Saturday 27 October 2018

కేంద్ర ఎన్నికల కమీషన్ కు గులాబీ రంగు సోకిందా..శ్రవణ్ దాసోజు సూటి ప్రశ్న.

కేంద్ర ఎన్నికల కమీషన్ కు గులాబీ రంగు సోకిందా..శ్రవణ్ దాసోజు సూటి ప్రశ్న.
గులాబీ పార్టీకి  ఎన్నికల కమీషన్ గులాములుగా మారిందని ఎద్దేవా.
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్ల కొనుగోలుకు జీవో ఎట్లా జారీ చేస్తారని నిలదీత
ఫోన్ ట్యాపింగ్ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపణ
తెలంగాణాలో ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరిగే పరిస్థితి లేదని ఆవేదన
పోలీసు అధికారులు మీడియా సంస్ధలను బెదిరించడం రాజ్యంగ ఉల్లంఘన.


తెలంగాణా పత్తి పంటలపై సోకిన పింక్ (గులాబీ రంగు) ఇప్పుడు ఎన్నికల కమీషన్ కు సోకినట్లుందని ఆపద్దర్మ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా గులాబీ పురుగు సోకి ఆ మత్తులో ఉండి పట్టించుకోవడంలేదని టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్, మీడియా సమావేశంలో పాల్గొన్నశ్రవణ్ ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారడం సరికాదన్నారు.  తెలంగాణా లో ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా, న్యాయపరంగా జరిగే పరిస్ధితి కనిపించడం లేదని, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల వాతావరణాన్ని విధ్వంసకరంగా మారుస్తున్న ఆపద్దర్మ ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ వత్తాసు పలుకడం, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా వ్యవహరించడం  దురదృష్టకరమన్నారు.
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్లు
ఆపద్దర్మ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినప్పుడల్లా  కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయాల్సి రావడం సిగ్గుచేటని, తెలంగాణాలో ఎన్నికలు పారదర్శకంగా జరగవనడానికి తేది 26.10.2018 రోజున గులాబీ రంగులో 90 లక్షల ఈ వీ ఎం బ్యాలెట్ పేపర్లను 75 పీఎస్ ఎం ప్రకారం, కొనుగోలు చేయాలని డిప్యూటీ చీఫ్ ఎన్నికల అధికారి,   డిప్యూటి సెక్రటరీకి జారీ చేసిన  జీవో నెంబర్ 1605  ఉత్వర్వే సాక్ష్యమన్నారు. ఓవైపు ఆపద్దర్మ ప్రభుత్వం అనువైన ప్రతి చోట ఎన్నికల  నిబంధనలను అతిక్రమిస్తుందని నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకుంటుంటే ప్రభుత్వ వాహనాల్లో, కార్యాలయాల్లో, రింగుటోన్లలో  పథకాల ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుంటే పట్టించుకోకుండా ఇలాంటి జీవో లు జారీచేస్తుంటే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందని   ఎన్నికల కమీషన్ ను సూటిగా ప్రశ్నించారు.
గులాబీ పార్టీకి గులాములుగా ఎన్నికల కమీషన్
ఎన్నికల కమీషన్ గులాబీ రంగు గులాములుగా మారిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమీషన్ రాజ్యంగానికి, చట్టానికి  లోబడి ఎన్నికలు నిర్వహిస్తారా లేక టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారో తేల్చుకోవాలని హితవు పలికారు.
తప్పులు చేయడం సరిదిద్దుకోవడం ఎన్నికల కమీషన్ కు అలవాటుగా మారింది.
పింక్ రంగు పోలింగ్ కేంద్రాలను వ్యతిరేకిస్తే వాటిని తొలగించిన ఎన్నికల కమీషన్ వేరే రంగు లో పెడుతామన్నారని, ఇలా ప్రతిసారి తప్పులు చేస్తూ వాటిని ఎత్తిచూపితేనే స్పందిస్తామని చెప్పడం, తప్పులు జరిగిన ప్రతిసారి సరిదిద్దుకోమని చెప్పాల్సిరావడం దున్నపోతుకు ముల్లకర్రతో పొడిచినట్లేనన్నారు. ప్రతిసారి మేం అభ్యంతరం చెబితేనే స్పందిస్తారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
టీఆర్ ఎస్ పార్టీకి ప్రచారం చేయాలని ఎద్దేవా
