరు తెచ్చిన పంచాయితీ రాజ్ చట్టం పూర్తిగా అర్ధంకాకుండగా, గందరగోళంగా ఉన్నది. 73 వ రాజ్యాంగ సవరణ లో ఓబీసిల రిజర్వేషన్ అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలను మీ ఇష్టారీతిగా మార్పులు చేర్పులు చేసి  నిర్వీర్యం చేసే విధంగా రూపొందించారు.   కాబట్టి ఈ సందర్భంగా మేము కొన్ని వాస్తవాలతో కూడిన నివేదికను మీముందుంచదలిచాము. దయచేసి పరిశీలించి తగిన చర్య తీసుకోగలరని కోరుతున్నాము.

పంచాయతీరాజ్ వ్యవస్ధలను బలోపేతం చేయడానికి, అనేక అంశాలతో కూడిన వివిధ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం73 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్ధలకు సంక్రమింపచేసింది. దీనివల్లే పంచాయతీరాజ్ వ్యవస్ధలు బలోపేతం కావడానికి దోహదపడింది. ఈ రాజ్యాంగ సవరణ లో ఉన్న విశాల దృక్ఫధం కలిగిన అంశాల వల్లే  కొత్త రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికయి అధికారం చేపట్టే అవకాశం కలిగింది. కాబట్టి తెలంగాణా రాష్ట్రం లో విధిగా 73 వ రాజ్యంగ సవరణ మార్పులను అమలు చేయాలనికోరుతున్నాం.

73 వ రాజ్యాంగ సవరణ లోని ఆర్టికల్243(డీ) ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. వెనుకబడిన కులాలకు చెందిన వారిని  ఎన్నికునేందుకు ఏర్పాటుచేయబడింది. ఆర్టికల్ 243(డీ)(6) ద్వారా శాసనసభకు అనేక అధికారాలు కల్పించింది. ఇందులో ముఖ్యంగా  పంచాయితీరాజ్ కు సంబందించిన సీట్ల రిజర్వేషన్లను సవరించేందుకు  అనేక నిబంధనలను ఏర్పాటు చేయబడ్డాయి.

గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనుకబడిన తరగతుల అభ్యున్నతికోసం వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ లను 73 వ రాజ్యాంగ సవరణ ప్రాతిపదికగా చేసుకుని, అంతకుముందు కూడా వచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ 1966 మరియు పంచాయితీరాజ్ యాక్ట్ 1994, ఇటీవల తెలంగాణా ప్రభుత్వం  తెచ్చిన 2018 పంచాయాతీరాజ్ యాక్ట్ లో కూడా స్పష్టంగా  పేర్కొన్నారు.

వెనుకబడినతరగతుల ప్రయోజనాలకోసం ఏర్పాటుచేసిన రిజర్వేషన్లను ప్రతీసారి అశాస్త్రీయమైన విధానాలతో తయారుచేస్తూ వాస్తవ  జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాం. ఇలాంటి అశాస్త్రీయమైన, దోషపూరిత విధానాల ఆధారంగా రూపొందించిన రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ముందు పెను సవాళ్లుగా నిలిచాయి. ఈ పరిణామాలన్నీ హైకోర్టు నిశిత పరిశీలనకు దారితీసాయి.

సామూహిక బీసీ జన గణనకు బదులుగా  ప్రభుత్వం తరుచుగా పైపై లెక్కల ద్వారా, గతంలో బీసీ ఆర్ధిక సంస్ధ  వారు లెక్కించిన వివరాల ఆధారంగా వెనుకబడిన తరగతుల జనాభాను అంచనా వేసింది, 1987లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫుల్ బెంచ్ లో సత్యనారాయణ రెడ్డి వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1987(1)ఏ ఎల్ టీ 665(ఎఫ్ బీ)  వారు పై గణనకు ఎలాంటి చట్టబద్దత, న్యాయపరమైన ప్రాధాన్యత లేదని తేల్చింది. ఆయాజిల్లాలలో ఈ నామమాత్రపు లెక్కలు  గణాంకాలు ద్వారా  రిజర్వేషన్ల ను ఏర్పాటు చేయజాలరని తేల్చింది. ఈరక మైన తీర్పు వచ్చినప్పడికి ఆనాటి ప్రభుత్వం మళ్లీ పాత నిబంధనల ప్రకారమే ప్రభుత్వం 2006 లో ఎన్నికలు నిర్వహంచింది. 

