Friday 14 December 2018

ఓట్ల తొలగింపు మరియు ఎన్నికల అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమీషన్ కోసం పట్టుబట్టి వాస్తవాలను వెలికితీస్తామని వెల్లడి : డాక్టర్ శ్రవణ్ దాసోజు

  •    బ్రింగ్ బాక్ బాలెట్ పేపర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్న టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు
    • ఓట్ల తొలగింపు మరియు ఎన్నికల అవకతవకలపై  జాయింట్ పార్లమెంటరీ కమీషన్ కోసం పట్టుబట్టి వాస్తవాలను వెలికితీస్తామని వెల్లడ
    • ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేశారని ఆరోపణ.
    • న్యాయం కోసం త్వరలోనే హైకోర్ట్, సుప్రీంకోర్ట్ తలుపులు కూడా తడుతామని వెల్లడి.
    • కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అభ్యర్ధులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.,..డాక్టర్ శ్రవణ్
    • కౌంటింగ్ లో గోల్ మాల్ కు పాల్పడ్డ ఎన్నికల సంఘంపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేదిలేదని హెచ్చరిక.



    బ్రింగ్ బ్యాక్ బాలెట్ పేపర్ అనే నినాదంతో సుప్రీం కోర్ట్, హైకోర్ట్ తలుపులు తడుతామని పార్లమెంట్ లో జాయింట్ పార్లమెంటరీ కమీషన్ ఏర్పాటు కోసం పట్టుబడుతామని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు అన్నారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన గాంధీభవన్ లో దాదాపు రెండు గంటల పాటు టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్,పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, జెట్టి కుసుమ్ కుమార్ తదితర నాయకుల ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఓటమి పాలయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల తో  సమావేశం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీ  పాల్పడ్డ అవకతవకలను ప్రస్తావించామని అన్ని ఆధారాలను మీడియా లో సహ కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే  పెడుతామన్నారు. బాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరిపితే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని లేదంటే ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదన్నారు.
    ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేశారని ఆరోపణ
    పోలీసులు,రిటర్నింగ్ అధికారులు ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కయ్యారన్న దానిపై లోతుగా విశ్లేషించామన్నారు. దాదాపు 22 లక్షల ఓట్లను నిర్ధాక్షిణ్యంగా, కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగించడం పట్ల సమావేశంలో పాల్గొన్న నేతలు ఖండించారన్నారు. అదేవిధంగా పైకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా పట్టించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్  విడుదల చేయడం నుంచి పలు అనుమానాలకు తావిచ్చే లా  రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించదన్నారు. రజిత్ కుమార్ నుంచి మొదలు ఎన్నికల  సంఘం కార్యాలయంలో ఫనిచేస్తున్న అధికారులంతా టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో మెలగుతున్నారన్న స్పష్టమైన సమాచారం తమకుందన్నారు.  రిటైర్డ్ అధికారులు కూడా వారి చెప్పుచేతల్లో పనిచేస్తూ వ్యవస్ధను చిద్రం చేసారని  ఈ మొత్తం వ్యవహరం పై పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు.   ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులను శిక్షించేలా వత్తిడి తెస్తామన్నారు.
    కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అభ్యర్ధులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.,..డాక్టర్ శ్రవణ్
    పోటీ చేసిన అన్నినియోజకవర్గాలకు చెందిన  అభ్యర్ధులందరిని  కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కు తీసుకువెళ్లి వారికి వారు ఎదుర్కున్న సమస్యలను నివేదించనున్నామన్నారు.ఒక్కో అభ్యర్ధి తమ బాధను వ్యక్తం చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ మొదలు, పోలీసులు కూడా ఎన్నికల విధానాన్ని ఎలా ఖూనీ చేశారన్న విషయం పై కూలకషంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తామన్నారు. అలాగే లోక సభలో, రాజ్యసభలో చర్చకు దారితీసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వత్తిడి తెచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కోరుతామని వాస్తవాలను వెలికి తీసేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. అధికారుల గోల్ మాల్... పోలింగ్ శాతం తారుమారు
    ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం తమాషా చేసిందన్నారు. ఉదాహరణకు నర్సాపూర్ నియోజకవర్గంలో సునితా లక్ష్మారెడ్డి పోటీచేసిన  నియోజకవర్గంలో మధ్యాహ్నం 8.83  శాతం పోలింగ్ చూపిన అధికారులు సాయంత్రం 5 గంటలకు 70 శాతం పోలింగ్ అయినట్టు చూపారన్నారు.నిజానికి ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం నుంచి రెండు నిమిషాల సమయం పడుతుందని కాని ఇంత తక్కువ సమయంలో  అంత పెద్ద మొత్తం ఎలా సాధ్యమయిందని అనుమానం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు 70 శాతం పోలింగ్ నమోదయిందని చెప్పిన అధికారులు తెల్లవారు జామున 1గంటకు 88 శాతంగా, ఉదయం 5.30 గంటల సమయంలో 90 శాతం పోలింగ్ నమోదయ్యిందని చెప్పారన్నారు.  పోలింగ్ శాతాన్ని అనేక సార్లు మార్చి చెప్పిన అధికారులు  తీరు చూస్తుంటే  ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రుజువు చేస్తుందన్నారు.  రిటర్నింగ్ అధికారుల ఇచ్చిన కన్సాలిడేటెడ్ జాబితాకు, కౌంటింగ్ జాబితాలకు పొంతన లేని సమాచారం ఇచ్చారన్నారు.
    అలాగే మంచిర్యాల లో కూడా ఇదే తంతు జరిగిందన్నారు. నాలుగు గంటల వరకు 54.75 శాతం పోలింగ్ నమోదయిందని చెప్పిన అధికారులు  సాయంత్రం 5 గంటలకు 65 శాతంగా చెప్పారని తెల్లవారి అదే అధికారులు 73 శాతంగా డిక్లేర్ చేశారన్నారు. పోలింగ్ బూత్ లోకి పోలీసులకు అనుమతి ఉండదని కాని సాయంత్రం నాలుగు గంటల కు పోలీసులు బూత్ ల్లో చొరబడి బూ త్  ఏజెంట్ల  పై లాఠీచార్జి కి పాల్పడ్డారని. అన్యాయంగా ఏజెంట్లను బూత్ లనుంచి పోలీసులు వెళ్లగొట్టారని ఆరోపించారు. చాలా నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పోలీసులు, ఎన్నికల అధికారులతో అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
    బ్రింగ్ బాక్ బాలెట్ పేపర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్న టిపిసిసి
    ప్రజాస్వామ్యం బతికుండాలంటే  తప్పనిసరిగా ఈవిఎంల పనితీరును, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈవిఎంలలో ఉన్న మదర్ బోర్డ్ లను ఏవిధంగా మార్చారో  తెలుసుకున్నామని త్వరలోనే అవన్నీ బహిర్గత పరుచనున్నామన్నారు. ప్రజాస్వామ్యం బతికుండాలంటే పేపర్ బాలెట్ రావాల్సిన అవసరముందని అందుకే బ్రింగ్ బ్యాక్ బాలెట్ పేపర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఇప్పడు వచ్చిన తీర్పు కేవలం మిషన్ మాండేట్ మాత్రమేనని పీపుల్స్ మాండేట్ కాదని ఆయన అన్నారు. డాక్టర్ శ్రవణ్ వెంట టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నంప్రభాకర్, అద్దంకి దయాకర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

    No comments:

    Post a Comment