Tuesday 28 May 2019

నల్సార్‌ వర్సిటీలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి, జాతీయ బీసీ కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్‌ : జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

నల్సార్‌ వర్సిటీలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జాతీయ బీసీ కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు 

హైదరాబాద్మే 28 :హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో చట్ట ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించేలా తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. నల్సార్‌ విశ్వవిద్యాలయంలోని సీట్లలో స్థానిక విద్యార్థులకు 85శాతం సీట్లు కేటాయించాలనే చట్ట నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా వెనుకబడిన విద్యార్థులకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 29 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా తీరని అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ భవవాన్‌లాల్‌ షైనాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ న్యూదిల్లీలో మంగళవారం స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలని చట్టం చెబుతోందనితెలంగాణ చట్టం ప్రకారం బీసీలకు 29 శాతం సీట్లును రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 6 తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాసిన లేఖలోని వివరాల్ని కూడా ఆయన ఫిర్యాదుతో జత చేశారు. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన జాతీయ బీసీ కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 
హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానికులకు చట్టబద్ధంగా 85 శాతం సీట్లు ఇవ్వడానికి బదులు కేవలం 20 శాతమే ఇవ్వడం దారుణం. తెలంగాణ చట్ట నిబంధన ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి 29 శాతం సీట్లను ఇవ్వాలన్న నిబంధన అమలు కావడం లేదు. చట్ట ప్రకారం నల్సార్‌ వర్సిటీలో బీసీ/ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.. అని మే 6న సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత రోజునే నల్సార్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటన ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని సమర్ధించుకుంది.. అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ జాతీయ బీసీ కమిషన్‌కు అందజేసిన ఫిర్యాదులో వివరించారు. బీసీఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా న్యాయ విద్యలో అడ్మిషన్లు నిర్వహించే హక్కు నల్సార్‌ విశ్వవిద్యాలయానికి లేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన చట్టం అమలు జరగాలనిదానిని ఎవ్వరూ ఉల్లంఘించి తమ ఇష్టానుసారంగా చేసే అధికారం లేదని నల్సార్‌ను ఉద్ధేశించి ఆయన అన్నారు.
నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ యాక్ట్‌ –1998 ప్రకారం ఏర్పడిన నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో చట్ట ప్రకారం స్థానిక విద్యార్థులకుబీసీలకు చట్ట ప్రకారం సీట్ల కేటాయింపులు చేయకుండా తీరని అన్యాయం చేస్తోందనిదీనిని అడ్డుకోవాలని కోరారు. ఇండియన్‌ బార్‌ కౌన్సిల్‌ నిబంధనలకు అనుగుణంగా అప్పటి ఏపీ బార్‌ అసోసియేషన్‌ రూల్స్‌కు లోబడే ఏర్పడిన నల్సార్‌లో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అయిదేళ్ల బీఏ ఎల్ఎల్‌బీఎల్ఎల్ఎంసీహెచ్‌డిఎంబీఏ కోర్సుల్లో స్థానికులకు చెందాల్సిన చట్ట బద్ధ వాటా సీట్లు ఓబీసీలకు రావడం లేదన్నారు. దీనిపై అనేక సంస్థలు తప్పుపట్టినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనంగానే ఉండిపోతోందని విమర్శించారు. స్థానికులకు న్యాయం జరిగేలా అడ్మిషన్లు జరపాలన్న చట్ట నిబంధనల్ని నల్సార్‌ యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోందని,  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాల్ని తుంగలోకి తొక్కిందని తప్పుపట్టారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఏ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు జరిగే ఆయా రాష్ట్రాల చట్టాలను అమలు చేయాల్సివుందనిఅయితే హైదరాబాద్‌లోని నల్సార్‌ మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ స్థానిక తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. యుజిసి–2006 ప్రకారం గ్రాంట్లు తీసుకునే విద్యాసంస్థలుడీమ్డ్‌ వర్సిటీలు,కాలేజీలు విధిగా ఆయా రాష్ట్రాల చట్టాలను అమలు చేయాలని తేల్చి చెబుతున్నా నల్సార్‌ మాత్రం వాటిని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర చట్ట నిబంధనల ప్రకారం తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోని 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించాలనిమొత్తం సీట్లలో 29 శాతం బీసీలకు చెందాలనే రూల్స్‌ను నల్సార్‌ అమలు చేయకుండా తీరని అన్యాయం చేస్తోందన్నారు. 