ఆ తర్వాత 2012లో కూడా పంచాయతీరాజ్ సంస్ధల ఎన్నికలు సమయంలో పాత  రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడం జరిగింది. అప్పడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్  డివిజన్ బెంచ్  (నిమ్మక జయరాం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం W.P No. 31639 & others of 2011) తన తీర్పులో రాష్ట్రప్రభుత్వం తప్పనిసరిగా పూర్తిస్ధాయి జనాభా గణన నివేదిక ఇవ్వాలని, ప్రజలనుంచి  అభ్యంతరాలు స్వీకరించాలని రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. అలాగే సమయానుసారంగా రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆంద్రప్రదేశ్  హైకోర్ట్ ఆదేశించింది. ఆతర్వాత పంచాయతీరాజ్ సంస్దలకు ఎన్నికలు వెనుకబడినతరగతులకు , ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు ప్రకటించినతర్వాత  నిర్వహింపబడ్డాయి.

తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం 1994 స్ధానంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మళ్లీ పునరావృతమైంది.  2018 యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం సర్పంచ్ మరియు ఎస్టీ ఎస్సీ వెనుకబడిన తరగతుల మహిళలకోసం రిజర్వేషన్లు కేటాయించబడుతాయి. సెక్షన్ 17(7) లోని నిభంధన ల ప్రకారం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు చేయబడ్డాయి. సెక్షన్ 17(7) నిభంధనల ప్రకారం  వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేయబడ్డ సర్పంచ్ ల  సంఖ్యను జిల్లా కలెక్టర్ రాష్ట్రం మరియు మండల స్ధాయి సంఖ్య ఆధారంగా వెనుకబడిన తరగతుల జనాభా ప్రాతిపదిక లో చేపడుతారు.  ఈ గణాంకాలన్నీ  డైరెక్టర్ ఆఫ్ గణాంక శాఖ ఆధ్వర్యంలో  చేపడుతారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 13  ఒప్పందం ప్రకారం  ప్రభుత్వం తప్పనిసరిగా 15రోజుల్లో వెనుకబడిన తరగతుల ఓటర్లును గుర్తించాలని చెబుతోంది.

ఈ సందర్భంలో ఇటీవలి పరిణామాల నేపధ్యంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ వర్తింపజేయడంలో తెలంగాణా ప్రభుత్వం మళ్లీ తప్పుడు విధానాలను, తప్పుడు లెక్కలను అనుసరిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 13 ను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని మనసా వాచా కర్మణా కొత్తరాష్ట్రం అమలు చేయాల్సిన అవసరముంది. ఇందులో భాగంగా వెనకబడిన తరగతుల డోర్ టూ డోర్ జనాభా గణన చేపట్టాల్సిన అవసరముంది . దీనిలో ఏదైనా సర్వేలోపాలున్నా,తప్పుడులెక్కలు చేసినా, పైపై సర్వేలు చేసినా సెక్షన్ 13  పంచాయతీరాజ్ యాక్ట్ 2018  ను అపహాస్యం చేయడమే అవుతుంది.కాబట్టి కట్టుదిట్టంగా గణన నిర్వహించాలి.

సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణా రాష్ట్రంలోని  వెనుకబడిన తరగతుల జనాభా 52 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది.  కాబట్టి ఈ వివరాల ప్రకారమే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను అమలు పరచాలి. కాని ఇతర ఏ అంచనాలు, లెక్కల ద్వారా చేపట్టిన విధానాల అవలంబించినా వెనుకబడిన తరగతుల వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇది సహజంగా ఉన్న జనాభాను తగ్గించడమే కాకుండా, అది వారి రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందన్నది నిర్వివాదాంశం.

సరైన గణాంకాలు చేపట్టకపోతే  గణనలో అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగంలో పోందుపరిచిన సెక్షన్ 17 యొక్క  సూత్రీకరణ కు విఘాతం కలిగిస్తుంది. అశాస్త్రీయ విధానాల ద్వారా మండలాల్లో, మరియు ఇతర గ్రామాల్లో  వెనుకబడిన తరగతుల వర్గాల కు చెందిన ప్రాతినిధ్యాన్ని లేకుండా చేసే దుర్మార్గమయిన చర్యకు దారితీస్తుంది. 

కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ,మరియు ఇతర సంబంధిత అధికారులకు  మా యొక్క విన్నపమేమంటే  వెనకబడిన తరగతుల ఓటరు జనాభా గణన విస్తృత మైన శాస్త్రీయ దృక్కోణంతో డోర్ టూ డోర్ గా చేపట్టాలని కోరుతున్నాం.  అంతే కాకుండా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన విధంగా 52 శాతం ఉన్న బిసీలకు, అంతే మొత్తంలో  52 శాతం రిజర్వేషన్లు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కల్పించాలని విజ్నప్తి. 
.......
మీ శ్రేయోభిలాషి.

(Dr. శ్రవణ్ దాసోజు)
ముఖ్యఅధికార ప్రతినిధి, టీపీసీసీ.










No comments:

Post a Comment