Sunday 16 December 2018

హైకోర్ట్ తీర్పు ఆధారంగా బిసి కులాల వెనుకబాటు తనాన్ని, సామాజిక ఆర్ధిక స్ధితిగతులను అధ్యయనం చేస్తూ కుల గణన చేపట్టాలి... డాక్టర్ శ్రవణ్ దాసోజు

సమగ్ర కులగణన చేసి బీసిలకు ఎ,బి,సి,డి ఈ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్.
22 లక్షల ఓట్ల తొలగించి సారి చెప్పిన ఎన్నికల సంఘం జాబితా ఆధారంగా కులగణన చేపడితే సహించబోమన్న శ్రవణ్.
హైకోర్ట్ తీర్పును బేఖాతర్ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా బిసి గణన చేపడితే ఆందోళన తప్పదని హెచ్చరిక..
ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రవణ్,
బీసి కులగణన ను సక్రమంగా చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ.

2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 52 శాతం మంది బిసి లు ఉన్నట్లు గా లెక్కలు తేల్చిన ప్రభుత్వం. మేమెంతో మాకంతే అన్నట్టుగా బిసి ఉపకులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని సామాజిక ఆర్ధిక  అధ్యయనం ద్వారా నే సమగ్ర కులగణన చేపట్టాలని, ఉమ్మడి హైకోర్ట్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గాంధీ భవన్  మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,మరియు  పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ  లేఖలు రాశారు.  బిసిలకు చెందిన సబ్బండ కులాలకు స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లు కోరామని కాని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
సమగ్ర కులగణన కు ఆదేశించిన హైకోర్ట్ ఉన్నత ధర్మాసనం...బేఖాతర్ చేస్తున్న ప్రభుత్వం
బిసి ఉపకులాలు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కులాల వెనుకబాటు తనం ఆధారంగా కుల గణన చేపట్టాలని గతంలో ప్రభుత్వాన్ని కోరితే  ఏమాత్రం కూడా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిన తరుణంలో  రిట్ పిటీషన్ నెంబర్ 20477/ 2018  26.06.2018 నాడు  హైకోర్టును ఆశ్రయించామన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఇష్టాను సారంగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం  ఇష్టారాజ్యంగా సమగ్రమైనటువంటి సామాజిక ఆర్ధిక అధ్యయనం జరుగకుండా బీసిల యొక్క కులాల వెనుకబాటు తనం పై సరియైన అధ్యయనం చేయకుండా  ఒక సరియైన కుల గణన చేయకుండా వాళ్ల ఆక్ట్ లో ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు పొందు పరిచినారన్నారు. దీనిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై స్పందించిన ధర్మాసనం   గతంలో ఉన్న హైకోర్ట్ తీర్పుల ఆధారంగా సామాజిక ఆర్ధిక అధ్యయనంతో పాటు బీసి కులాల వెనుకబాటు తనం పై  అధ్యయనం జరుగాలని తద్వారా కులగణన చేపట్టాలని  శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని  మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన విషయాన్ని శ్రవణ్ గుర్తుచేశారు. ఇందుకు ఉదాహరణగా జస్టిస్ రామచంద్రారావుగారి నేతృత్వంలొని ధర్మాసనం గతంలో నిమ్మక జయరాజ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  కేసులో  ఇచ్చిన తీర్పునే ఆదర్శంగా తీసుకోవాలని  అందులో ఉదహరించిందని  కోర్టు ఉత్తర్వులను డాక్టర్ శ్రవణ్ మీడియాకు చూపించారు.
సామాజిక, ఆర్ధిక అధ్యయనం చేసి వెనుకబాటు తనం ఆధారంగా బీసిలకు రిజర్వేషన్లు కల్పించాలి.
హైకోర్ట్ తీర్పు నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం బిసి ఉపకులాల సామాజిక, ఆర్ధిక  అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. ఆయా కులాల వెనుకబాటు తనానికి కారణాలేంటో తెలుసుకోవాలన్నారు. ఆతర్వాతే తదనుగుణంగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.
హైకోర్ట్ తీర్పు ఆధారంగా ను బేఖాతర్ చేస్తున్న ప్రభుత్వం తూతూమంత్రంగా బిసి గణన చేపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేసిన శ్రవణ్.
హైకోర్ట్  స్పష్టంగా ఉత్వర్వులు ఇచ్చినప్పడికి ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం సామాజిక  స్థితిగతుల పై అధ్యయనం చేయడం లేదని శ్రవణ్ ఆందోళన  వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు గత జూన్ నెలలోనే ఇచ్చినప్పుడికి బీసీకులాల వెనుకబాటు తనానికి కారణాలు కనుక్కోకుండా ముందస్తు ఎన్నికల హడావుడిలో మునిగి పోయిందన్నారు.  ఇప్పడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసి ఉపకులాల గణన సక్రమంగా చేపట్టకుండా తూతూ మంత్రంగా చేపడుతున్నారని ఆరోపించారు.
22 లక్షల ఓట్ల తొలగించి సారి చెప్పిన ఎన్నికల సంఘం జాబితా ఆధారంగా కులగణన చేపడితే సహించబోమన్న శ్రవణ్.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 22 లక్షల ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిన ఎన్నికల కమీషన్ ఇచ్చిన జాబితా ఆధారంగా గ్రామాలకు వెళ్లి కులగణన చేపట్టడాన్ని డాక్టర్ శ్రవణ్ తప్పుపట్టారు. ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా ఉందని సాక్షాత్తూ ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ మీడియా సాక్షిగా సారీ చెప్పారని అలాంటి ఎన్నికల సంఘం ఇచ్చిన జాబితా ఆధారంగా కులగణన చేపడితే బీసి కులాలకు ఏమేరకు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గ్రామసభలు ఏర్పాటుచేయకుండా చెట్లమీద ఇస్తరాకులు కుట్టినట్టు కులగణన చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో ఎ,బి,సి,డి,ఈ   కేటగిరిల వారిగా ఎలాగయితే అమలు చేస్తున్నారో, అదే విధానాన్ని పంచాయతీ రాజ్  ఎన్నికల్లో కూడా బీసి ఉపకులాలు వారిగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సామాజిక అధ్యయనం జరగాలని కోర్టు వారిచ్చిన ఆదేశాలను గుర్తుచేశారు. గ్రామాల వారిగా ఏ కులానికి చెందిన వారు ఎందరున్నారు వారి సామాజిక ఆర్ధిక స్థితిగతుల పై సమగ్ర అధ్యయనం  కొత్తగా ఏర్పాటయని కేసీఆర్ ప్రభుత్వాన్ని డాక్టర్ శ్రవణ్ కోరారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రవణ్.
రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు డాక్టర్ శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. రెండో మారు ముఖ్యమంత్రిగా ఎన్నికయిన కేసీఆర్  బిసిలకు తగిన న్యాయం చేయాలని  తాను విడుదల చేసిన లేఖలో కోరారు.  అలాగే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కి కూడా ఆయన బీసిలకు న్యాయం చేయాలని సమగ్ర కుల గణన చేపట్టాలని లేఖ రాసారు. బిసిలకు గొర్లు బర్లు కాకుండా రాజకీయంగా సమన్యాయం జరిగేలా చూడాలని వారంతా ఎదిగేందుకు సహకరించాలని విజ్నప్తి చేశారు.



No comments:

Post a Comment