Sunday 30 July 2017

సిరిసిల్ల మీ తాత జాగీరా? కల్వకుంట్ల రాజ్యాంగం అమలులో ఉందా?

శాంతియుత ఉద్యమాలను అడ్డుకునే మూర్ఖులు,
హింసాయుత ఉద్యమాలకు బీజం వేస్తారు - జూన్ ఎఫ్ కెన్నెడీ
దేశ రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన దళిత మహిళ నాయకురాలు
మీరా కుమార్ సంఘ విద్రోహ శక్తా?
>తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ లోక్ సభ స్పీకర్,
మీరా కుమార్ దళిత బహుజనుల పై దాడుల పట్ల నిరసన
తెలపడానికి సిరిసిల్ల కు వస్తుంటే అడ్డుకోవడం భారత రాజ్యాంగాన్ని కాలరాయడమే !
>తెరాస పెద్దలు నిజాన్ని ఎదిరించలేని పిరికిపందలు?
>ఇసుక మాఫియా గుట్టు రట్టు అవుతుందని భయమా?
>సిరిసిల్ల పోలీసులు తెరాస పెద్దలకు ప్రైవేట్ సైన్యం గా మారింది
>>మేధావుల మౌనం, దుర్మార్గుడి దౌర్జన్యం కంటే క్రూరమైనది!
>>>తెలంగాణ దళిత బహుజన మేధావులారా జరుగుతున్న ఘోరాన్ని ఎదిరించండి!!
>>>ప్రశ్నించే గొంతులను నులిమి వేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్న
తెరాస పెద్దలను ఎక్కడికక్కడ నిలదీయండి
సిరిసిల్ల కు వస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం... ఎవడు అడ్డుకుంటాడో చూస్తాం!! ప్రజాస్వామ్య వాదులారా కదిలిరండి!!

Friday 14 July 2017

లండన్ లో - గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ

ఈ రోజు లండన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యం లో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ జరిగింది . ఆవిష్కరణ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ముఖ్యఅతిథి గా పాల్గొని ఆవిష్కరించారు.
తెరాస 3 ఏండ్ల రాచరిక పాలనలో ప్రజల అవస్థలు ,తప్పిన ఎన్నికల వాగ్ధానాలు , నిరంకుశ ,అప్రజాస్వామిక ,ప్రజా వ్యతిరేక విధానాల పై ,వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాల పై తయారుచేసిన '' గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ '' పుస్తక ఆవిష్కరణ చేసారు.
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అమరుల బలిదానాల సాక్షి గ తెచ్చుకున్న తెలంగాణ రాచరిక పాలన ను తలపిస్తుందని, ఒంటెద్దు పోకడలు ఎన్ని రోజులు అని, ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి కి సూచించారు .
కార్యక్రమం లో అడ్వైసరి మెంబర్లు డోకుర్ పవన్ కుమార్ ,ఓరుగంటి కమలాకర్ రావు , యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ పని తీరు పై ఘాటుగా విమర్శించారు .
ఈ కార్యక్రమం లో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్ ,రామ్మోహన్ రెడ్డి ,రాకేష్ బిక్కుమండ్ల ,అచ్యుత రెడ్డి సభ్యులు ,సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి , దేవులపల్లి శ్రీనివాస్ ,మధు గట్ట ,తదితరుల ఆధ్వర్యం లో సుమారు 100 మంది పుస్తకావిష్కరణ కి మద్దతు తెలిపారు .






Telangana PCC Secretary Sravan Attends NRI Cell Meeting In London


Wednesday 12 July 2017

British Parliament with Shri Veer nidra Sharma, MP and a Veteran Leader of Labour Party


Along with Dokur Pavan Kumar, Gampa Venugopal, Mahesh Kumar. Shri Sharma is an inspiring personality with noble thoughts about Democracy.
We extended invitation to him to deliver a lecture at Hyderabad and share his ideas on strengthening Democracy in India
It was indeed a great honour to have participated in Osmania University Centenary Celebrations In London - UK along with MLC Ramchander Rao, Prof Murali Manohar and Lord Karan Billy Moria, former student of OU and member Of Lord Houses, UK and founder of Cobra Beers. 
I sincerely thank the organisers Venugopal Gampa, Sudhakar Rangula, Mahesh Jammalla and all others. It was a great inspiring experience. I felt lot to learn from UK in terms of social values and democratic principles and practice.
https://www.facebook.com/sravan.dasoju/videos/1781723465177717/

లండన్‌లో_ఘనంగా_ఓయూ_శతాబ్ది_ఉత్సవాలు.










విదేశాల్లో నాణ్యమైన విద్యావ్యవస్థ, విజ్ఞాన సంపత్తిని మన దేశానికి తెచ్చేందుకు సహకారం అందించాలి అల్యూమినిను కోరుతున్నాను. నాణ్యమైన విద్యావ్యవస్థ విధి విధానాలను రూపొందించాలి .ప్రవాసులు ఆర్ధికపరమైన సహకారమే కాకుండా తమ మేధస్సును, నైపుణ్యాన్ని ఇచ్చి ఉస్మానియా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.

Thursday 6 July 2017

బీటీ బ్యాచ్ అరాచకాలను అడ్డుకోండి: డా.శ్రవణ్

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది స్వార్ధపూరిత శక్తులు బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరి “బీటీ బ్యాచ్”గా చలామణి అవుతూ ప్రభుత్వ పెద్దల చలవతో, అధికారాన్ని ఆసరాగా చేసుకొని అనేక దాష్టీకాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ అన్నారు. ” బీటీ బ్యాచ్” రౌడీయిజం, గూండాయిజం, భూకబ్జాలకు పాల్పడుతూ తెలంగాణను అరాచకాలకు నిలయంగా మారుస్తున్నారని మండిపడ్డారు. సీతాఫల్ మండీలో తీగల బ్యాచ్ దుర్మార్గాలు మచ్చు తునకలు మాత్రమేనని చెప్పారు. వీరి దుర్మార్గాలపై సామాజిక మాధ్యమాలలో అనేక వార్తలు వచ్చినప్పటికి ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలపై స్పందించే మంత్రి కేటీఆర్  “బీటీ బ్యాచ్” విషయంలో మౌనం వహించడంవల్ల,  వారి ఆగడాలకు పరోక్షంగా ఊతం ఇచ్చినట్లైందన్నారు. “బీటీ బ్యాచ్” ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు చాలా సందర్భాలలో ప్రేక్షక పాత్ర పోషించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ లో ఉన్న “బీటీ బ్యాచ్” రౌడీయిజం పై చర్యలు తీసుకుని సామాన్య ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి 

http://www.newsdon.com/Telugu/take-action-on-bt-batch-d-sravan/
Today myself, Mahesh Kumar Goud, TPCC Gen Secretary, Anil Kumar Yadav, Youth Congress President and Sravanth Poreddy, TNRI Congress Visited and consoled Veera Swamy Goud who lost his both eyes in the brutal attack by TRS Coporator and their henchmen. Congress party assured them that they would fight for Justice.


https://www.facebook.com/sravan.dasoju/videos/1774466555903408/