Tuesday 31 March 2020

పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు .

పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు . 

కోవిడ్-19  వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యలో భాగంగా  జీవోఎంఎస్ 27, తేదీ 30 మార్చి, 2020 ద్వారా పెన్షనర్ల జీతాల్లో కోత విధించాలనుకోవడం దురదృష్టకరం.

30, 40 ఏళ్ళుగా  ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి, ఈరోజు కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవనం గడుపుతున్న వృద్ధులకు తీవ్రమైన మానసిక క్షోభ కలిగించడంతో పాటు కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థి ఏర్పడుతుంది.  

చాలామంది రిటైర్డు ఉద్యోగులుఒకవైపు సొంత ఇల్లు లేక కిరాయి ఇండ్లలో మగ్గుతూ మరోవైపు  రోగాలతో నానా ఇబ్బందులకు గురవుతూ, వచ్చే పింఛన్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పుడు  వస్తున్న చాలీచాలని పెన్షన్ లో  50 శాతం కోత విధిస్తే వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కానీ, ఇంటికి  కిరాయిలు కట్టుకోవడానికి కానీ, నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి కానీ డబ్బులు లేక నానా ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఉంది.  

అంతే కాకుండా రిటైర్డ్ ఉద్యోగి చనిపోయిన తరువాత అతని పై ఆధారపడి ఉన్న భార్యకు వచ్చే పెన్షన్ దాదాపు 50 శాతం కంటే తక్కువగానే  ఉంటుంది.  ఉదాహరణకు రూ . 20 వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగి ఒకవేళ మరణిస్తే అతని భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్  కేవలం రూ .9 వేలు రూపాయలు కూడా సరిగ్గా రాదు. ఇలాంటిప్పుడు ఫ్యామిలీ పెన్షన్ లో కూడా 50 శాతం కోత విధించినట్లయితే, ఆ కుటుంబాలు బిచ్చమెత్తుకొని బతకాల్సిన  దుస్థితి ఏర్పడుతుంది.

కాబట్టి  మానవీయ దృక్పథంతో ఫ్యామిలీ పెన్షన్ లతో పాటు మొత్తం సర్వీస్‌ పెన్షనర్లు జీతభత్యాలను కూడా  కోత విధించవద్దని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు .

Monday 30 March 2020

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారి ట్వీట్ కి స్పందన

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారి ట్వీట్ కి స్పందన


జార్ఖండ్ రాష్టానికి చెందిన రోజువారీ ఉపాధి కూలీ కార్మికులు కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయి, ఉండడానికి కనీసం నివాసయోగ్యం కూడా లేకుండా చిక్కుకుపోయి ఉన్న తరుణంలో, ఈరోజు హైదరాబాద్ నగరంలో వారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారిని సంప్రదించడం జరిగింది. వారు పడుతున్న బాధలు చూసి వారిని ఆదుకోవడం కోసం శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, మంత్రి కేటీఆర్ గారికి మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారికి ట్విట్టర్ లో జార్ఖండ్ కార్మికుల సమస్యను తెలుపుతూ ట్యాగ్ చేయడం జరిగింది, వెంటనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు శ్రవణ్ దాసోజు ట్వీటీకి స్పందిస్తూ,  దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరియు లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న ప్రాంతంలోనే  ఉండడం మంచిదని మేము నిర్ణయం తీసుకున్నామని తెలుపుతూ. మా రాష్ట్ర పౌరులకు అక్కడే  ఆదుకోవాలని వారికీ ఆహారంతో పాటుగా అవసరమైన వస్తువులు మరియు ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి ఇద్దరికీ కూడా ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తూ, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారికి ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/HemantSorenJMM/status/1244571135427002368?s=19

ఖైరతాబాద్ నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఈరోజు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్, గురుబ్రహ్మ నగర్ బస్తీలోని పేదలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు సూచించారు, అలాగే కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన జాగ్రత్తలు ముఖానికి మాస్కులు ధరిస్తూ, చేతులను సబ్బుతో 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లను వాడాలని మరియు గుంపులుగా, సమూహాలుగా తిరగరాదని, సామాజిక దూరం లాంటి సూచనలను ప్రజలందరూ తప్పకుండా పాటించాలంటూ మాట్లాడం జరిగింది. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని  బస్తీల్లో కూడా  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలనా యంత్రాంగం వెంటనే  పారిశుద్ధ్య సంబంధిత చర్యలు చేపట్టాలని డ్రెయినేజీ, రోడ్లపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ దాసోజుతో పాటుగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.  వెంకటేష్, కాటూరి రమేష్, తదితరులు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ జరిగింది.


Distributd vegetables, eggs, and other essential commodities to the poor people at #Khairatabad Constituency, Jubilee Hills Division, Gurubrahma Nagar Basti along with Congress Party Assembly Senior Leaders V. Venkatesh, K. Ramesh and other leaders.