Friday 22 June 2018

బీసి ఉపకులాల రిజర్వేషన్లు కాంగ్రెస్ విజయమే..


రిజర్వేషన్లతో అన్ని ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం లభించనుందని వ్యాఖ్య.

రిజర్వేషన్ల కోసం కోర్టు తలుపు తట్టిన విషయాన్ని గుర్తుచేసిన శ్రవణ్





సమగ్ర కులగణన చేపట్టి తద్వారా బీసి ఉపకులాలకు 52 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్.

తెలంగాణా సర్కార్ బీసి లకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించనుందన్న విషయాన్ని స్వాగతిస్తున్నామని తద్వారా బీసి వర్గంలోని అన్నికులాలకు ప్రాతినిధ్యం లభించనుందని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు హర్హం వ్యక్తం చేశారు.

అధికారికంగా ప్రకటించక పోయినా బీసిలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించనుందన్న విషయం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ  బిసి ఉపకులాల రిజర్వేషన్ల కోసం చేసిన పోరాట ఫలితం ద్వారానే ప్రకటన వెలువడనుందని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి  శ్రవణ్ దాసోజు అన్నారు. శుక్రవారం మధ్యహ్నం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రవణ్ అణగారిన వర్గాలకు, అట్టడుగున ఉన్న 100 కులాలకు ఇవాళ ప్రాతినిధ్యం రానుందని పెద్దయెత్తున ప్రజాప్రతినిధులుగా అవకాశాలొస్తాయని అంబేధ్కర్ కలలు గన్న సమసమాజం స్ధాపించేందుకు దోహదమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెద్ద సంఖ్యలో ముస్లీంలకు అవకాశాలు

బీసి ఉపకులాల రిజర్వేషన్ల  వల్ల  ముస్లీం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వస్తాయని దీంతో  500 కు పైగా ముస్లీంలు  సర్పంచ్ లుగా మారనున్నారని  ఇది ఆ వర్గాలకు పెద్ద ప్రయోజనాన్ని కలిగించనుందని శ్రవణ్ తెలిపారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో విద్యాఉపాధి రంగాల్లో పేద ముస్లీం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఇవాళ మరో మారు వారి కి పంచాయితీ ఎన్నికల ద్వారా రాజ్యాధికారంలో కూడా అంతే వాటా కల్పించేందుక కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు.

బీసి ఉపకులాల రిజర్వేషన్ల కోసం స్వయంగా కోర్టుకెక్కిన విషయాన్ని గుర్తు చేసిన శ్రవణ్

బీసి లకు వర్గీకరణ కోసం ముఖ్యమంత్రికి లేఖలు రాసామని , ఎన్నో ప్రజావేదికల పై పోరాడామన్నారు. బీసి వర్గీకరణ శాస్త్రీయంగా చేపట్టాలని కోరామని తెలిపారు.  టీఆర్ ఎస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు  సిద్దమైన  పరిస్ధితుల్లో బీసి ఉపకులాలకు న్యాయమైన రిజర్వేషన్లు సాధించేందుకు వ్యక్తిగతంగా తాను హైకోర్టు తలుపు తట్టానని, న్యాయమూర్తి రామచంద్రరావు బీసిలకు అనుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్నినివేదిక కోరారని గుర్తుచేశారు.  దీంతో ప్రభుత్వం సైతం తాము కోరిన విధంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు  సుముఖత వ్యక్తం చేసిందని , సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ప్రభుత్వమే  లీకుల ద్వారా వెల్లడించిందని శ్రవణ్ అన్నారు.

బీసిల కు సాధికారత

బీసి ఉపకులాలల్లోని బీసి ఏ 8 శాతం, బీసిబి 11 శాతం, బీసి సి 1 శాతం, బీసి డి 9  బీసి ఈ 5 శాతం రిజర్వేషన్ల వల్ల అన్ని కులాలకు ప్రాతినిధ్యం వస్తుందన్నారు..బీసి ఉపకులాల వారిగా రిజర్వేషన్లు పెంచితే ఇబ్బందులొస్తయన్న అపోహలున్నప్పటికి  ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అక్కడ ఉన్న 190 బీసి కులాలను రెండు వర్గాలుగా విభజించిందని బీసిఏ వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు, బీసి బి వర్గానికి 80 శాతం రిజర్వేషన్లు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇచ్చారని ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుపేద బీసి కులాలకు, సాధికారత లభించాలని కోరుకుందని అదే రీతిలో తాము పోరాటం చేశామని బీసిలకు రిజర్వేషన్ల అంశాన్ని పార్టీ తరఫున పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లామని గుర్తుచేశారు. తమ పోరాట ఫలితమే రిజర్వేషన్లు పెంపుదల జరిగిందని ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నమని తెలిపారు.

సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్

గతంలో సుప్రిం కోర్టు మరియు హైకోర్టు లు ఇచ్చిన తీర్పుల ను గౌరవించి సమగ్ర సర్వే తరహాలో బీసి ఉపకులాల గణన శాస్త్రీయంగా చేపట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఏ కులం వాళ్లు , ఏ ఊళ్లో ఎక్కువ గా ఉంటే ఆ ఊరి పదవులు వారికే కేటాయించాలి.  అంతేకాకుండా బీసిలు 52 శాతం ఉన్నారని ప్రభుత్వమే చెప్పిందని అలాంటప్పుడు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.  మేమెంతో.. మాకంతే  స్ధాయిలో అవకాశాలు కల్పించాలని ఇందుకోసం కులగణన చేపట్టి శాస్రీయంగా రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

సస్టెయినబుల్  డెవలప్ మెంట్ గోల్స్ ....కాంగ్రెస్ మానిఫెస్టో 2019 అంశంపై సమావేశం

ఆల్ ఇండియా ప్రోఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 23 ఉదయం 10 గంటలకు, రెడ్ హిల్స్ లోని ప్యాప్ట్సీ భవన్  లో యూఎన్ డీపి ద్వారా నిర్ధేశించిన బడిన 17 అభివృద్ది లక్ష్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు సమావేశం జరగనుందని, ఇందులో రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన విధానాలు, మానిఫెస్టో తయారికి సంబంధించిన చర్చలు జరుగుతాయని శ్రవణ్ దాసోజు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొననున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు విద్యావేత్తలు నిపుణులు సాధారణ పౌరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.


Video : 

2 comments: