Friday 3 April 2020

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ :ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్, అంబేద్కర్ నగర్ బస్తి లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్డండా వెంకటేష్, కాటూరి రమేష్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్డులను  ఉచితంగా 500 మందికి పైగాను పంపిణీ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు పాల్గొనడం జరిగింది .



ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు సూచించారు, అలాగే కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన జాగ్రత్తలు ముఖానికి మాస్కులు ధరిస్తూ, చేతులను సబ్బుతో 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లను వాడాలని మరియు గుంపులుగా, సమూహాలుగా తిరగరాదని, సామాజిక దూరం లాంటి సూచనలను ప్రజలందరూ తప్పకుండా పాటించాలంటూ మాట్లాడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు పాటుగా  ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు మరియు యూత్ లీడర్ అరుణ్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, తదితరులు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ జరిగింది.