Wednesday 29 August 2018

ప్రశ్నించే గొంతులను అణిచేస్తారా.. శ్రవణ్ దాసోజు

విరసం నేత వరవరరావు అక్రమ అరెస్ట్ ను  టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వ విధానాలను, తప్పులను ఎత్తిచూపుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగ పనిచేస్తున్న ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అక్కడ మోడీకి, ఇక్కడ కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. అత్యున్నత స్థాయి భద్రత కలిగిన ప్రధాని మోడీ హత్యకు 77 ఏళ్ల వయస్సున్న వరవరరావు కుట్రచేశారనడం ప్రభుత్వ డొల్ల తనాన్ని తెలియజేస్తోందని, ఎలాంటి రుజువులు చూపకుండా ఎక్కడో దొరికిన లేఖ ఆధారంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. వరవరరావు పై ఆరోపణలు వస్తే కేంద్రమే స్వయంగా విచారించే అవకాశముందని  అవసరమైతే అత్యన్నత స్థాయి విచారణ సంఘంతో విచారించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.





No comments:

Post a Comment