Monday 27 August 2018

అవినీతి అక్రమాలు సహించేది లేదన్న ముఖ్యమంత్రికి విద్యాశాఖ అక్రమాలు ఎందుకు కనిపించడం లేదు

·      దొంగలకు సద్దులు మోసినట్లు అవినీతి విద్యాశాఖ  అధికారులకు ఎమ్మెల్సీ కితాబివ్వడం తగదన్న శ్రవణ్ దాసోజు  
·      అవినీతి అక్రమాలు సహించేది లేదన్న ముఖ్యమంత్రి కి విద్యాశాఖ  అక్రమాలు ఎందుకు కనిపించడం లేదు   
·      2016 లో ఇచ్చిన 182జీవో కు 2018 లో ముఖ్యమంత్రి అనుమతి ఎందుకని సూటి ప్రశ్న 
·      లెక్చరర్లటీచర్ల బదిలీల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ముఖ్యకార్యదర్శికి  బహిరంగ  లేఖ
·      అక్రమ బదిలీలపై   ఇచ్చిన  ఓడీ లు వెంటనే  రద్దు చేయాలని డిమాండ్ .
·      లెక్చరర్లఉపాధ్యాయుల ఖాళీలుకళాశాలల వివరాల పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
·      వెబ్ కౌన్సిలింగ్ లో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనీ డిమాండ్ 




 
భాద్యత కల ప్రతిపక్షంగా తాము విద్యాశాఖ లో వెలుగు చూసిన అవినీతిని వెలుగులోకి తెస్తే  తక్షణమే తప్పును సరిదిద్దు కోకుండా ముఖ్యమంత్రిమాట్లాడకుండా ,  దొంగలకు సద్దులు మోసినట్లుఅవినీతి విద్యాశాఖ  అధికారులకు ఎమ్మెల్సీ పాతూరి   కితాబివ్వడం  తగదని  ఇవాళ సాయంత్రం గాంధీభవన్ లో జరిగిన మీడియా  సమావేశంలోటీపీసీసీ   ముఖ్య అధికార ప్రతినిధి  శ్రవణ్ దాసోజువిమర్శించారు .. ఒక్క ఉపాధ్యాయుని తెలుసుకోకుండా అందరు సంతోషంగా ఉన్నారంటూ ఎమ్మెల్సీ చెప్పడం సిగ్గుచేటని ,దొంగ పిల్లి కళ్ళు మూసుకొని  పాలు  తాగితే ఎవరు చూడడం లేదనుకోవడం సరికాదని  శ్రవణ్ హితవు పలికారు.  

ముఖ్యమంత్రి  కి లేఖ రాస్తే  ఎలాంటి  స్పందన రాలేదని కనీసం ప్రభుత్వముఖ్యకార్యదర్శి అన్నాస్పందించి   విద్యాశాఖ అక్రమాలపై  విచారణ  జరిపించాలని  నష్టపోయిన వారికి న్యాయంచేయాలనీ   ఆధారాలతో సహా వివరిస్తూ ప్రభుత్వముఖ్యకార్యదర్శి  శైలేంద్రకుమార్ జోషి కివిద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు కూడా  లేఖ రాసామన్నారు . 

విద్య శాఖలో అవినీతి జరగకపోతే వెబ్ కౌన్సిలింగ్ పుర్తయిన తర్వాత ఎందుకు అడ్జెస్ట్ మెంట్  పేరిట ఓడి లు ఇచ్చారో స్పష్టం చేయాలని  శ్రవణ్ డిమాండ్ చేశారు.శాస్త్రీయ కోర్సుల పేరిట పట్టణప్రాంతాల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలను పూర్తిగా నిర్వీర్యం చేశారనిగ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులు చేరక పోతే అక్కడ విద్యార్ధులు లేరన్న నెపంతో లెక్చరర్లను ఓడీ పేరిట బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు.  కళాశాలల విద్యార్థుల సంఖ్యరెగ్యులర్ లెక్చరర్ల సంఖ్య,  ఓడిపై ఏకళాశాల నుండి   కళాశాలకు పంపారన్న వివరాలను  పూర్తిగా బయటపెట్టాలన్నారు .   వెబ్ కౌన్సిలింగ్ ముగిశాక పోస్టింగులు మార్చి ఎందుకు ఇచ్చారు విద్యాశాఖాధికారులు వెల్లడించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

స్వయంగా  ముఖ్యమంత్రే అంతర్జిల్లా బదిలీలు నిర్వహించి భార్యాభర్తలకు ఊరట కలిగిస్తామని  2016 మే 21లో  ఇచ్చిన  182 జీవో   ను  పరిగణనలోకి తీసుకోకుండా  బుట్టదాఖలు చేశారన్నారు.   రెండేళ్ల క్రితం  ఇచ్చిన జీవో పై మల్లి ముఖ్య మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరమేంటని శ్రవణ్ ప్రశ్నించారు

ప్రాథమిక విద్య శాఖలో జూన్ 6 నాడు టీచర్ ట్రాన్సఫర్  కోసం వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తే  మే 23 నాడు  వందలకొద్దీ ట్రాన్స్ఫర్లు ఎందుకు చేశారని శ్రవణ్ ప్రశ్నించారు.2018  జూలై 18   తేదీ వరకుదాదాపు నెలరోజుల కు పైగా  వెబ్

Video Link :

No comments:

Post a Comment