Friday, 25 October 2019

ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయం పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరిపించాలి... శ్రవణ్ డిమాండ్

హై కోర్ట్ తీర్పులను బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా కెసిఆర్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డట్లే - శ్రవణ్ ఆరోపణ


ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన, తెలంగాణ సమాజం మొత్తం ఆమోదించినట్టు కాదని గుర్తు పెట్టు కోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సముద్రంలో అలలు ఉన్నట్టు ఆటుపోట్లు సహజం. ఓటమిని  హుందాగా స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అపజయాన్ని స్వీకరిస్తోందని చెప్పారు. ఎన్నికలలో గెలిచినంత  మాత్రాన కెసిఆర్ నియంతృత్వ ప్రభుత్వ విధానాల కు ప్రజల మద్దతు ఉన్నట్టు కాదు అని శ్రవణ్ అన్నరు.

నిన్న ముఖ్యమంత్రి చాలా అహంకార పూరితంగా, అప్రజస్వామికంగా మాట్లాడారు.  పైగా ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, విపక్షాలపై , జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం బాధాకరమని అన్నారు. 

 ప్రతిపక్షాలు ప్రతి పక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, తమ పంథా మార్చు కోవాలని కెసిఆర్ అన్న మాటలకు, సమాధానంగా  సంతలో గొడ్లను కొనుగోలు చేసినట్లు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడం ఏ పంథా అని ఎద్దేవా చేసారు. సీఎం ను చూస్తూ వుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోంది. ప్ర నీతులు చెప్పే ముందు తాను వెనక్కి చూసుకోవాలన్నారు. అత్యంత భాద్యతా రాహిత్యంతో, గెలుపు అహంభావంతో కేసీఆర్ మాట్లాడారు. ఆయన చేసేవన్నీ నీతి మాలిన పనులు. మరో వైపు నీతులు వల్లె వేస్తూ విపక్షాలపై నోరు పారేసు కోవడం ఆయనకే చెల్లిందన్నారు. కిలో చికెన్ ఇవ్వకుండా, మద్యం ఇవ్వకుండా, 2 వేల నోటు ఇవ్వకుండా ఎలా గెలిచారో ఆయన అంతరాత్మకు వదిలేస్తున్నామని అన్నారు. తాను కొలిచే యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ్మ స్వామి, లేదా తాను కొలిచే అమ్మ వారిపై ప్రమాణం చేసి చెప్పమనండి ఇవేవి లేకుండా హుజూర్ నగర్ లో గెలిచానని కెసిఆర్ చెప్పాలని సవాల్ విసిరారు దాసోజు.

ఒక తిమింగలం వలె వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతులను కాలరాస్తూ, ఆధిపత్య అహంకారంతో ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులకు కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని మరిచి పోయి కనీస ఇంగితం  లేకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి పోయి దిగజారి మాట్లాడారు. తనను దిక్కరంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతారా అనే అక్కసు తో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బేవకూఫ్ లని, బుద్ధి  జ్ఞానం లేదని, ఇష్టానుసారం మాట్లాడారు.

సీయం అనే వ్యక్తి తండ్రి లాంటి వారు. పిల్లలు అలిగితే తండ్రి సముదాయించడం సహజం. కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన వ్యక్తి కార్మికుల కడుపులో తన్నినట్లు వ్యవహారం చేస్తూ, తన మాట వినకపోతే కానీ వినక పోతే వాల్ల జీవితాలు నాశనం చేస్తాను అన్నట్లు రెచ్చి పోయి వ్యవహరించడం సబబు కాదన్నారు.

కరీంనగర్ ఎన్నికల సభలో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన మీరే మాట మార్చారు. కార్మికులను తక్కువ చేసి టార్గెట్ చేశారు. యూనియన్ల వల్లనే ఆర్టీసీ కి నష్టం అన్న కెసిఆర్ టీఎంయూ ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని నిలదీశారు. . ఈ సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడు గా యెట్లా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనాలని కోరలేదా, నువ్వు ఉద్యమ సమయంలో వారితో కలిసి భోజనం చేయలేదా అని ప్రశ్నించారు.  సరే నీ అవసరం కోసం వారిని వాడుకున్నావు. ఇప్పుడు పవర్ లోకి వచ్చాక వారిని వదిలేశావు. ఇప్పుడు సమ్మె చేయడం నేరమంటున్నావు. ఇదెక్కడి నీతి అని దాసుజు నిలదీశారు.

