Monday 7 August 2017

#GST పై పూటకో మాటతో తుగ్లక్ ని తలపిస్తున్న KCR ప్రభుత్వం.

1.పూటకో మాటతో తుగ్లక్ ని తలపిస్తున్న KCR ప్రభుత్వం
2. దేశ అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికలలో బీజేపీ కి మద్దతు ఇచ్చి, ఇప్పుడు కొత్త డ్రామా చేస్తున్నరు, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు.
3. Why TRS unilaterally passed a resolution favouring GST Bill in Telangana Assembly? What is the secret deal with Modi and NDA Govt?
3.GST మండలి సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్నKTR ఆ సమావేశాన్ని నీరసించి ఎందుకు బహిష్కరించి రాలేదు.ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు
4. చేనేత ఉత్పత్తుల పై GST ఎత్తివేయించలేని KTR, ఇవాళ చేనేత సంబురాలు నిర్వహించడం ఒక మోసం.
5. GST వల్ల తెలంగాణ కు వస్తున్న నష్టాలపై శేతపత్రం ప్రకటించాలి
6. అఖిల సమావేశం నిర్వహించి, అన్ని విషయాలు చర్చించాలి
GST తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుందని కాంగ్రెస్ పార్టీ, అధికారులు ఎంత మొత్తుకున్నా వినకుండా, దేశం లో ఏ రాష్ట్రం కూడా అసెంబ్లీ తీర్మానం చేయక ముందే ఎలాంటి చర్చ లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కి అసెంబ్లీ తీర్మానం చేసి GST వల్ల చాలా లాభం, చాలా మంచిదని ప్రకటించారు
GST వల్ల రాష్ట్రంలో రావాల్సిన 3 వేల కోట్ల రూపాయలు నష్ట పోతామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతే కాకుండా పాత నిర్మాన పనులకు 18 శాతం GST వేస్తే దాదాపు 30 వేల కోట్ల భారం పడుతుందని ప్రాథమిక నివేదికలో అప్పుడు తేల్చారు.
అలాగే తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు అయిన కామెర్సియల్ టాక్స్ లో 6 వేల బాకయిలు నష్టపోతామని..మొత్తంగా 40 వేల కోట్ల నష్టం ఉందని ఎంత మొత్తుకున్నా వినని KCR ఇప్పుడు ఏదో మేకపోతు ఘంబిర్యం ప్రకటిస్తున్నారు.
ఇవన్నీ ముందుగానే KCR కు అధికారులు చెప్పిన కూడా మోడీ వద్ద తన పలుకుబడి పెంచుకోవడం ద్వారా తన సీబీఐ, ఈడీ కేసులను బయటకు రాకుండా చూసుకునేందుకు GST కి భే శరతుగా మద్దతు ఇచ్చారు.
Gst వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కేంద్రం భరిస్తుందని. అయితే అభివృద్ధి రేటు తక్కువ ఉన్న ర్రాష్ట్రాలకు మాత్రమే అది వరిస్తుందని GSTమండలి చెప్పింది. కానీ కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి రేటు తక్కువగా ఉన్న అప్పులు కోసం ఆశపడి, దాదాపు 19 శాతం ఉందని గొప్పలు చెప్పి కేంద్రం నుంచి రావాల్సిన సహాయాన్ని రాకుండా చేశారు.
ఇపుడు నిర్మాణ పనులపై GST మండలి 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తె అది తన గొప్ప తనమని చెప్తున్నKCR మరి 5 శాతానికి ఎందుకు తగ్గించుకోలేక పోతున్నాడు.
తాను చెప్పడం వల్లనే మోడీ రాష్ట్రపతి అభ్యర్థిని దళిత నేతను ప్రకటించారని చెవుతున్న గొప్పలు చెప్తున్న కేసీఆర్ GST లాంటి చిన్న పనికి న్యాయ పోరాటం ఎందుకు చేయాలి.
తమ హక్కుల కోసం న్యాయ పోరాటాలు చేసే వాళ్ళు KCR దృష్టిలో పిశాచలు, సన్నాసులు కదా.. మరి అలాంటి పిశాచి, సన్నసుల పనులు కేసీఆర్ ఎలా చేస్తా అంటున్నారు.. ఆయన సన్నసిని, పిశాచిని అని ఒప్పుకుంటున్నాడా?
గతంలో ముస్లిం రేసేర్వేషన్లను అమలు చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా అన్న కేసీఆర్, ఎందుకు తోక ముడిచారు..
ఇప్పుడు దాదాపు 30 వేల కోట్ల నష్టం వస్తున్న తరుణంలో వాటిని ఎలా పూడుస్తారు..
ఒకవైపు మోడీ కేసీఆర్ ను, తెలంగాణ ను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్క హామీ నెరవేర్చమ్ లేదు. కేంద్రం నుంచి మనకు హక్కు గా రావాల్సిన నిధులు కూడా రావడం లేదు.
కానీ కేసీఆర్ మాత్రం నోట్ల రద్దు, GST, భూసేకరణ బిల్లు, తదితర అంశాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగానే అసెంబ్లీ లో ఆమోదం చేసి పంపారు.. మోడీ మాత్రం మనకు అసెంబ్లీ సీట్లు పెంచడు, GST తగ్గించడు. మన హక్కులు అమలు చేయడు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఒక చట్టపరమైన హామీ ఇంతవరకు అమలు కాలేదు. విభజన చట్టంలో రావాల్సిన హక్కులు అమలు కాలేదు, మరి వాటి విషయంలో కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదు.
హై కోర్ట్ ఇవ్వడు, ట్రైబల్ యూనివెర్సటీ ఇవ్వడు, కౌచ్ ఫ్యాక్టరీ ఇవ్వడు, ఇనుము పరిశ్రమ ఇవ్వడు, జాతీయ ప్రాజెక్టు ఇవ్వడు, అయిన కూడా KCR భే శరతుగా మద్దతు ఇస్తాడు. ఇదంతా తెలంగాణకు ద్రోహం కాదా..
విజ్ఞులైన్ తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల.ఒక రబ్బర్ స్టాంప్ లా తయారయ్యాడు. Why Etala is not being called for GST review meetings held by CM KCR?
Why KTR is allowed to attend the GST meetings in Delhi? Is etala not a finance minister?
If KTR is all pervasive powerful man, then give finance Ministry also to KTR?
KCR in his attempt to promote KTR in Delhi circles, he is reducing finance minsiter as a mere rubber stamp and puppet.
ఒక బాధ్యత లేదు, జవాబు దారి తనం లేదు, ఒక్క మంత్రి సచివాలయానికి రాడు, ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వం,
మోడీకి లేఖ రాస్తానని చెప్తున్న కేసీఆర్ ఇవే అంశాలను అసెంబ్లీ తీర్మానం లో.నమోదు చేస్తే చట్టపరంగా ఉండేది కదా..
GST మండలి సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్న KTR ఆ సమావేశాన్ని నీరసించి ఎందుకు బహిష్కరించి రాలేదు.ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు..
15 మంది లోకసభ ఎం. పిలు, ముగ్గురు రాజ్యసభ ఎమ్.పి లు ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు..
చేనేత ఉత్పత్తుల పై GST ఎత్తివేయించలేని KTR, ఇవాళ చేనేత సంబురాలు నిర్వహించడం ఒక మోసం.ఉప్పు, చేనేత లను స్వాతంత్ర పోరాటంలో ఉప్పు, చేనేత లను ఆయుధాలుగా మలచుకొని బ్రిటిష్ కు పోరాడినం. అటువంటి చేనేత పై GST వేయడం స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధం.
తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మోడీ దగ్గర చెక్క భజన చేస్తున్నారా ?
డా శ్రవణ్ దాసోజు
ప్రధాన కార్యదర్శి
ముఖ్య అధికార ప్రతినిధి
తెలంగాణ కాంగ్రెస్

No comments:

Post a Comment