Saturday, 31 March 2018
Friday, 30 March 2018
Thursday, 29 March 2018
Wednesday, 28 March 2018
Tuesday, 27 March 2018
KCR Crushing Judiciary under his feet, Dr Sravan
Press Note
KCR Crushing Judiciary under his feet, Dr Sravan
27th March, 2018: Congress
chief spokesman, Dr Sravan Dasoju, in a press meet at Gandhi Bhavan, has
alleged that the Telangana government has created most vulnerable circumstances
enforcing Advocate General Prakash Reddy to resign from his post.Sravan accused
that KCR has Crushed Judiciary under his feet dismantling the pillars of
democracy.
He said that AG will only interpret the law
defending government stand, but certainly shall not implement the instructions
of chief minister. And if that happens
there is no sanctity of judiciary system. Dr Sravan accused that when the AG
disregarded CM irrationals irrational instructions, he was forced to resign
from the post.
It is
tight slap on the face govt, Sravan expressed. Sravan opined that AG has
resigned from the post only because TRS government humiliated him for his
honest agreement to produce the complete video evidence in the high court. .
He said the Congress MLAs have protested well
within their rights during the Governor’s address to the joint of legislature.
During the protest, he said the video recordings showed Mr Komatireddy Venkat
Reddy threw his earphone in the air. It did not show that the earphone hitting
Legislative Council chairman. If the earphone had actually hit the Council
chairman, how is it that six cameras - two of which exclusively focused on the
podium - used in the proceeding did not show
the incident.
Sravan alleged that If TRS Govt is truthful,
why is the government planning to hire a Supreme Court lawyer spending crores
of rupees? Is it no to mislead and maneuver the case proceedings.
Sravan demanded that at least now in the
light of AG resignation, the govt must withdraw the disqualification of two
MLAs and tender an apology to congress Party.
Press Note
ఏజీ రాజీనామా ప్రభుత్వానికి చెంపపెట్టు… కేసీఆర్ ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగను న్యాయవ్యవస్థను కాల రాస్తుండ్రు
·
న్యాయ
వ్యవస్థను
కూడా చెప్పుచేతుల్లో
పెట్టుకోవాలనే
కుట్ర
·
ఏజీ రాజీనామా
ప్రభుత్వానికి
చెంపపెట్టు...
·
న్యాయం
కోసం పోరాడితే
అవమానాలా..దాసోజు శ్రవన్
ధ్వజం..
·
ఎం.ఎల్.ఎ
బర్తరఫ్
కేసులలో
తేలుకుట్టిన దొంగల్లా సర్కార్ వైఖరి..
·
తిమ్మిని
బమ్మి
చేయడానికే
సుప్రీంకోర్టు న్యాయవాదిని పిలుస్తున్నారా...
?
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎం.ఎల్.ఎలు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లను సభ్యత్వాల బర్తరఫ్ విషయంలో ప్రభుత్వం తేలుకుట్టిన దొంగల్లా దొరికిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అన్ని వేధికలలో పోరాడి చివరకు న్యాయస్థానాన్ని సంప్రదిస్తే హైకోర్టు శాసనసభలో జరిగిన వీడియో ఆధారాలను చూపించమని అడగడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి, చివరకు హైకోర్టు ఎజిని ( అడ్వకేట్ జనరల్ ) రాజీనామా చేయించే పరిస్థితికి దిగజారిపోయిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ ధ్వజమెత్తారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్న పొరపాట్లకు పెద్ద శిక్షలు వేసిన ప్రభుత్వం చివరకు న్యాయస్థానం ముందు తలవంచక తప్పని పరిస్థితి ఎదరవడంతో తన చేతకాని, అక్రమ పద్దతులను ఎజిపి పై రుద్ది ఒక నిజాయితీ పరుడైన ఏజీని రాజీనామా చేయించే వరకు పూనుకుందని ఇది టిఆర్ ఎస్ అక్రమ పద్దతులకు పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు.
12వ తేదీన గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాల హక్కుగా భావించి వారి పరిధులలో కాంగ్రెస్ ఎం.ఎల్.ఎలు వారి పరిధులలో నిరసన వ్యక్తం చేశారని అయితే ఆ సందర్భంగా కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఎడమ చేతితో ఇయర్ ఫోన్స్ను గాలిలోకి విసురుతున్న విజువల్స్ మాత్రమే ప్రభుత్వం చూపిస్తుందని అసెంబ్లీలో ఆరు వీడియో కెమెరాలలో సమావేశాలను రికార్డులు చేస్తారని రెండు కెమెరాలు పూర్తిగా గవర్నర్ ప్రసంగాన్నే కవర్ చేస్తుందని అలాంటప్పడు నిజంగా ఇయర్ ఫోన్లు మండలి చైర్మన్కు తగిలిఉంటే ఆ విజువల్స్ ఎందుకు కోర్టుకు సమర్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే మండలి చైర్మన్ సభ అయ్యాక గంట సేపటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్నట్టు వీడియో రికార్డులలో ఆధారాలతో సహా ఉందని, మరి కంటికి దెబ్బ తగిలితే ఎందుకు వెంటనే ఆసుపత్రికి పోలేదని, ముఖ్యమంత్రి చెప్పడంతో తాను ఆసుపత్రికి పోయానని అధికారికంగా మండలి చైర్మన్ చెప్పారని ఇదంతా పక్కాగా కుట్రతో కూడిన రాజకీయంగా తేలిపోయిందని ఆయన అన్నారు. ఈ విషయంలో హైకోర్టు ఎజిని ప్రశ్నించడంతో ఆయన తన పరిధి మేరకు విజువల్స్ ఇస్తామని చెప్పారని అయితే ఈ విషయంలో ఎజిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుందని ముఖ్యమంత్రిని అడిగి ఎజిలు న్యాయస్థానాలలో వాధిస్తారా అని ప్రశ్నించారు.
నిజంగా ప్రభుత్వంవైపు న్యాయం ఉంటే డిల్లీ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాధి హరీష్ సాల్వేని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి తేవాల్సిన అవసరం ఏముందని, తిమ్మిని బమ్మి చేయడానికే ప్రభుత్వం కుట్ర చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. 12వ తేదీన జరిగిన సమావేశ వీడియోలను కోర్టుకు సమర్పించడానికి 15 రోజుల సమయం ఎందుకు సరిపోవడం లేదని, అంతేకాకుండా తెలంగాణకు చెందిన ఒక మహా మేధావి అయిన ఎజిని అవమానపరిచే ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయవాదిని వాధనలకు పిలవడం తెలంగాణ మేధావి లోకానికి, అవమానపరమని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వారివైపు న్యాయం ఉంటే వారికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో జరిగిన అన్ని వీడియోలను సమర్పించాలని ఆలస్యం చేయడం అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రభుత్వం ఏమైనా కుట్ర చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ప్రభుత్వం తప్పు ఒప్పుకొని బర్తరఫ్ చేసిన ఎం.ఎల్.ఎలకు తిరిగి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Subscribe to:
Posts (Atom)
-
- అనర్హుడికే అందలం - సీఎస్ ఎంపికపై దాసోజు ఫైర్ - రాష్ట్ర ప్రభుత్వం లో రిటైర్డ్ అధికారులదే హవా - పడకేసిన పాలన రాష్ట్రంలో పాలన...
-
ఆంధ్రా కేడర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు తెలంగాణాలో ఏం పని..? - ధ్వజమెత్తిన డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమ...
-
Congress demands judicial probe into inter exams goof up Ø Sravan calls Minister Jagadish Reddy 'Munnabhai MBBS', want him s...