ఎవడయ్యా అని ఒక జర్నలిస్టును బేవకూఫ్ అంటూ మాట్లాడారు. . దసరా పండుగ చేసుకోకుంట కార్మికులు, వారి కుటుంబాలు  ఓ వైపు పస్తులు పడుతుంటే, వారి బాధను గుర్తించ కుండా కెసిఆర్ తో సహా తెరాస పెద్దలు వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడారు. జర్నలిస్టులని అందరిని బెదిరిస్తూ కేసీఆర్ మాట్లాడారు. కడుపు మండి కార్మికులు ఒక మాట మాట్లాడితే ఆ ఒక్క దానిని మనసులో పెట్టుకుని 50 వేల మంది కార్మికులను పొట్ట గొట్టాడన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని దయ్యం అని,, మన్మోహన్ సింగ్ ని అటెండర్ అని  కెసిఆర్ పలుమార్లు అనరాని మాటలు అన్నారని, . అయినా భేషజాలకు పోకుండా కేసీఆర్ తో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయాన్నీ  కేసీఆర్ మర్చి పోయారా అని ప్రశ్నించారు.

ఆర్టీసీకి సంబంధించిన లెక్కలను కాగ్ కు కూడా  ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీకి సంబంధించి అప్పుల మీద ఆస్తుల మీద ఆదాయం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరారు. మీరేమో చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్లు ఇష్టం వచ్చినట్లు మారుతున్నారు. కెసిఆర్ 5 ఏళ్లలో 4250 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతుంటే, ఆర్టీసీ కార్మికులు కేవలం 5 ఏళ్లలో 712 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వాళ్ళ వాదన. ఎవరు నిజం ఎవరు అబద్ధం. అందుకే హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయం పై  సమగ్ర విచారణ జరిపించాలని శ్రవణ్ డిమాండ్ చేసిండు.

వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆర్టీసీ కి ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడి అయ్యిందన్నారు. వాటన్నింటిని ప్రైవేట్ పరం చేయాలనీ కుట్ర కు తెర తీసింది అని ఆరోపించాడు. ఆర్టీసీ సేవా సంస్థ నా, లేక లాభాపేక్ష ఉన్న ప్రైవేట్ సంస్థ నా అని ప్రశ్నించారు. ఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదు. సీఎం రోజు వారీగా ఈ సంస్థను మానిటరింగ్ చేయలేడు. కావాలని ఆర్టీసీని సమ్మెలోకి నెట్టి వేసిన ఘనత కేసీఆర్ దే నని ధ్వజమెత్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను నిలువు దోపిడీకి పాల్పడుతు లాభాలు ఆర్జిస్తున్రు ఇది సీఎం కు తెలియదా అని ప్రశ్నించిండ్రు.

కార్మికులపట్ల  ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా వక్ర భాష్యాలు మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఆర్టీసీ, కార్మిక శాఖల మంత్రిగా పనిచేసిన కెసిఆర్ కు కార్మిక చట్టాల పై కనీస అవగాహన లేనట్లు,  సోయి లేకుండా సమ్మెలు చేయొద్దని, ట్రేడ్ యూనియన్లు వద్దంటున్నారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న మీరు ఆఫీస్ కు రాకుండా ఉంటున్నారు. మరి మీకెందుకు జీతమని దాసుజు నిలదీశారు.

అత్యున్నత న్యాయ స్థానం ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వమని ఆదేశించిన స్పందించక పోగా,  ఇవ్వకపోతే కోర్టు కొడుతదా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా అని ప్రశ్నించిండు. కేంద్రం కొత్తగా తెచ్చిన  మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణకే  వర్తిస్తదా ..మరి ఏపీలో జగన్ కు వర్తించదా అని ప్రశ్నించిండు. మరి ఏపి లో ప్రభుత్వం లో విలీనం చేసినట్లు  తెలంగాణ లో ఎందుకు చేయడం లేదు అని నిలదీసింది.

తాను రోడ్డు రవాణా శాఖా మంత్రిగా ఆరోజు విశాఖ పోయిన, టాయిలెట్స్ చూశానని తద్వారా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టానని చెప్పిన కెసిఆర్,  మరి ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టేందుకు అదే  తెలివిని ఎందుకు రావాణా శాఖా అధికారులు, రవాణా మంత్రికి ఇవ్వలేక పోయారని ప్రశ్నించిండు.  ఒక వేళ వాళ్లు దద్దమ్మలు అయితే, స్వయంగా కెసిఆర్  ఆరేళ్లుగా తాను ఎందుకు తాను మంత్రిగా చేసిన ప్రయత్నం చేయలేక పోయారని దాసోజు ప్రశ్నించారు.

సంఘాలు వద్దు, యూనియన్లు వద్దు అంటున్న కేసీఆర్ టీఎన్ జిఓ , టీజీవో సంఘాల నేతలతో సీఎం ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. డూడూ బసవన్నలతో మాట్లాడతాడు..కానీ హక్కులను ప్రశ్నించే వారిని మాత్రం ఒప్పుకోడు అని నిలదీసిండు.

తెలంగాణను అప్పుల రాష్ట్రం గా మార్చిన  కెసిఆర్  ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలా అని దాసుజు ప్రశ్నించారు. నిజం షుగర్ ఫ్యాక్టరీ తో సహా నిజాం వారసత్వ సంపద ని అయిన ఆర్టీసీ ని   ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.  ఇలాగే చేస్తే కాసిం రజివికి   పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చించాలని డిమాండ్ చేసారు.

Thursday, 17 October 2019

కేసీఆర్‌ తీరుపై ప్రకృతి కూడా పగ పట్టింది : ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


  • కేసీఆర్‌ తీరుపై ప్రకృతి కూడా పగ పట్టింది–శ్రవణ్‌
  • హుజూర్‌నగర్‌కు రావద్దనే ప్రకృతి ప్రకోపించింది..
  • హుజూర్‌నగర్‌ ప్రజలను దేవుడు రక్షిస్తున్నాడు..
  • ఇప్పటికైనా కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని వీడాలి
  • ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేయడంపై నిప్పులు ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


హైదరాబాద్, అక్టోబర్‌ 17 హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గురువారం బహిరంగసభలో టీఆర్ఎస్‌ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు ప్రకృతి కూడా అడ్డుపడిందని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ అన్నారు. కుండపోతగా వర్షం కురవడం ద్వారా దేవుడు హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ను రావద్దని ఆదేశించాడని వ్యాఖ్యానించారు.

హుజూర్‌నగర్‌లో గురువారం శ్రవణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ తీరు పట్ల ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని, అందుకే హుజూర్‌నగర్‌ బహిరంగసభకు కేసీఆర్‌ హెలికాఫ్టర్‌ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందన్నారు. దీని ఫలితంగాకే కేసీఆర్‌ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఈ విధంగా దేవుడే వాతావరణం రూపంలో వచ్చి కేసీఆర్‌ను అడ్డుకున్నాడని వ్యాఖ్యానించారు. అసత్యాలతో చేయని వాటిని కూడా చేశామంటూ తప్పుడు హామీలు ఇచ్చేందుకు కేసీఆర్‌ వస్తున్నాడని తెలుసుకునే దేవుడు అతి భారీ వర్షం రూపంలో అడ్డుకున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

భారీ వర్షాల ద్వారా దేవుడు ఇక్కడి ప్రజల్ని రక్షించాడని, రెండు సార్లు భారీ వర్షం కురవడంతో ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని, కేసీఆర్‌ను రానీయకుండా చేసిన వరుణదేవుడిన్ని జనం సైతం కొనియాడుతున్నారని దాసోజు శ్రవణ్‌  చెప్పారు.  ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేశారని, అందుకే కేసీఆర్‌ను హుజూర్‌నగర్‌ రాకుండా కుండపోత వర్షం ద్వారా దేవుడు మోకాలడ్డాడని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ పట్టనట్లుగా కేసీఆర్‌ పాలన సాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్‌ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని ఆయన విమర్శించారు. పని చేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఆరీస్టీ ఉద్యోగులను దసరా పండుగ సమయంలో ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికేపోదని వ్యాఖ్యానించారు. కే సీఆర్‌ పతనానికి  ఇదే నాంధి అని, కేసీఆర్‌ పతనం ప్రారంభం అయిందని, ప్రజలు అన్నీ మరిచిపోయి ఎప్పుడూ తమ వెంటే ఉంటారని భావించవద్దని హెచ్చరించారు. ప్రజల నుంచి గుణపాఠం కేసీఆర్‌కు ఉంటుదని శాపాలు పెట్టారు.

వినాశ కాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు వస్తాయని, అందే తెలుగులో ’వినాశకాలే విపరీతబుద్ధి..’ అనే  నానుడి ఉందని దాసోజు శ్రవణ్‌ గుర్తు చేశారు. ఇది అక్షరాలా కేసీఆర్‌కు వర్తిస్తుందని, ఇంతకాలం ప్రజలకు తప్పుడు హామీలిచ్చి మోసం చేశారని, ఎంతకాలమో జనాన్ని మోసం చేయలేరని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయని, ప్రజల నుంచి గట్టి గుణపాఠం తప్పుదని ఆయన హెచ్చరించారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఒకవేళ టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదారెడ్డి కనుక విజయం సాధిస్తే.. దుర్యోదన సభలో కౌరవుడు అవుతారని దాసోజు శ్రవణ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ మంత్రులకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకునే అవకాశం లేదంటే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. ఈనేపథ్యంలో సైదారెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందితే నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న పద్మావతి రెడ్డిని గెలుపొందిస్తే ప్రజల వాణిని అసెంబ్లీలో గట్టిగా వినిపించేందుకు ఆస్కారం ఉంటుందని, ప్రజా సమస్యల్ని ఎత్తి చూపేందుకు ఆస్కారం ఇచ్చేలా ఆమెను గెలిపించాలని కోరారు.

ఎలాగైనా టీఆర్ఎస్‌ గెలుపొందాలని నానా తంటాలు పడుతోందని, పడరాని పాట్లు పడుతోందని, అడ్డదారులు తొక్కుతోందని శ్రవణ్‌ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బుల్ని పారిస్తోందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ నుంచి గతంలో గెలిచిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన పనులను మరిచిపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రులు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, బడులు వంటివి ఉత్తమ్‌ హయాంలోనే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. అభివృద్ధి చేయని టీఆర్ఎస్‌కు ఓట్లు వేయవద్దని, మంత్రులకే సీఎం అందుబాటులో లేనప్పుడు టీఆర్ఎస్‌ గెలిచి ప్రజలకు ఏం చేస్తారని, కాంగ్రెస్‌ చేసిన పనుల్ని గుర్తుంచుకుని అన్నింటినీ బేరీజు వేసి ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలకు చివరి మూడు రోజుల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుఓవాలని, దీనిపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా నిఘా పెట్టాలని దాసోజు శ్రవణ్‌ విజ్ఞప్తి చేశారు.  

Even nature has turned against KCR, says AICC Spokesperson Dr Sravan Dasoju


·         KCR is facing curse of all sections of society: Sravan

·         God saved people of Huzurnagar from hearing a habitual liar: AICC Spokesperson

·         Sravan slams KCR for not following HC directive on RTC strike



Hyderabad, October 17: All India Congress Committee (AICC) National Spokesperson Dr. Dasoju Sravan expressed happiness over the cancellation of TRS public meeting, which was to be addressed by Chief Minister K. Chandrashekhar Rao, in Huzurnagar today due to heavy rains.

Addressing a press conference in Huzurnagar, Sravan said even nature has turned against CM KCR and prevented him from boarding a helicopter to reach Huzurnagar. "While the rough weather in Hyderabad forced KCR to abort helicopter ride, for the first time during the campaign, it rained heavy at the public meeting venue leading to its cancellation. This was nothing short of a God's miracle. The Almighty wanted to prevent people of Huzurnagar from listening the speech of a habitual liar. These are clear signs that even God and his nature were against KCR and TRS Government," he said.



Sravan said if there was a public meeting, then KCR would have spoken a bundle of lies consisting of false claims and hollow promises. Therefore, God saved the people by sending heavy rains both in Hyderabad and Huzurnagar, he said. "KCR is facing the curse of RTC employees, jobless youth and other sections of the society whom he betrayed. He did not show any sympathy or concern towards anyone and did utter injustice with everyone in a brutal and dictatorial manner. Therefore, God prevented his entry into Huzurnagar to save the people from further manipulation," he said adding that the way nature rejected KCR, TRS would face similar rejection by people on October 21 when they would vote in favour of Congress candidate Uttam Padmavathi.

The AICC Spokesperson strongly condemned the Chief Minister for not obeying the orders of High Court on RTC strike. He said KCR has reportedly refused to initiate talks with the RTC employees or process their September salaries on the grounds that High Court had not given any written orders. Accusing the Chief Minister of contempt of court, he said KCR must scale down his arrogance. Else, he said his downfall would come earlier than expected. He slammed KCR for stopping the salaries of RTC employees and said that the Chief Minister was not making the payment from his personal pocket. He said it was people's money which must be paid to public servants for their service.