రాజ్యాంగంలోని 371–డి అధికరణందాని తర్వాత వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 5లో (రిజర్వేషన్స్‌ ఇన్‌ నాన్‌ స్టేట్‌వైడ్‌ యూనివర్సిటీస్‌ అండ్‌ ఎడ్కుషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌) ఏయూఓయూఎస్వీ యూనివర్సిటీలు (రాష్ట్ర స్థాయి వర్సిటీలు కాని వాటిల్లో) రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిల్లోని అన్ని కోర్సుల్లో 85 శాతం సీట్లు స్థానికులు చెందుతాయన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం చూసినా కూడా నల్సార్‌ వర్సిటీలో కూడా 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందుతాయన్నారు. 


విశాఖపట్టణంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా విశ్వవిద్యాలయాన్ని (డీఎస్ఎన్ఎల్‌యూ) 2008లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,నల్సార్‌ తరహాలోనే దీనిని ఏర్పాటు చేశారనివిశాఖలోని డీఎస్ఎన్ఎల్‌యూ వర్సిటీలో స్థానికులకుబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంటే నల్సార్‌లో ఎందుకు అమలు చేయలేకపోందో తేల్చాలని ఆయన జాతీయ బీసీ కమిషన్‌ను కోరారుు. ఒకే చట్టం కిందఒకే తరహాలో ఏర్పడిన రెండు వేరువేరు వర్సిటీల్లో ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయాలనే నిబంధన నల్సార్‌ మాత్రమే ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన (2014) చట్ట ప్రకారంరాజ్యాంగంలోని371–డి అధికరణ ప్రకారం అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఒకే విధమైన చట్టం అమలు జరపాలనిఅయితే నల్సార్‌ వర్సిటీలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కమిషన్‌ దృష్టికి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీసుకొచ్చారు. 


హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంవిశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలు రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయి. ఈ రెండు చోట్లా ఒకే విధంగా రాష్ట్ర చట్టాలనురాష్ట్రపతి ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందే.. అని ఆయన అన్నారు. 
ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్‌ నెం 3 (2014 ఆగస్టు 14), జీవో ఎంఎస్‌ ¯ð ం 16 (2015 మార్చి 11) జారీ చేసిన వాటి ప్రకారంఏపీ బీసీ కమిషన్‌ సభ్య కార్యదర్శి సమాచారం ప్రకారం బీసీలు/ఓబీసీలు 112 కులాలున్నాయి. ఈ కులాలకు చట్ట ప్రకారం 29 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. దేశంలోని అనేక న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఆయా రాష్ట్రాల చట్టాల ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్‌ లా వర్సిటీలో మాత్రమే అమలు చేయడం లేదు.. అని దాసోజు శ్రవణ్‌ జాతీయ బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 
రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోలు 3 (2014 ఆగస్టు 14), 16 (2015 మార్చి 11)ల ప్రకారం నల్సార్‌లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అయితే2010లో యూనివర్సిటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 5లో సవరణలు తీసుకొచ్చారనిదీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని (ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది) ఎస్సీఎస్టీమహిళలుదివ్యాంగులకు ఇచ్చే రిజర్వేషన్లు 20 శాతం మించడానికి వీల్లేదన్నారు. ఈ సవరణతో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అయిందన్నారు. బీసీలకు 29 శాతం సీట్లు ఇవ్వాలనే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ జాతీయ బీసీ కమిషన్‌ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
వెంటనే జాతీయ బీసీ కమిషన్‌ స్పందించి నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో చట్టాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బీసీలకు చట్ట ప్రకారం 29 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా నల్సార్‌ వర్సిటీకి ఆదేశాలివ్వాలని కోరారు. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (సిఎల్ఎటి) ఈ నెల 26న జరిగిందనిదీని ఫలితాలు జూన్‌ మొదటి వారంలో వెలువడే అవకాశాలున్నాయనిఈ పరీక్షలకు 60 వేల మంది హాజరైతే అందులో 60 శాతం మంది ఓబీసీలు ఉన్నారనివీరందరికీ న్యాయం జరగాలంటే నల్సార్‌ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్నినల్సార్‌ వర్సిటీని ఆదేశించాలని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కోరారు.  
నేషనల్‌ బీసీ కమిషన్‌ స్పందించి నల్సార్‌ యూనివర్సిటీకి తగిన ఆదేశాలు జారీ చేస్తుందనితెలంగాణలోని ఓబీసీలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన న్యాయ విద్య అందేలా చేస్తుందనే ఆశాభావాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment