Monday 1 October 2018

కల్వకుంట్ల రామారావు కాదు..... కారుకూతల రామారావు

కల్వకుంట్ల రామారావు కాదు..... కారుకూతల రామారావు

తెరాస అంటే తెలంగాణాకు పట్టిన తెగులు..టీఆర్ఎస్ అంటే ట్రెయిటర్స్ సమితిని ఎద్దేవా చేసిన శ్రవణ్ దాసోజు.

ప్రజల  రక్త మాంసాల రుచిమరిగిన ముసలి నక్క సింహం కావాల్నో.. దేశంకోసం పోరాడిన సైనికుడు కావాల్నో ప్రజలే నిర్ణయించాలి.

హామీలు నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపు



నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న  కల్వకుంట్ల తారకరామారావు తన  పేరు ను కారుకూతల రామారావు గా మార్చుకుంటే బాగుంటుందని టీపీసీసీ కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్యఅధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బేకారు పార్టీలో ఉన్న కేటీఆర్ కారుకూతలు తప్ప మంచి మాటలు  ఎలా మాట్లాడగలరన్నారు. బేకారు పార్టీ కారుకూతలు కూస్తే.. చెయ్యిగుర్తు పార్టీ ప్రజలకు మంచి పనులు చేతల్లో చేసి చూపిస్తుందన్నారు అపహాస్యం చేశారు.

బర్రెలనుకుని ఓట్లేస్తే అడ్డగాడిదలయ్యారు

60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాను 60 నెలలు పరిపాలించమని తెలంగాణా ప్రజలు అధికారం అప్పగిస్తే చేవలేక చాతకాక కాడి మధ్యలోనే వదిలేసిన సన్నాసులు టీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు.ఉద్యమ సమయంలో ఎన్నో మార్లు గాడిదలకు గడ్డేస్తే బర్లు పాలిస్తయా అంటూ మాట్లాడిన టీఆర్ఎస్ నేతలను ప్రజలు బర్రెలనుకుని ఓట్లేసి గెలిపించారిని కాని తాము అడ్డగాడిదలమని నిరూపించుకున్నారని శ్రవణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాలన చేతకాక కాంగ్రెస్ పార్టీ విమర్శలవల్లే ఎన్నికలకు పోతున్నమని చేతకాని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెరాస అంటే తెలంగాణాకు పట్టిన తెగులు సమితి

తెరాస అంటే తెలంగాణాకు పట్టిన తెగులు సమితని,  టీఆర్ఎస్ అంటే ట్రెయిటర్స్ రాష్ట్ర సమితని దాసోజు ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రజలు నమ్మి పట్టం కడితే విభజన చట్టం వల్ల ఉద్యోగుల విభజన జరగలేదని పదినెలలకాలాన్ని, హైదరాబాద్,  వరంగల్,  ఖమ్మం ఎన్నికల పేరిట బై ఎలక్షన్ ల పేరిట మరికొన్ని రోజులు వృధా చేశారని, తొమ్మిది నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి 30 నెలలకూడా సక్రమంగా పాలన చేయకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని ఆయన తూర్పారా పట్టారు.

స్వార్ధానికి స్వాభిమానానికి మధ్య పోరాటం

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్న పోరాటం .. స్వార్ధానికి ..స్వాభిమానం మధ్య జరుగుతోందని, అలాగే అధికారానికి ఆత్మగౌరవానికి జరుగుతుందన్నారు. అధికారానికి, అహంకారానికి నెలవుగా మారిన టీఆర్ ఎస్ పార్టీని మట్టిగరిపించడానికి  తెలంగాణాలో ఉన్న సబ్బండ వర్గాలు , సబ్బండ కులాలు ఏకమై ఒక్కతాటిపై నిలిచి  టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించపోతున్నాయని శ్రవణ్ అన్నారు.అన్ని పార్టీలు కేసీఆర్ నియంతృత్వ విధానాన్ని ఎదుర్కొవడానికి ఒక్కతాటిపై నిలిచి పోరాడుతుంటే గుబులు పుట్టి లాగులు తడుస్తున్నయని అందుకే కేటీఆర్ టీడిపి తో మరో పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నరని అవాకులు చెవాకులు పేలుతున్నరన్నారు.