Sravan said KCR's actions fit into the famous saying "Vinaasha Kaale Vipareetha Buddhi" (When faced with disaster, minds often become abnormal). For the same reason, he said KCR was taking all wrong decisions and turning everyone into his enemy.

He said that the victory of Congress party in Huzurnagar bye-elections was essential and in the interest of people of Telangana. "If TRS candidate Saidi Reddy wins, he will be just another 'Kaurava' and one among many slaves of KCR. In TRS party, even ministers have no access to the Chief Minister and MLAs have no authority to raise their voice. Therefore, Saidi Reddy's victory will not benefit the people of Huzurnagar in any way. Contrary to this, if Congress candidate Padmavathi Reddy wins, then the opposition will get stronger and she would raise people's issues in the Assembly and outside," he said.

Sravan also condemned use of money and liquor by TRS party to lure Huzurnagar voters. He said TPCC President Uttam Kumar Reddy brought huge development in Huzurnagar by way of constructing roads, schools, hospitals, lift irrigation schemes, degree college and other infrastructure. However, he said TRS leaders want to stop this development process by bribing the voters. He demanded that the election authorities keep a strict vigil on the distribution of money and liquor in the constituency in the next three days. (eom)

Saturday, 14 September 2019

డెంగీ మరణాలకు బాధ్యులుగా కేసీఆర్, ఈటెలను చేసి కేసులు నమోదు చేయాలి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌


Ø ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి
Ø రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన తెలంగాణ కాంగ్రెస్‌
Ø డెంగీ మరణాలకు బాధ్యులుగా కేసీఆర్, ఈటెలను చేసి కేసులు నమోదు చేయాలి :
ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌
Ø  వైద్య, ఆరోగ్య శాఖను టీఆర్ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందని మండిపాటు


హైదరాబాద్, సెప్టెంబర్‌ 14 :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనం రోగాలతో నానా కష్టాలు పడుతున్నారని, తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి వద్ద శనివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్ధేశించి శ్రవణ్‌ ప్రసంగించారు. డెంగూ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ 1.82 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టి అందులో వైద్య,ఆరోగ్య శాఖకు కేవలం రూ.5536 కోట్లు మాత్రమే కేటాయించారని, మొత్తం బడ్జెట్‌లో ఇది కేవలం మూడు శాతమేనని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సగటున వైద్య, ఆరోగ్య శాఖకు 4.8 శాతం చొప్పున బడ్జెట్‌ కేటాయించాయని, టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కమీషన్లు పొందేందుకే కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించారని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.
తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు వల్ల కేవలం కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, ఆర్జన చేశారని, తెలంగాణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు చెందిన ఒక కుక్కకు ఆనారోగ్యం చేస్తే వైద్యం చేసిన తర్వాత చనిపోయిందంటూ బంజారాహిల్స్‌ పోలీసులు పశువైద్యుడిపై కేసు పెట్టినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తను దాసోజు శ్రవణ్‌ ఉటంకించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో డెంగీ కారణంగా ఒకేరోజు ఆరుగురు పిల్లలు మరణిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యులుగా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లను చేసి వాళ్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి నెలకొని ఉందంటే గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా జఠిలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 20 రోజులకు ఒక్కసారి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యాన్ని హెలికాఫ్టర్‌ ద్వారా సేవలు అందిస్తామని గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ గాలి మాటగానే మిగిలిందన్నారు.
టీఆర్ఎస్‌ పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకలు, మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని దాసోజు శ్రవణ్‌ నిలదీశారు. అయిదున్నర ఏండ్లు గడిచినా ఆ హామీకి దిక్కు లేదని దుమ్మెత్తిపోశారు. గతంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని వెయ్యి పడకల స్థాయికి తీసుకువచ్చారని, ఇప్పటి టీఆర్ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఎంజీఎం ఆస్పత్రిని ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తగిన నిధులు ఇవ్వకుండా ఆస్పత్రికే అనారోగ్యం వచ్చిందనేలా చేశారన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్లు పనిచేయక గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క రోజులో 21 మంది రోగులు చనిపోయారని, ఇలాంటి ఘటనల తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణవిషయమన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్లాన్‌ చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించి దాని నిర్మాణ వ్యయ్యం 80 వేల కోట్ల రూపాయలకు పెంచి 18 లక్షల ఎకరాల్ని సాగు లక్ష్యంగా చేసి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేస్తోందని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రీడిజైన్‌ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ చర్యల్ని ఆయన తీవ్రంంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పాలన మొత్తంలో రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అయిదున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన గణాంకాల్ని వివరించారు. కేవలం 60 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేశారని డాక్టర్‌ శ్రవణ్‌ నిప్పులు చెరిగారు.
డెంగీ కేసుల నమోదు వివరాల్ని అందించేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగూ కేసుల సంఖ్య ఎంతో పత్రికల వారికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రుల్లోని డెంగీ కేసుల వివరాల్ని మీడియాకు చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడినట్లుగా తెలిసిందన్నారు. వైద్య, ఆరోగ్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శలు గుప్పించారు.

Congress demands health emergency in Telangana : AICC Spokesperson Dr Sravan Dasoju

Congress demands health emergency in Telangana

·         Cases must be booked against CM KCR, Etala for Dengue deaths: Sravan
·         AICC Spokesperson accuses TRS Govt of suppressing info on Dengue
·         Sravan slams TRS Govt for neglecting Health Sector


Hyderabad, September 14: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan demanded that the State Government declare Health Emergency in Telangana to take immediate measures to control spread of viral diseases.

He was addressing the hunger strike camp organised by Congress party at MGM Hospital in Warangal on Saturday. He alleged that the State Government has failed to react promptly on the spread of Dengue, Malaria, Cholera and other viral diseases despite many deaths being reported from across the State. He accused the TRS Government of completely neglecting the Health Sector. He pointed out that of Rs. 1.82 lakh crore Vote on Account budget for 2019-20 only Rs. 5,536 crore were earmarked for Health Sector which was about 3% of the total expenditure. He said other States, on an average, were spending about 4.8% of budget on public health. He said huge budget was allocated for Kaleshwaram Project and other irrigation schemes as Chief Minister K. Chandrashekhar Rao was allegedly getting commission from contractors.

Sravan said that the benefits of separate Telangana State were being enjoyed only by KCR and his family while the creation of new State did not change the lives of common people. Referring to a news item, he said a criminal complaint was lodged with the Banjara Hills against the veterinary doctor after a dog of Pragathi Bhavan, whom he was treating, died. However, he said no action was taken when six children died of Dengue in a single day in Gandhi Hospital. He asked whether or not criminal cases for negligence should be booked against CM KCR and Health Minister Etala Rajender. He said KCR was keen on constructing new buildings for Secretariat and Assembly. But he was not interested in improving the facilities in government hospitals. He said the Tribal and Agency areas of Telangana were not having any medical facilities and they get the access once in 20 days. He reminded that the Chief Minister had promised to provide Air Ambulance by deploying helicopters in the Tribal areas.

The Congress leader reminded that the TRS party, in its election manifesto for 2014 elections, had promised to construct a 1,000-bed hospital in every district headquarters and a 100-bed hospital in each mandal. Even after more than five-and-a-half years, this promise remained unfulfilled, he said. He also pointed out that the previous Dr. Y.S. Rajashekhara Reddy Government had upgraded MGM Hospital in Warangal to 1,000-bed. However, he said the present TRS Government has completed neglected the hospital and deprived it of required funds. He said Osmania General Hospital, Gandhi Hospital and Niloufer Hospital in Hyderabad lack proper facilities and infrastructure. He said 21 people died in a single day in Gandhi Hospital when ventilators went off due to power cut as there no back up.



Sravan said that the previous Congress Government had planned Pranahita Chevella Project to irrigate 16 lakh acres of land at an estimated cost of Rs. 35,000 crore. However, KCR escalated the cost in the name of re-designing and the State Government would be spending Rs. 80,000 crore to cultivate 18 lakh acres of land. He condemned the Chief Minister for wasting public money in the name of re-designing. The Congress leader said that Telangana had inherited a debt of only Rs. 60,000 crore in 60 years. However, CM KCR had pushed Telangana into a debt trap of over Rs. 2.50 lakh crore in 60 months.

He strongly condemned the State Government for trying to suppress information on rising number of Dengue cases by asking private hospitals not to reveal details to media. Similarly, the government hospitals have been directed not to disclose statistics pertaining to Dengue cases to media. He said instead of curbing information, TRS Government must focus on curbing the diseases which have played havoc in the lives of common people. (Ends)