Thursday 28 March 2019

పట్టాదారు మార్పిడిపై సీఎం కేసీఆర్ ఆదేశాలు చట్ట వ్యతిరేకం :ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్‌

·        పట్టాదారు మార్పిడిపై సీఎం కేసీఆర్ ఆదేశాలు చట్ట వ్యతిరేకం :ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రణ్
·        ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌రాభావాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకే ఈ ఎత్తుగ‌డ
·        కేసీఆర్ ఫోన్ కాల్‌..ఓ దృష్టి మ‌ళ్లింపు చ‌ర్య‌
·        అధికారులు నిబంధ‌న‌లు పాటించ‌డ‌కుండా ప‌ట్టా మార్పిడి చేయ‌డం స‌రికాదు
·        ఈసీ పక్షపాత వైఖరి పై బహిరంగ  లేఖ : శ్రవణ్  దాసోజు

హైద‌రాబాద్‌మార్చి 28, 2019: ప‌ట్టాద‌ర్ పాసుపుస్త‌కం విష‌యంలో రైతు ఎదుర్కున్న స‌మ‌స్య‌ను ఫోన్ కాల్ ద్వారా ప‌రిష్క‌రించిన‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం  దృష్టి మ‌ళ్లింపు చ‌ర్య అని ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్‌ దాసోజు శ్ర‌వ‌ణ్ ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు చోట్లా ఓడిపోవ‌డంతో ప‌రాభావాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గురువారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ``సీఎం ఇలా ప్రజలకు  అందుబాటులో ఉంటే ఆ సీటులో ఎవ‌రున్నా అయినా స్వాగతించాల్సిందే.అయితేసెక్రటేరియట్ రాకుండా సోషల్ మీడియా గవర్నెన్స్ చేస్తానంటే అంటే ఎవ‌రైనా ప్రశ్నిస్తరు. సీఎం సెక్రటేరియట్ రాకపోవడంతో ఏండ్లు దాటిపోయింది. మంత్రులుఎమ్మెల్యేలకు ఆయన అందుబాటులో  ఉండరు. కొందరికే అదుబాటులో ఉంటరు. ఫేస్ బుక్ లో సమస్య పరిష్కారం అయిందని ఫర్మానా జారీ చేశారు. తిరిగి పోస్ట్ చేయాలని కోరారు. అటెన్షన్ డైవర్షన్ అనే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ రైతుతో ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు`` అని మండిపడ్డారు. 

ఇటీవ‌ల కేసీఆర్టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. ``88 సీట్లు గెలిపించిన తర్వాత కూడా తిరిగి వివిధ పార్టీల నుంచి చేర్చుకోవ‌డం వారిలో అంతర్గతంగా ఉన్న భయానికి నిదర్శనం. గెలిచిన వారితో పార్లమెంటులో విజయం సాధించవచ్చు అయినప్పటికీ ఇలా చేర్చుకోవడం `కారు పంచర్అవుతుందనే భయానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆ ఎన్ని ర‌కాల ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృత్తం అవుతాయిఅని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదీ అమలు కాలేదని,  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది స్పష్టమైన నేపథ్యంలో దాన్ని దారి మల్లించేందుకు శరత్ అనే రైతుతో ముచ్చటించారని శ్రవణ్ స్పష్టం చేశారు.  కేసీఆర్ పాలనలో ..ఐఏఎస్ లు డూడూ బసవన్నలాగా మారారని ఆరోపించారు. పేస్ బుక్ లో  పోస్ట్ పై సీఎం ఫర్మానా ప్రకటించడం ..కలెక్టర్ తానా అంటే తందానా అనడం చట్ట  విరుద్ధమని శ్రవణ్ పేర్కొన్నారు.
తెలంగాణ పట్టాదారు చట్టం, 1971 ప్రకారం పట్టా మార్పిడి విషయంలో 15 రోజుల నోటీసులు జారీ చేసి,విచారణ చేయవలసిందనే విషయం అధికారులకు తెలియదా?
అన్నదమ్ముల మధ్య గేట్ల పంచాయతీని ఫోన్ లో పరిష్కరించడం హాస్యాస్పదమని శ్ర‌వ‌ణ్ అన్నారు. ఫేస్ బుక్ లో పోస్టులన్నీ నిజాలు కావనిఅవి అభిప్రాయాలేనని శ్రవణ్ తెలిపారు. ఏ భూ పంచాయతీ ఫోన్లలో పరిష్కరించలేదనితానేదో గొప్ప‌గా చేశానని చెప్పిన కేసీఆ అసలు విషయం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రైతు శరత్ వాదన తప్పని చెప్తూ జ్యోతి అనే మహిళ చెప్పిందని వెల్లడించారు. సదరు మహిళా జ్యోతి విడుదల చేసిన ఆడియోను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్టాదారు చట్టం, 1971 ప్రకారం పట్టా మార్పిడి విషయంలో 15 రోజుల నోటీసులు జారీ చేసి,విచారణ చేయవలసిందనే విషయం అధికారులకు తెలియదాముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు చట్టవిరుద్ధం అని శ్రవణ్ ప్రశ్నించారు. 


ధరణి వెబ్ సైట్ ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమని శ్ర‌వ‌ణ్ అన్నారు. ధరణి వెబ్‌సైట్  తప్పుల తడక అని స్పష్టం చేశారు. చట్టసంబంధమైనన్యాయసంబంధమైన ప్రామాణికత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నందున కేసీఆర్ కక్ష సాధించాలని చూస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. రెవెన్యూ విభాగంలో అవినీతి ఒకవేళ ఉండి ఉంటేదానిని ఈ రూపంలో కక్ష సాధింపుతో పరిష్కరిస్తారాఅని ప్రశ్నించారు. ఒకవేళ భూ సమస్యలపై కేసీఆర్‌కు పరిష్కారం ఉంటే ఎందరు వీఆర్ఓవీఆర్ఏలను నియమించారని ప్రశ్నించారు. ఉద్యోగాలు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయనివాటిని భర్తీ చేయకుండా ఉద్యోగులపై ఒత్తిడిలో ఉంచారని ఆరోపించారు. పని ఒత్తిడిలో వారు అవకతవకలకు పాల్పడితే ఇలా కక్ష సాధిస్తారా అని సూటిగా నిలదీశారు. భూ ప్రక్షాళన పేరుతో నిధులు విడుదల చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజమైన భూసర్వే చేయకుండా ..తమ అక్రమాలకు ఆమోదించుకున్నారు. తెలంగాణ టైటిల్ గ్యారంటీ యాక్ట్ పేరుతో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆనాడే ఆదేశాలు ఇచ్చిందన్నారు. భూసర్వే రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని ప్రశ్నించారు.

ఈసీ పక్షపాత వైఖరి పై బహిరంగ  లేఖ : శ్రవణ్  దాసోజు 

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో  వైసీపీ పిర్యాదు ఇచ్చిన వెంటనే ఏపీలో అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్నారని తెలంగాణాలో ఓట్ల తొలగింపుపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్ర‌వ‌ణ్‌ ప్రశ్నించారు. 25 లక్షల ఓట్ల తొలగింపు విషయంలో ఫిర్యాదు లు వచ్చినా ఎందుకు చర్యలు లేవు?  సీఈఓ రజత్ కుమార్ స్వయంగా క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. పోలైన ఓట్లుగెలుపొందిన ఓట్ల విషయంలో ఎంతో తేడా ఉందని లిఖిత పూర్వ ఫిర్యాదు చేశామన్నారు. ఈసీ ద్వంద్వ నీతితో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్కు బహిరంగ లేఖ రాశామనితగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.



No comments:

Post a Comment