ఎన్నికల కమీషన్  స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్ధని రాజ్యాంగ బద్దంగా, పారదర్శకంగా, పారదర్శకంగా వ్యవహరించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించాలన్నారు. ప్రపంచంలో వేరే రంగే లేనట్టు, ఎన్నికల బూత్ లకు , బ్యాలెట్ పేపర్లకు పింక్ రంగు వాడేదుంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేయాలని,కారుగుర్తుకే ఓటేయ్యాలని చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపణ
ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ లు ట్యాపింగ్ జరగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. పోలీస్ ఇంటలిజెన్స్, నేరస్తులు, దొంగల ఆచూకీ పై ఇంటలిజెన్స్ చేయకుండా, ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలపై ఇంటలిజెన్స్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు  ఏం మాట్లాడుకుంటున్నరు, ఎక్కడ తింటున్నరు, ఎక్కడ పడుకుంటున్నరు. ఎప్పుడు లేస్తున్నరనే విషయంపై నివేదికలు తయారు చేసి ఆపద్దర్మ ముఖ్యమంత్రికి అందజేస్తున్నరని ఆరోపించారు.  ఇంటలిజెన్స్ వ్యవస్ధ ప్రతిపక్షపార్టీ ల పై నిఘా పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను ఆపుతూ తనిఖీల పేరిట వేధిస్తున్నారన్నారు. మరో వైపు పాత కేసులు తిరగదోడుతున్నారన్నారు. ఎన్నికల వేళ ఆపద్దర్మ ప్రభుత్వం ఇన్ని అకృత్యాలకు పాల్పడుతున్నా ఎన్నికల కమీషన్ కళ్లుమూసుకోవడం, కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ పాలసీకి ప్రతీక ఉండాల్సిన కమీషన్ ఇలా ప్రవర్తించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఉల్లంఘనలు జరిగుతున్నాయని లేఖ ఇస్తేనే స్పందించడం సరికాదని ప్రభుత్వం వెలువరిస్తున్న జీవోలను సైతం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీసు అధికారులు మీడియా సంస్ధలను బెదిరించడం రాజ్యంగ ఉల్లంఘన.
ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ తమ రహస్య పరిశోధనలో చంచల్ గూడ జైల్లో టేకు కర్రలను పాట్నాకు తరలిస్తున్నారని కథనం ప్రసారం చేయడంతో సదరు టీవీ ఛానెల్ యాజమాన్యాన్ని కమర్షియల్ సెక్స్ వర్కర్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ  జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ లేఖ రాయడాన్ని డాక్టర్ శ్రవణ్ తప్పుపట్టారు. యధారాజ తధాప్రజ అన్నట్లు కేసీఆర్ వరంగల్ సభలో మీడియాను పదికిలోమీటర్ల లోతున పాతరేస్తానని బెదిరిస్తే తన అకృత్యాలను వెలికి తీసారన్న అక్కసుతో జైళ్ల శాఖ డిజి బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు.  మీడియా తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయాలని లేదంటే ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కు, లైసెన్స్ రద్దు చేయమని బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంటు కు ఫిర్యాదు చేయోచ్చని అలా కాదని బెదిరింపులకు దిగడం సరికాదని ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని హితవు పలికారు. తెలంగాణా రాష్ట్రంలో పత్రికా స్వాతంత్ర్యం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుందన్నారు.
పత్రికాస్వాతంత్ర్యం హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
మీడియా తప్పుచేస్తే కేసులు నమోదు చేయాలని, ప్రెస్ కౌన్సిల్ ఇండియ. ఇండియన్  జర్నలిస్టుయనియన్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయాలని  కమీషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, డిజీపి మహేందర్ రెడ్డి వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జైళ్ల శాఖ డీజి వెంటనే బేషరతుగా మీడియా సంస్ధలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రవణ్ దాసోజు వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు పోరెడ్డి స్రవంత్ రెడ్డి, దరువు ఎల్లన్న, ఇందిరా శోభన్ తదితర నేతలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment