Tuesday 9 April 2019

70 రూపాయలు విలువ చేస్తే మందు సీసా కావాలనో లేదా మీ జీవితాలలో చీకటి తొలిగించి, వెలుగులు నింపే 72 వేల రూపాయల విలువ చేసే వరాలు కావాలనో మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.శ్రవణ్ దాసోజు

Ø 70 రూపాయలు విలువ చేస్తే మందు సీసా కావాలనో లేదా మీ జీవితాలలో చీకటి తొలిగించివెలుగులు నింపే 72 వేల రూపాయల విలువ చేసే వరాలు కావాలనో మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.శ్రవణ్ దాసోజు
Ø ఒకపూట నిషా కోసమోఒక పూట మందు సీసా కోసమో,  ఒక పూట కడుపు నింపే బిర్యానీ మాంసం కోసమోఒక వారం ఖర్చుల కోసం రెండు వేల నోటు కోసమోటిఆర్ఎస్ కి మీ ఓటు అమ్ముకొని .. మీ జీవితాలనుమీ పిల్లల జీవితాలను తాకట్టు పెట్టకండి  : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.శ్రవణ్ దాసోజు
Ø నియంతృత్వం కావాలనా లేదా ప్రశ్నించే ప్రజాస్వామ్య విలువలు కాపాడే నాయకులు కావాలనో మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి : డా.శ్రవణ్ దాసోజు
Ø మీ పాలనపై  వ్యతిరేకత లేకుంటే 300 మంది రైతులు ఎందుకు ఎన్నికలలో పోటీ చేస్తున్నారో చెప్పండి : దాసోజు
Ø వ్యాపారస్తులు కావాలనా లేదా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అని కొట్లాడిరాష్టాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు కావాలనో  మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి: డా.శ్రవణ్ దాసోజు
Ø భూ కబ్జాదారులకు ఓట్లు వేస్తె  బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో మీరే నిర్ణయించుకోండి:
Ø టిఆర్ఎస్బీజేపీలు రెండు కూడా నాణానికి ఒక వైపు ఉండే బొమ్మ మాత్రమే : శ్రవణ్ దాసోజు

హైదరాబాద్  09 ఏప్రిల్,2019: మంగళవారం  గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ  అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ మాట్లాడుతూటిఆర్ఎస్ ఎంపీ అభ్యర్దులంతా భూ కబ్జాదారులుక్రిమినల్ చరిత్ర ఉవ్నవారేనన్నారు.టిఆర్ఎస్ 16 మంది ఎంపీ అభ్యర్దులలో చక్రం తిప్పేవారు ఎవరూ లేరు. అంతా భూ కబ్జా దారులే. వారంతా దోచుకోవడమే తప్ప ప్రజలకు ఏం చేయలేరు. వ్యాపారస్తులు కావాలనా లేదా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అని కొట్లాడిరాష్టాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు కావాలనో  మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి మాట్లాడుతూభూ కబ్జాదారులకు ఓట్లు వేస్తె  బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో ప్రజలు అర్ధం చేసుకొని ఓటు వేయాలని మాట్లాడారుఅలాగే కోట్ల రూపాయలు కేసీఆర్ కిచ్చి టికెట్లు తెచ్చుకున్నారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లైంగిక వేధింపులమరియు కోట్ల రూపాయలు కుంభకోసం చేసిన ఆరోపణలు ఉన్నాయిని   శ్రవణ్‌ తెలిపారు. నమస్తే తెలంగాణలో సైతం ఆయన ఆర్థిక అవకతవకలు ప్రచురితం అయ్యాయని అన్నారు. వీటిని అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి టీఆర్‌ఎస్‌లో చేర్పించుకున్నారని,అనంతరం ఆరు గంటల వ్యవధిలో టికెట్‌ ఇచ్చారన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. పౌల్ట్రీ వ్యాపారంతో ఉన్న ఆయన ఎంపీగా ఎన్నికైతే వ్యాపారంపై తప్ప ప్రజలపై దృష్టి పెట్టరన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సైతం టికెట్‌ కోసం రూ. 100 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మంత్రి మల్లారెడ్డి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనిఆయన అల్లుడికి ఎంపీ టికెట్‌ కేటాయించారన్నారు.

 తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడికి సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చారని శ్రవణ్‌ పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వందల కొద్ది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉండగా సాయికిరణ్‌కు టికెట్‌ దక్కేందుకు ఆయన వంద కోట్ల క్లబ్‌లో సభ్యుడు అవడమే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ వివేక్‌కు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి నియంతృత్వం కావాలనా లేదా ప్రశ్నించే ప్రజాస్వామ్య విలువలు కాపాడే నాయకులు కావాలనో మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి అని మాట్లాడారు . 75 రూపాయలు విలువ చేస్తే మందు సీసా కావాలనో లేదా మీ జీవితాలలో చీకటి తొలిగించివెలుగులు నింపే 75 వేల రూపాయల విలువ చేసే వరాలు కావాలనో మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి అని మాట్లాడారు . అలాగే ఒకపూట నిషా కోసమోఒక పూట మందు సీసా కోసమో,  ఒక పూట కడుపు నింపే బిర్యానీ మాంసం కోసమో,ఒక వారం ఖర్చుల కోసం రెండు వేల నోటు కోసమోటిఆర్ఎస్ కి మీ ఓటు అమ్ముకొని .. మీ జీవితాలనుమీ పిల్లల జీవితాలను తాకట్టు పెట్టకండి అని ప్రజలకు గుర్తు చేశారు .

దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతూ టిఆర్ఎస్బీజేపీలు రెండు కూడా నాణానికి ఒక వైపు ఉండే బొమ్మ మాత్రమే అని  కేంద్రంలో మోడీరాష్టంలో కేసీఆర్  ఇద్దరు కలసి గత ఐదు ఏళ్లుగా ప్రజలను మోసం చేయడం జరిగింది . ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాననిప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధానమంత్రి  మోడీ నమ్మబలికాడుఅలాగే రాష్టంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీ బిడ్డలనుమేములను మోసం చేసిండ్రుఅలాగే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ద‌ళిత‌గిరిజ‌న కుటుంబాల‌కు 3 ఎక‌రాల వ్‌తవ‌సాయ‌ భూమిని ఇస్తానని ఇవ్వలేదుమైనార్టీలకు నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిండ్రు  అని మాట్లాడం జరిగింది . అలాగే టిఆర్ఎస్ పాలనపై ప్రజలలో మరియు రైతులలో పూర్తి వ్యతిరేకత ఉంది అని ఈ ఎన్నికలలో  300 మంది రైతులు ఎందుకు ఎన్నికలలో పోటీ చేస్తున్నారో టిఆర్ఎస్ చెప్పలేని  మాట్లాడారు . చివరాగాను పదహారు నినాదంతో టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందనిప్రస్తుతం అదే సంఖ్య కలిగి ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణకు ఏదీ సాధించ లేకపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న దానిని సైతం టీఆర్‌ఎస్‌ఎంపీలు సాధించలేకపోయారన్నారు. ఇప్పుడు 16 సీట్లు గెలిపించాలని కోరుతున్న కేసీఆర్‌కేటీఆర్‌లు తమ ఇప్పటివరకు ఏం చేయలేకపోయామని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్రిమినల్‌ నేరచరిత్ర ఉన్నవారుమలిన చరిత్ర ఉన్న వారిని తిరస్కరించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు .

పేదరిక నిర్ములన కోసమే పేద కుటుంబాలకు సంవత్సరానికి 72,000 వేల రూపాయల హమీని రాహుల్ గాంధీ మేనిఫెస్టో లో పెట్టారు.  ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రజలు కూడా పని చేసే వారికి పట్టం కట్టాలి కానీ పదవులతో తరాలకు తరగని ఆస్తి కూడబెట్టే వారికి కాదు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం.” అని దాసోజు శ్రవణ్ అన్నారు

No comments:

Post a Comment