Sunday 9 December 2018

ఖైరతాబాద్ నియోజకవర్గంలో 238 బూత్ లలో ఈవిఎంలతోపాటు, వివీపాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చిన దాసోజు శ్రవణ్ కుమార్.



ఖైరతాబాద్ నియోజకవర్గంలో 238 బూత్ లలో ఈవిఎంలతోపాటు, వివీపాట్  స్లిప్పులను కూడా లెక్కించాలని రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చిన దాసోజు శ్రవణ్ కుమార్.
ముఖ్యమంత్రి అవకతవకలు, అవినీతి అధికారుల బండారం బయటపెట్టినందుకే తనను ఖైరతాబాద్ లొ ఓడించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపణ
లోపాలున్నఈవిఎం యంత్రాలు వాడడం వల్లే  ఓటింగ్  మూడు గంటల పాటు అలస్యం అయిందన్న శ్రవణ్.
వేలాదిగా ఓట్లు తొలగించిన అధికారులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్య.
ఈవిఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద జామర్లు వినియోగించాలని విజ్నప్తి.





ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనను  ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా, రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కుట్ర చేస్తున్నారని, వారి అవినీతి బండారాన్నిఎప్పటికప్పుడు బయటపెట్టడం వల్లే తనను టార్గెట్ చేశారని,ఆరోపిస్తూ  ఈవిఎం మిషన్ లతోపాటు వివి పాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని  ఇవాళ సాయంత్రం ఖైరతాబాద్ నియోజకవర్గ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చారు.  ఈ నెల ఏడోతేదీన జరిగిన ఎన్నికల్లో ఉదయం 7 గంటలకే మొదలవ్వాల్సిన  ఓటింగ్ ప్రక్రియ దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమయిందని, ఇందుకు ఈవిఎం యంత్రాల్లో లోపాలే కారణమన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 238 పోలింగ్ బూత్ లలతో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందన్నరు. దీన్ని బట్టే లోపాలున్న యంత్రాలు ఉపయోగించారని ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిఎంలో తలెత్తిన లోపాలు,
ప్రసారమాధ్యమాల్లో  వస్తున్న వార్తా కథనాలను బేరీజు వేసుకుంటే ఈవిఎం యంత్రాల్లో ఉంచిన బ్లూటూత్ టాంపరింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ఇదే జరిగితే ప్రజాస్వామ్య స్పూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆరోపించారు.
అన్యాయంగా పెద్ద యెత్తున ఓట్లు తొలగించారని ఆరోపించిన శ్రవణ్
చాలా పోలింగ్ కేంద్రాల్లో ఎంతో మంది  ఓట్లను ఎపిక్ కార్డులున్నా తొలగించారన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లను కావాలనే వేరే చోటకు మార్చి గందరగోళాలనికి తెరతీసారన్నారు. దీనివల్ల తనకు వచ్చే  ఓట్లు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమొత్తంలో ఓట్లు గల్లంతు అయ్యాయని సాక్షాత్తూ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రజత్ కుమార్ అంగీకరించి, క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి అవకతవకలు, అవినీతి అధికారుల బండారం బయటపెట్టినందుకే తనను ఖైరతాబాద్ లొ ఓడించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించిన దాసోజు శ్రవణ్ కుమార్.
గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా పెద్దయెత్తున జరిగిన అవినీతిని, అక్రమాలను బయటపెట్టి ముఖ్యమంత్రి తో సహ అధికారుల బండారాన్ని బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేశారని, ఎలాగైనా ఓడించాలని కక్ష పూరితంగా కుట్రకు తెరలేపారని శ్రవణ్ తన లేఖలో ఆరోపించారు. చాలా ఈవిఎంలు పనిచేయకపోవడం యాధృశ్చికంగా జరిగిన చర్య కాదని ఇది పకడ్బందీగా జరిగిన కుట్రగా భావిస్తున్నానన్నారు. లక్షల సంఖ్యలో ఓట్లను గల్లంతు చేసిన అధికారులపై తనకు నమ్మకం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఈవిఎం లలో  పెద్దయెత్తున లోపాలు బయట పడడం  ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఈతరహా విధానం వల్ల తన గెలుపు పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని  శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈసందర్భంగా వీవీప్యాట్ యంత్రాలను ప్రవేశ పెట్టడం ద్వారా వల్ల పారదర్శకత తో కూడిన ఎన్నికల నిర్వహణ కు వీలవుతుందన్న విషయాన్ని రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన లేఖలో శ్రవణ్ గుర్తుచేశారు.
ఆపద్దర్మ ముఖ్యమంత్రి శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల నిబంధలను తుంగలో తొక్కి  తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని ఆరోపించారు. అందువల్ల  తను పోటీ చేసిన ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 238 బూత్ లలో ఈవీఎం మిషన్ లతో పాటు వివీపాట్ బాక్సుల్లోని స్లిప్పులను కూడా లెక్కించాలని, కేవలం 2 లక్షల లోపే ఉన్న ఓటర్ల స్లిప్పులను లెక్కించేందుకు అయ్యే అదనపు ఖర్చును తాను భరించడానికి సిద్దంగా ఉన్నానని శ్రవణ్ తన లేఖలో రాసారు. ఓటర్ తాను వేసిన ఓటును ప్రింటెడ్ స్లిప్ ద్వారా సంతృప్తి చెంది ఉన్నందున వీవీపాట్ స్లిప్పులను లెక్కించడం వల్ల పూర్తి పారదర్శకత కు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా తేడా వచ్చినప్పుడు అలాంటిస్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమీషన్ నిర్ధేశించినందువల్ల అట్టి స్లిప్పులను కూడా లెక్కించి సరైన ఫలితాన్ని ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు.
ఈవిఎంల లో లోపాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓటింగ్ యంత్రాల పనితీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీవీపాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఎన్నికల్లో  పారదర్శకత కు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
అత్యాధునిక జామర్లను ఉపయోగించి ఈవిఎంలకు రక్షణ కల్పించాలని శ్రవణ్ డిమాండ్.
భారీఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశముందని వస్తున్న వార్తల నేపధ్యంలో ఈవిఎంలు హాకింగ్ కుగురయ్యే ప్రమాదముందని డాక్టర్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం ల చుట్టూ అత్యాధునిక జామర్ లను ఏర్పాటు చేయాలని  ఈవిఎంలు హాకింగ్ కు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించాలని, రాజ్యాంగం స్పూర్తిని కాపాడాలని  రిటర్నింగ్ అధికారిని కోరారు.

No comments:

Post a Comment