Thursday 6 July 2017

బీటీ బ్యాచ్ అరాచకాలను అడ్డుకోండి: డా.శ్రవణ్

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది స్వార్ధపూరిత శక్తులు బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరి “బీటీ బ్యాచ్”గా చలామణి అవుతూ ప్రభుత్వ పెద్దల చలవతో, అధికారాన్ని ఆసరాగా చేసుకొని అనేక దాష్టీకాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ అన్నారు. ” బీటీ బ్యాచ్” రౌడీయిజం, గూండాయిజం, భూకబ్జాలకు పాల్పడుతూ తెలంగాణను అరాచకాలకు నిలయంగా మారుస్తున్నారని మండిపడ్డారు. సీతాఫల్ మండీలో తీగల బ్యాచ్ దుర్మార్గాలు మచ్చు తునకలు మాత్రమేనని చెప్పారు. వీరి దుర్మార్గాలపై సామాజిక మాధ్యమాలలో అనేక వార్తలు వచ్చినప్పటికి ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలపై స్పందించే మంత్రి కేటీఆర్  “బీటీ బ్యాచ్” విషయంలో మౌనం వహించడంవల్ల,  వారి ఆగడాలకు పరోక్షంగా ఊతం ఇచ్చినట్లైందన్నారు. “బీటీ బ్యాచ్” ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు చాలా సందర్భాలలో ప్రేక్షక పాత్ర పోషించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ లో ఉన్న “బీటీ బ్యాచ్” రౌడీయిజం పై చర్యలు తీసుకుని సామాన్య ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి 

http://www.newsdon.com/Telugu/take-action-on-bt-batch-d-sravan/

No comments:

Post a Comment