ప్రజల  రక్త మాంసాల రుచిమరిగిన ముసలి సింహం కావాల్నో దేశంకోసం పోరాడిన సైనికుడు కావాల్నో ప్రజలే నిర్ణయించాలి.

టీఆర్ఎస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తే గాదెకింద పందికొక్కుల్లెక్క, నక్కలెక్క

తెలంగాణా ప్రజల రక్తమాంసాలను దోచుకుతిన్న దోపిడి దొంగలని విమర్శించారు. ప్రగతి భవన్ కోట గోడలో  తెలంగాణా ప్రజల రక్త మాంసాల రుచిమరిగిన ముసలి సింహం ఓవైపుంటే  దేశరక్షణ కోసం కంకణ బద్దులై  ప్రాణత్యాగానికి  సిద్దమైన వీరుడైన సైనికుడు కాంగ్రెస్ పార్టీకి సారదిగా పనిచేస్తున్నాడని వీరిద్దరిలో ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.

ద్రోహులు వైపుంటారో  లేక ప్రాణాలకు వెరవని నేతలపుంటారో  తేల్చుకోవాలని ప్రజలకు పిలుపు

తుమ్మలనాగేశ్వర్ రావు తలసానిశ్రీనివాస్ యాదవ్ , పట్నం మహేందర్ రెడ్డి లాంటి తెలంగాణా ద్రోహులున్న పార్టీ కావాల్నో లేక ప్రాణాలకుసైతం  వెరవకుండా కళ్లుపోయినా ఫర్వాలేదని తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటులో పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ లాంటి నేతలున్న పార్టీ కావాల్నోప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపు నిచ్చారు.

టీఆర్ఎస్ కు ఎందుకు ఓటెయ్యాలి

రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే  స్వాంతన కలిగించందుకు ఓటేయాలా లేక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకు ఓటేయాలా అని శ్రవణ్ ప్రశ్నించారు. విద్యార్ధులకు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా మోసగించారని, కార్పోరేట్ విద్యను నియంత్రించకుండా పేద విద్యార్ధుల ఉసురు పోసుకుంటన్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలుచేయకుండా, శృతి సాగర్ లాంటి అమాయకులను  ఫేక్ ఎన్ కౌంటర్ల పేరిట చంపేసినందుకు ఓటేయాలా అని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. మహిళకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదని,ధర్నాచౌక్ ఎత్తివేసి  ప్రజాస్వామిక గొంతులను పోలీసురాజ్యంగా మార్చి నొక్కేసారని దుయ్యబట్టారు.అధిపత్యానికి అహంకారానికి అణిచివేతకు నెలవుగా మారిన టీఆర్ఎస్ పార్టీ కి రానున్న కాలంలో ప్రజలు ఓట్ల ద్వారా కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్దం అవుతున్నారని ఓట్లు రావు సీట్లు రావు టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కేసీఆర్ తో సహా అందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని శ్రవణ్ ఎద్దేవా చేశారు. శ్రవణ్ తో పాటు మాజీ మంత్రి జె. గీతారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

రేపు అల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఛైర్మెన్ శశిధరూర్ హైదరాబాద్ రాక

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంస్ధ  ఛైర్మెన్ శశిధరూర్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారని సౌత్ ఇండియా కో ఆర్డినేటర్ మాజీ మంత్రి జె. గీతారెడ్డి తెలిపారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని ,ఇప్పటికే 5000 వేల మంది ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని "ప్రమాదంలో ప్రజాస్వామ్యం" అన్న అంశంపై శశిధరూర్ ప్రసంగిస్తారని ఆమె తెలిపారు.  ఈ సమావేశానికి మేధావులు, ఓపీనియన్ మేకర్స్ పెద్దయెత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  తెలంగాణా కాంగ్రెస్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ప్రసిడెంట్ శ్రవణ్ దాసోజు, వైస్ ప్రసిడెంట్ నార్ల కల్యాణ్, ఇతర ప్రొఫెషనల్ కాంగ్రెస్ బాధ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment