Tuesday 21 August 2018

లెక్చరర్ల బదిలీల్లో లెక్కలేని అవినీతి, అక్రమాలు..శ్రవణ్ దాసోజు

  • లెక్చరర్లటీచర్ల బదిలీల్లో లెక్కలేని అవినీతిఅక్రమాలు..శ్రవణ్ దాసోజు
  • అక్రమ బదిలీలలో  ఇచ్చిన  ఓడీ లు వెంటనే  రద్దు చేయాలి .
  • అక్రమ బదిలీల కు పాల్పడిన  అధికారులపై విచారణ జరిపించి చిత్తశుద్ది నిరూపించుకోండి..
  • లెక్చరర్ల ఖాళీలుకళాశాలల వివరాల పై శ్వేత పత్రం విడుదల చేయాలి
  • భాధ్యత కల పార్టీగా మీ అవినీతిని ప్రశ్నిస్తే...అవినీతి పరుడైన అధికారి తో ఎదురుదాడి చేయిస్తారా.. ...శ్రవణ్ దాసోజు
  • నవీన్ మిట్టల్ మిలీనియం బ్రోకర్ --- దాసోజు శ్రవణ్
  • ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి..

భాద్యత కల ప్రతిపక్షంగా తాము విద్యాశాఖ అవినీతిని వెలుగులోకి తెస్తే రాజకీయ లబ్దికోసమే ఆరోపణలు చేస్తున్నారని అవినీతి పరుడైన అధికారితో మాపైనే విమర్శలు చేయిస్తారాఅంటూ టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మీడియా సమావేశంలో మండిపడ్డారుఇవాళ సాయంత్రం గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. విద్యాశాఖ లో జరుగుతున్న అవినీతిని  ఆధారాలతో సహా బయట పెడితే విచారణ కు ఆదేశించాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి పాల్పడుతోందని ఎద్దేవా చేశారురాష్ట్రఏర్పాటయి  నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విద్యాశాఖ ఇటీవల చేపట్టిన బదిలీల ప్రక్రియ  ప్రహసనంగా మారిందని..విద్యార్ధులకు అత్యుత్తమైనవిద్యనందించాల్సిన విద్యా శాఖ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు శ్రవణ్.. విద్యార్ధుల బాగు కోసంకళాశాల అవసరాలకోసం చేపట్టాల్సిన బదిలీలనుఅర్హులైన లెక్చరర్ల తో భర్తీచేయకుండా..కేవలం కొందరు లెక్చరర్ల స్వప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా చేయడం అధికారుల అవినీతిఅక్రమాలకు పరాకాష్టగా మారిందంటూ ముఖ్యమంత్రి కి సహేతుకంగా లేఖ రాస్తే స్పందన లేదని సంబంధిత విద్యాశాఖ మంత్రి,ముఖ్యమంత్రి స్పందించకుండా అవినీతి కి మారుపేరైన నవీన్ మిట్టల్ వ్యవహారంలోదోషిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న తనే  స్పందించడమేంటని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు .


వెబ్ కౌన్సిలింగ్ ముగిశాక ఓడీ పోస్టుల భర్తీకోసం దొడ్డిదారిన కాకుండా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ పై దాడి చేయడం అన్యాయం అని అయనఅన్నారు.
ప్రతి కాలేజిలో స్కెలిటిన్ స్టాఫ్ ఉండాలన్న కనీస నియమం పాటించకుండా ఒక్క లెక్చరర్ కూడా లేకుండా కళాశాలలు ఎందుకు ఖాళీ చేశారని జోన్లు దాటి ఇతర జోన్లకు కూడాఓడి  పేరిట అక్రమంగ ట్రాన్స్ ఫర్ లు చేశారని వివరాలతో సహా ఆరోపించారుమీడియా సాక్షిగా తాము ఆరోపించిన విషయాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా అంటూప్రభుత్వ పెద్దలతో సహా అధికారులకు ఆయన సవాల్ విసిరారు.

కళాశాలల విద్యార్థుల సంఖ్య,రెగ్యులర్ లెక్చరర్ల సంఖ్యఓడిపై ఏకళాశాల నుండి   కళాశాలకు పంపారు వివరాలు పూర్తిగా బయటపెట్టాలన్నారు .  వెబ్ కౌన్సిలింగ్ ముగిశాకపోస్టింగులు మార్చి ఎందుకు ఇచ్చారు విద్యాశాఖాధికారులు వెల్లడించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు  వెబ్ కౌన్సిలింగ్ లో చూపని ఖాళీలకు తర్వాత పోస్టింగులు ఎలా ఇచ్చారుఅందరికి సమన హక్కు కల్పించే విధంగా  డి లో భర్తీ చేసిన ఖాళీలకు లెక్చరర్ల అందరినుండి  తిరిగి ఆప్షన్స్ ఎందుకు అడగలేదో స్పష్టం చేయాలనినోటిఫికేషన్ ఎందుకువేయలేదో చెప్పాలని డిమాండ్ చేసారు.

వరంగల్ లో పని చేస్తున్న లెక్చరర్ ను మహబూబ్ నగర్ కు ఆన్ డ్యూటీ బదిలీ చేసి వరంగల్ కు సిద్దిపేట నుండి ఎందుకు ఆన్ డ్యూటీ ఇచ్చారని అలాగే గజ్వెల్ నుండి వరంగల్కు పరస్పర బదిలీని ఆన్ డ్యూటీ  ఎందుకు బదిలీ చేసారో  తెలపాలనిఇది   వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడం కోసమా లేక కళాశాలలను బలోపేతం చేయడం కోసమా నవీన్మిట్టల్ స్పష్టం చేయాలనీ ,తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు .

ఇప్పటివరకు ఎంత మందికి కౌన్సిలింగ్ తర్వాత పోస్టింగ్ లు మార్చి ఇచ్చారో బయటపెట్టాలని జనరల్ వెబ్కౌన్సిలింగ్ లో ఓడి పోస్టులు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు జగిత్యాల కళాశాల నుండి సగానికి పైగా లెక్చరర్లను ఓడిపై బదిలీ చేసిన మాట వాస్తవం కాదా....కాలేజీల్లో సిబ్బంది లేనప్పుడు బదిలీ  ఎందుకు చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు·

నవీన్ మిట్టల్ అన్నట్లుగా కేవలం పదిహేడు మంది ని ట్రాన్స్ఫర్ చేయడం  అత్యవసరమనుకుంటే తొంభై మందికి ఎందుకు ఇచ్చారు.ఇందులో ఉన్న మతలబేంటోవెల్లడించాలన్నారువాస్తవానికి 140 మందిని ట్రాన్స్ఫర్ చేసారు.

కళాశాలల వారీగా విద్యార్థుల సంఖ్యరెగులర్ లెక్చలర్ల సంఖ్యఓడిపై నియమించిన పూర్తి వివరాలు దమ్ముంటే బయటపెట్టాలిలెక్చరర్స్ లేరు అనే నెపం తో OD ట్రాన్స్ఫర్లుచేసిన , కమిషనేర్
అసలు నాలుగు ఏళ్లుగా ఎందుకు లెక్చరర్ ఖాళీలు నింపలేదో సమాధానం చెప్పాలిలఖ్లాడి మంది అర్హులైన నిరుద్యోగులున్నఎందుకు రిక్రూట్మెంట్జరపలేదు సమాధానం చెప్పాలి.

అక్రమ ఓడీ  వల్ల చాలా కాలేజీలు జీరో స్టాఫ్ గా మారిపోయాయని . ఇందుకు ఉదాహరణగ
ఆదిలాబాద్ డిగ్రీకళాశాల లో జీరో స్టాఫ్ ఉన్నదాని  నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిబిచ్ కుందా
బాన్స్ వాడల్లో ఒక్క లెక్చరర్ లేకుండా చేసింది నిజమా కాదా...అని ప్రశ్నించారు





No comments:

Post a Comment