Thursday 3 January 2019

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలియదంటున్న మోడీ మాటలపై....2019 లోఅతి పెద్ద జోక్ అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు

నరేంద్ర మోడీ  ప్రభుత్వం... "ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదు...అంబాని,అదాని ప్రభుత్వమని" ఎద్దేవా చేసిన డాక్టర్ శ్రవణ దాసోజు.
రాఫెల్ కుంభకోణంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటులో సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణ.
రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు జెపిసి వేయాల్సిందేనని డిమాండ్.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలియదంటున్న మోడీ మాటలపై....2019 లోఅతి పెద్ద జోక్ అన్న డాక్టర్ శ్రవణ్..
తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమి పాలయిందన్నమోడీ... రాష్ట్రంలో బిజెపీ మట్టి కొట్టుకు పోయిందన్న సోయి తెచ్చుకోవాలని హితవు.  
తెలంగాణాలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధులను మోసగించిన మోడీ, అమిత్ షాలు.. పులి తన పిల్లలను తానే తిన్న చందంగా ప్రవర్తించారని విమర్శ.
రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణ ను ఓర్చుకోలేకే మోడీ, కేసీఆర్ లు కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపారు.... దాసోజు శ్రవణ్





దేశవ్యాప్తంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట తిరుగుతున్నా తనకు తెలియదంటూ మోడీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం దేశ ప్రజలందరిని మోసగించడమేనని  ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్ లో  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మోడీ, కేసీఆర్ లు లోపాయి కారి ఒప్పందాలతో దేశ ప్రజలందరిని మోసగిస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా  రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక  యూపీఏ అనుకూల పార్టీలను తమ వైపు కు తిప్పుకునేందుకు వారిలో అయోమయం సృష్టించేందుకు మోడీ, కేసీఆర్లు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమి పాలయిందన్న మోడీ కి తన స్వంత పార్టీ  మట్టిగోట్టుకు పోయిందన్న సోయి లేక పోవడం దారుణమన్నారు. కేసీఆర్ తో కలిసి క్షుద్ర రాజకీయాలకు తెరలేపిన మోడీ తన స్వంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు డిపాజిట్ లు రాకుండా కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. మోడీ అమిత్ షాలు స్వంత పార్టీ ని ఓడించడాన్ని పులి తన పిల్లలను తానే తిన్నట్లు గా ఉందని అభివర్ణించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి తెలియదంటున్న మోడీ..2019లోఅతి పెద్ద జోక్ గా అభివర్ణించిన డాక్టర్ శ్రవణ్..
2019 లో ప్రధాని మోడీ దేశానికి ఒక విజన్ చూపబోతున్నాడని పెద్దయెత్తున మీడియాలో ఊదరగొట్టి కొండంత రాగం తీసి పనికిమాలిన పాట పాడినట్లుగా మోడీ ఇంటర్వూలో పాత అంశాలనే ప్రస్తావించారని డాక్టర్ శ్రవణ్ ఎద్దేవా చేశారు. 90 నిమిషాల ఇంటర్వూలో ప్రజలను మభ్యపెట్టడం మినహా మరేమీ లేదన్నారు. తెలంగాణాకు సంబంధించిన అంశంలో  కేసీఆర్ ఏర్పాటు చేసిన కూటమి  తనకు తెలియదనడం 2019 లో అతి పెద్ద జోక్ గా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ పర్యటించిన కేసీఆర్  కాంగ్రెస్, బీజెపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని  హడావుడి చేస్తూ..మోడీని సన్నాసి అని తిడుతూ తిరుగుతుంటే తనకు తెలియదని చెప్పడం ఎవరి చెవిలో పువ్వులు పెట్టడం కోసమని ప్రశ్నించారు.  మోడీ కేసీఆర్ లు ఇద్దరు కలిసి కుమ్ముక్కయి కాంగ్రెస్ పార్టీ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను తగ్గించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అనుకూల పార్టీలను యూపిఏ నుంచి దూరం చేయడాని కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను తిడుతున్నా తెలియదనడం, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోడం నవ్విపోదురుకాక నాకేటి సిగ్గు అన్నట్టుందన్నారు. 
రాష్ట్రంలో ప్రజాకూటమి ఓటమి పాలయిందంటున్నమోడీ... బిజెపీ మట్టి కొట్టుకు పోయిందన్న విషయాన్ని గమనించుకోవాలని హితవు.
తెలంగాణాలో ప్రజాకూటమి ఓడిపోయిందని మోడీ మాట్లాడడం చూస్తుంటే జాలేస్తుందన్నారు డాక్టర్ శ్రవణ్ ఓ వైపు తన స్వంత పార్టీ  బిజెపి పుర్తిగా మట్టికొట్టుకు పోయినా  కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ జట్టుకట్టిన కూటమి ఓడిపోయిందని మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు.  చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా గోషామహాల్ లో  ఎమ్మైఎం తో  కుమ్ముక్కై పోరాడితే రాజాసింగ్ ఒక్కడే బయట పడ్డాడని ఉన్న ఆరు సీట్లు పోయి  పోటీ చేసిన 105  స్ధానాల్లో డిపాజిట్ గల్లంతయ్యిందని ఎద్దేవా చేశారు.   అది మరిచి పోయి ప్రజాకూటమి ఓటమి పాలయ్యిందని సంకలు గుద్దుకోవడం హాస్యాస్పదం కాదా అని ప్రశ్నించారు. 2014 లో కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు ఉండేవని 2018లో  కేవలం 3 సీట్లు మాత్రమే కోల్పోయామన్నారు.
తెలంగాణాలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధులను మోసగించిన మోడీ, అమిత్ షాలు.. పులి తన పిల్లలను తానే తిన్న చందంగా ప్రవర్తించారని ఎద్దేవా..
పులి తన  పిల్లలను తానే తిన్నట్లు తన స్వంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులను బలి ఇచ్చిన దౌర్భాగ్యపు చరిత్ర మోడీ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు  కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు కేసీఆర్ తో లోపాయి కారి ఒప్పందానికి తెగబడ్డారని ఆరోపించారు.  మోడీ క్షుద్ర రాజకీయాలకు బిజెపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్  లాంటి వారికి కూడా  డిపాజిట్ లు రాకుండా అవమానించారన్నారు.  
రాఫెల్ కుంభకోణంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటులో సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణ.
గోవా హెల్త్ మినిష్టర్ ఆడియో టేపుల్లో రాఫెల్ కుంభకోణం పై పార్లమెంట్ లో చర్చకు వస్తే తప్పించుకునేందుకు మోడీ  ప్రయత్నిస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. 40 వేల కోట్లు కుంభకోణం జరిగినా మోడీ తన తప్పేం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, రూ.526 కోట్ల రూపాయలకు ఒక  విమానం కొనుగోలు చేయాల్సి ఉండగా రూ. 1650 కోట్ల తో ఒక్క విమానాన్ని ఏ ప్రాతిపదిక న కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో ఎయిర్ ఫోర్సో అధారిటి ప్రోసీజర్స్ ఎందుకు పాటించలేదో స్పష్టం చేయాలన్నారు. ఏ రకమైన అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి ఎలా ఇంత పెద్ద కాంట్రాక్ట్ అప్పగించారన్నారు. ఒక చిన్న ఇల్లు కట్టాలంటే అనుభవం ఉన్న మేస్త్రీని మాట్లాడుకుంటామని, కాని ఏ అనుభవం లేని అనిల్ అంబాని కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దేశరక్షణకు సంబంధించిన వేల కోట్ల రూపాయల  విలువైన ఎయిర్ క్రాఫ్ట్ లు  కొనుగోలు విషయంలోఅనిల్ అంబాని కి సంబందించిన  కంపెనీకి ఎలా కట్టబెట్టారని  పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాదానం చెప్పకుండా మోడి పారిపోయారన్నారు. అనుభవంలేని అంబాని కంపెనీకి యుద్దవిమానాలు తయారుచేసే కాంట్రాక్ట్ అప్పగించడం వల్ల దేశ భద్రత కు నష్టం వాటిల్లిందని, అలాగే వేలాది కోట్ల రూపాయల దేశ సంపద ను అడ్డగోలుగా దోచిపెట్టడం వల్ల జాతి సంపద కూడా ప్రమాదంలోకి నెట్టబడిందని డాక్టర్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ  ప్రభుత్వం... "ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదు...అంబాని,అదాని ప్రభుత్వం".. డాక్టర్ శ్రవణ దాసోజు.
రాఫెల్ కుంభకోణం అంశంలో పార్లమెంటులో చర్చ జరుగుతుంటే దానిపై స్పందించకుండా సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో  ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గా  కాంగ్రెస్ నేతల మీద కేసులున్నాయని, బెయిల్ పై ఉన్నారని అసందర్భంగా  మోడీ మాట్లాడుతున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నారని ఇంత పెద్ద అభియోగం వస్తే ఎంక్వైరీ చేయకుండా.., జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ ఏర్పాటు వ్యతిరేకించడాన్ని యావత్ భారత దేశం గమనిస్తోందన్నారు. నరేంద్ర మోడీ  ప్రభుత్వం ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదని అంబాని,అదాని ప్రభుత్వమన్నారు.
రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు జెపిసి వేయాల్సిందేనని డిమాండ్.
నరేంద్ర మోడీ కి ఏమాత్రం విలువలున్నా రాహుల్ గాంధీ కోరినట్లు జెపీసీ వేయాలని డిమాండ్ చేశారు. రాఫెల్ అంశంలో దొంగతనం బయట పడుతుందని  భయపడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక విలువల పట్ల  ఏమాత్రం గౌరవమున్నా వెంటనే జెపీసీ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ భద్రత అంశాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్న మోడీ దేశ భద్రతకు సంబంధించిన రాఫెల్ డీల్ లు ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానికి ఎలా ఇచ్చారన్నారు.  పార్లమెంట్ లో రాఫెల్ అంశంపై పెద్ద యెత్తున దుమారం రేగుతున్నా మోడీ పట్టించుకోకుండా ఎక్కడో పంజాబ్ లో ఉన్న లవ్లీ యూనివర్శిటీలో తన ప్రసంగాలను చేస్తున్నారని నరేంద్ర మోడీకి గుణపాఠం  చెప్పాలంటే ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ శ్రవణ్ తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి లు సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ తన పని తనాన్ని గుర్తించి ఏఐసీసీ లో అవకాశం కల్పించిందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి,ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ రణదీప్ సింగ్ సుర్జీవాల గారికిటీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికిఇంచార్జ్ ఆర్సీ కుంతియా గారికి ,మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ గారికినాయకులు కొప్పుల రాజు గారికిఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

No comments:

Post a Comment