Sunday 28 October 2018

మీడియా కోఆర్డినేషన్ పాత్ర పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు తొమ్మిది గంటల పాటు వర్క్ షాప్

కాంపైన్ కమిటి కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ  వర్క్ షాప్
ముఖ్య అతిధిగా హాజరయిన ప్రచార కమిటీ ఛైర్మెన్ భట్టి విక్రమార్క, ప్రొఫెసర్ నాగేశ్వర్.
మీడియా కోఆర్డినేషన్ పాత్ర పై అధికార ప్రతినిధులతో తొమ్మిది గంటల పాటు సుధీర్ఘ చర్చ.
మాక్ డిస్కషన్ లో  పాల్గొన్నసీనియర్ జర్నలిస్టులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు.







టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆధ్వర్యంలో  మీడియా కోఆర్డినేషన్  సమావేశం , లక్డికాపూల్ లోని హోటల్ అశోకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీపిసిసి ప్రచారకమిటి ఛైర్మెన్ భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాల‌నునియంతృత్వ పోక‌డ‌ల‌ను ప్ర‌జ‌ల‌లో ఎండ‌గ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తెచ్చి ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అధికార ప్ర‌తినిధులు కృషి చేయాలని వారి పాత్ర చాల కీల‌క‌మైన‌ద‌న్నారు. అధికార ప్ర‌తినిధులు ఎంత బాగా ప‌నిచేస్తే పార్టీ అంత బ‌లంగా ఉంటుంద‌నిఅధికార ప‌క్షం చేసే అరాచ‌కాలునియంతృత్వ ధోర‌ణ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తోడ్పడాలన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ పై  సానుకూల స్పందన రావడంలో  మీడియా ప్రతినిధులు క్రియాశీలక పాత్ర వహించాలన్నారు. సుమారు తొమ్మిది గంటల పాటు సుధీర్ఘంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు విభాగాలు గా విభజించి ఒక్కో విభాగంలో ప్రముఖలతో శిక్షణా కార్యక్రమాలు, మాక్ డిబేట్ లు నిర్వహించారు.
అధికార ప్రతినిధులు..నిత్య విద్యార్దులుగా ఉండాలన్న ప్రొఫెసర్ నాగేశ్వర్
టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వర్క్ షాప్ లో ముఖ్యఅతిధి, మరియు వక్తగా హాజరయిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ  సీనియర్ పాత్రికేయులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ పొలిటికల్ కమ్యూనికేషన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా..పాత్ర..పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో స్పోక్స్ పర్సన్ ల యొక్క పాత్ర. వారికి ఉండాల్సిన నైపుణ్యాలు పై కూలంకషంగా వివరించారు.  అధికార ప్ర‌తినిధులు అన్నిఅంశాల‌లో స‌మ‌గ్రంగాలోతుగా అధ్య‌యనం చేసుకోవాల‌న్నారు. అధికార ప్ర‌తినిధుల అభిప్రాయాల‌నే పార్టీ విధానాలుగా భావించాల్సి ఉంటుంది కాబట్టి  మాట్లాడే ప్రతి విషయం చాల కీల‌కంగా వ్యవహరించాలని, ప్ర‌తి అంశంపై స‌మ‌గ్రంగా విశ్లేషించుకుని అభిప్రాయాల‌ను ప్ర‌క‌టించాల‌ని  కోరారు. అధికార ప్రతినిధులు వెలిబుచ్చే అంశాలు, ప్ర‌సంగాలువిశ్లేష‌ణ‌లుప్ర‌జ‌ల‌ను ఆలోలింప‌జేసే విధంగా ఉండాల‌నివారి అభిప్రాయాల‌కు ద‌గ్గ‌ర ఉండాల‌నిప్ర‌తి రోజు విద్యార్థిలా ప్ర‌తి విషయం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు.మ‌న భావాల‌ను వ్య‌క్తీక‌రించే స‌మ‌యంలో స్పష్ట‌త ఉండాల‌నిఒక్క అంశం పొర‌పాటు జ‌రిగినా అది పార్టీకి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ప్రజాప్రతినిధులు ఏ అంశాలను  వెలికితీసి , ఏం మాట్లాడితే ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందో అర్ధం చేసుకుని, ప్రజల నాడిని బట్టి నడుచుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజలు ఏరకంగా ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. రాజకీయాల పట్ల  ప్రజల  ఆలోచనా విధానం ఎలా ఉంది, వారు రాజకీయ నాయకులు, పార్టీల పట్ల ఏరకంగా ఆలోచిస్తున్నారన్న అంశాన్ని పసిగట్టడంలో సమయానుకూలంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ప్రజల నాడిని తెలుసుకోవాలంటే,  ప్రజల్లో ఉంటూ వారి స్థితిగతులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేవలం కార్యాయాల‌కు ప‌రిమితం కాకూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌లో ఉంటేనే వారి స్థితిగ‌తులు అర్థం అవుతాయ‌ని వారు అధికార పార్టీ ప‌ట్ల‌ప్ర‌తిప‌క్ష పార్టీ ల పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నార‌నే విష‌యం అర్థం అవుతుంద‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల మ‌నోగ‌తాలు తెలియ‌కుండా రాజ‌కీయాలు చేస్తే అవి విజ‌య‌వంతం కాబోవని సూచించారు.  
ప్రతిపక్ష పార్టీల మోసాలు....సమకాలీన రాజకీయాల్లో రాహుల్ గాంధీ పాత్ర
సమావేశాన్ని మూడు సెషన్ లుగా విభజించి చర్చించారు. ఇందులో  మొదటి పానెల్  సభ్యులతో సుధీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014 లో రాష్ట్రం ఆవిర్భవించే వరకు దేశానికి చేసిన సేవలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాలు, దేశాభివృద్దికి తోడ్పడ్డ ఎన్నో దృష్టాంతాలను విపులంగా చర్చించారు. దేశంలో హరిత విప్లవం, బ్యాంకుల జాతీయ కరణ, ఆర్టిఐ చట్టం, స్కిల్ డెవలప్ మెంట్ ఆక్టివిటీలు, సమగ్ర రైతు చట్టం, ఉపాధి హామీ పథకం లాంటి ఎన్నో వినూత్న పథకాలతో పాటు  దళిత, గిరిజనుల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అంశాల వల్లే నిరుద్యోగం ఎలా నిర్మూలనజరిగిందన్న అంశంపై ప్రతినిధులు సుధీర్ఘంగా చర్చించారు. అలాగే రెండవ సెషన్ లో టీఆర్ఎస్, బీజెపీ, ఎంఐఎం పార్టీలు గడిచిన నాలుగేళ్లుగా ప్రజల  కు చేస్తున్న మోసాలు, ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ఎదురయిన వైఫల్యాల పై చర్చించారు. మూడవ సెషన్ లో సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ గాంధీ ఆవశ్యకత ఏంటన్నదానిపై చర్చించారు.
సీనియర్ పాత్రికేయుల తో మాక్ డిబేట్లు
ప్రముఖ పాత్రికేయలు జకీర్, యాంకరింగ్ చేయగా అధికార ప్రతినిధులతో మాక్ డిబేట్లను నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ బీజెపి టీఆర్ఎస్ టీడిపి, ఎంఐఎం తరుఫునముందస్తు ఎన్నికలు,  సమకాలీన రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు, టీఆర్ఎస్ వైఫల్యాలపై చర్చ.ఎన్నికల గెలుపు ఓటమిలు అవకాశాల పై ఇందిరాశోభన్, కురువ విజయ్ కుమార్, సుజాయత్ అలీ, పేక రమేశ్ లు పాల్గొని ఆయా పార్టీ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కండువాలు కప్పుకొని  పాల్గొని చర్చ చేశారు. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న వారికి  ఫీడ్ బ్యాక్ ఫారం ప్రకారం  మాట్లాడే అంశంపై ఎలాంటి స్ఫష్టత ఉండాలి, చర్చలో పాల్గొనే ప్రతినిధుల ప్రవర్తన ఎలా ఉండాలి, మాట్లాడే అంశం చర్చ పరిధి దాటి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, కాంగ్రెస్  పార్టీ అంశంలో ఏ రకంగా రాహుల్ గాంధీ దేశానికి సమర్ధవంతమైన నాయకత్వం తో కూడిన ప్రధాని కాగలుగుతడో వివరించడం, మెజారిటీ గా యువకులున్నదేశంలో రాహుల్ లాంటి యువనాయకత్వం అవసరం ఏమేరకుంది, ప్రజలు రాహుల్ ప్రధాని ఎందుకు కావాలనుకుంటున్నారన్న అంశాలపై,  అదే విధంగా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ మోస పూరిత విధానాలు, నియంతృత్వ విధానాలపై సమగ్రమైన విశ్లేషణ ను  ఎలా మాట్లాడాలన్న అంశం పై చర్చిచారు. అలాగే  మరో సీనియర్ జర్నలిస్టు సతీష్ కమాల్ లు ఆధ్వర్యంలో జరిగిన మరో చర్చలో  ముందస్తు ఎన్నికలు ముగిశాయి, ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి, మరో వైపు  ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది, గెలుపు దిశలో కాంగ్రెస్ పార్టీ  ఉందన్న ఎగ్జిట్ పోల్  అంచనాలపై సలీం, రామ్మోహన్ రెడ్డి, శ్రీరంగం సత్యం, లోకేష్ యాదవ్ లు పాల్గొని ఆయా పార్టీల ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చర్చించారు.
ఆరు అంశాలతో కూడిన ఫీడ్ బ్యాక్ ఫారమ్
అంశాలతో కూడిన  పార్మాట్ ను శ్రవణ్ తీర్చిదిద్దారు. ఈ ఫార్మాట్ ప్రకారం   ప్రతినిధులు మాట్లాడే భాష, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం,  ఒక విషయాన్ని నమ్మకంగా, ధృడంగా చెప్పగలగడం, డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి తనకు కేటాయించిన స్ధానంలో కూర్చునే తీరు, అసహనం, సహనశీలత వెలువరించే తీరు  తదితర అంశాలపై మార్కులు కేటాయించారు.



వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రవణ్ కు కితాబిచ్చిన ప్రముఖులు
తొలిసారిగా వినూత్న కార్యక్రమానికి డాక్టర్ శ్రవణ్ శ్రీకారం చుట్టారని కిసాన్ సెల్ ఛైర్మెన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. అధికార ప్రతినిధుల ఒకరోజు వర్కషాప్ ఎంతో ఉపయోగకరమైందనికౌలురైతుల అంశంఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తదితర అంశాలపై డాక్టర్ శ్రవణ్ ఇచ్చిన ప్రజెంటేషన్లుఆయన చేసే మీడియా కోఆర్డినేషన్ లు  అధికార ప్రతినిధులకు మార్గదర్శకంగా తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. అలాగే  మారిన రాజకీయ పరిస్థితుల్లోమీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనివారి పనితీరు పైవారి సమర్ధత పైనా ఆధారపడి ఉంటుందని కార్యాక్రమంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఏంజేయబోతున్నదన్న విషయం పై  మొట్ట మొదటి సారిగా ఉదయం 9.30నుంచి 6.30వరకు సుదీర్ఘంగా 9 గంటల పాటు ఈ సమావేశం జరిగింది.  కాగా ముందస్తు ఎన్నికలు జరుగుతున్న కీలక దశలో  ఒక కీలకమైన కార్యక్రమం చేపట్టారని  సమావేశంలో పాల్గొన్నవక్తలు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికిరాబోయే ఎన్నికల్లో గెలుపు కు ఈ సమావేశం దోహద పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ నాగేశ్వర్, కిసాన్ సెల్ ఛైర్మెన్ కోదండరెడ్డి, ఏఐ సిసి కార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జి మధుయాష్కి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ప్రముఖ జర్నలిస్టు శ్రీనివాస్ రావు, సాంబశివరావు, ఏఐసిసి ప్రతినిధులు మెహరోజ్, తన్నీరు నరేందర్ రావు, ఇతర టీపీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment