Tuesday 29 August 2017

Dr Sravan Dasoju Reply to 2 ICFA on #Agriculture #Leadersip Award to #Shri #KCR-TELUGU













శ్రీయుత ఎన్ ఎస్ రంధావ గారు,

ఎక్స్యూటివ్ డైరెక్టర్ ,
ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్
విషయము: తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీయుత చంద్రశేఖర్ రావుగారి గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2017 గూర్చి
1. తేదీ 23.08.2017 నాడు మీరు పంపిన లేఖకు నా సమాధానం..
2. మొదటిది మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం వ్యక్తిగతంగా నేను గాని, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిగాని.. మీకు గాని మీ సంస్ధకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యక్తిగత వైషమ్యాలు లేవు.
3. రెండోది మీడియా సమావేశంలో మా ప్రధాన ఆరోపణ ఏమంటే... కేంద్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మక గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ 2017 ను ప్రకటించినట్లు, రాష్ట్రగవర్నర్ ఆయన అభినందిందిస్తూ మీడియాకు ఒక తప్పుడు లేఖ విడుదల చేయడం పైనే..ఇదే అదను అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కే. చంద్రశేఖర్ రావు గారు వ్యవసాయ అభివ్రిద్ది కోసం తాను చేసిన కృషి ని గుర్తించినట్లు పెద్ద ఎత్తున మోసపూరిత ప్రచారం చేసుకోవడం పైనే..
4. ముఖ్యమంత్రిగారు, గవర్నర్ కలిసి చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని, మోసపూరిత విధానాన్ని వెలికి తీయడం మా కనీస భాద్యత.. విఫలమవుతున్న ప్రభుత్వ నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు రైతులవద్ద మోసపూరితంగా మంచి పేరు కోట్టేసేందుకు రాజకీయంగా లబ్ది పోందేందుకు గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్ షిప్ అవార్డు వాడుకునేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకున్నాం.
5. దురదృష్టవశాత్తూ ICFA ఇవ్వబోతున్న అవార్డును కేసీయార్ గారు దుర్వినియోగపరిచి, రాజకీయంగా లబ్దిపొంది తెలంగాణా ప్రజలను వెర్రిబాగుల వాళ్లను చేస్తున్నారు. .దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రధమ పౌరుడు, రాజ్యాంగ రక్షకుడు క ఉండాల్సిన గవర్నర్ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ మోస పూరిత ప్రచారంలో భాగస్తుడు అయ్యిండు. ఇది ప్రజాస్వయానికి ప్రమాదకరం
గవర్నర్ గారి ప్రెస్ స్టేట్ మెంట్ తర్వాత చూసిన తర్వాత మేము చేసిన లోతైన పరిశోధనలో ఐసీఎఫ్ ఎ అనే సంస్ధ ఒక ప్రైవేట్ సంస్ధ గా గుర్తించాం.
§ M/s ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) అనే కంపెనీ జూన్ 5వ తేదీ 2015లో రిజిష్టర్ అయినట్లుగా రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్ లో పొందుపరిచి ఉన్నది. కాని మీరు మీ యెక్క లేఖలో 2008 నుంచి అవార్డులు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇది మోసం కాదా?
§ RoC రికార్డుల లో M/s ICFA పూర్తిగా శ్రీయుత ఎం జె ఖాన్ గారి స్వంత కంపెనీ అని తెలుస్తుంది. అంతేకాక M/s కాన్సెప్ట్ అగ్రోటెక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ మరియు M/s భగీరథి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి లాభాపేక్ష కలిగిన వ్యవసాయ మరియు విత్తన సంబంధిత వ్యాపార కంపెనీలలో శ్రీయుత ఎం జె ఖాన్ భాగస్వామి గా ఉన్నాడు.
§ రిజిష్టార్ ఆఫ్ కంపెనీస్ లో ఫైల్ అయిన రిటర్న్ లో ICFA అనే సంస్ధ M/s కాన్సెప్ట్అగ్రెటెక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్న డబ్బుద్వారానే నడుస్తోందని తెలుస్తొంది.
§ M/s. ICFA కంపెనీలో ఎంజె ఖాన్, అలోక్ సిన్హా మరియు సునిల్ కుమార్ లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లుగా ఉన్నారు. ఇక సునిల్ కుమార్ గారు M/sఅజార్డికా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ M/s ఎన్ వి ఇండియన్ ఆగ్రో ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు M/s సినర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు, అదేవిధంగా అలోక్ సిన్హాగారు. ఇతర కంపెనీలతో పాటు M/s భారత జాతీయ బహుళ సరుకుల మారక సంస్థ అనే ప్రైవేట్ కంపెనీ కు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా M/s. ఎంటెర్గా లిమిటెడ్ లో కూడా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే M/s.ఎంటెర్గా లిమిటెడ్ దాదాపు 280 కోట్లరూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ వ్యవసాయం మరియు విత్తన కంపెనీలతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.
§ 2016 మార్చి 31 వరకు M/s ICFA బాలెన్స్ షీట్ ప్రకారం షేర్ కాపిటల్ కూడా కేవలం 66,639 రూపాయలు మాత్రమే. ఇక ప్రింటింగ్ మరియు స్టేషనరీఖర్చులు కేవలం 21,830., ఆఖరికి 7000 రూపాయలు ఆడిటర్ ఖర్చులు కూడా చెల్లించలేదు. ఎలాంటి చెల్లింపులు లేవు, ఆఖరికి ఉద్యోగులజీతాలు చెల్లించలేదు. అదేవిధంగా కంపెనీ కార్యకలాపాల పై ఖర్చులు కూడా లేవు. M/s ICFA..కు సంబంధించి ఏ లవ దేవీలు లేవు. ICFA వారు ఒక్కరూపాయి ఆదాయం లేదని , ఏ ఖర్చు కూడా చేయలేదని వారు సమర్పించిన బాలెన్స్ షీట్ మరియు RoC రికార్డులు చెపుతున్నాయి. .కాని మీరు 2015లోనే గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్ షిప్ అవార్డు ను శ్రీ శివరాజ్ చౌహన్ గారికి ఇచ్చామని చెబుతున్నారు. అంతపెద్ద ప్రోగ్రాం చేయడానికి ఎలాంటి ఖర్చులేకుండా ఎలా నిర్వహించారో చెప్పగలరా? మీకు ఈ అవార్డు ఫంక్షన్లకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు?
§ M/s ICFA కంపెనీలో 20మంది పేరెన్నికగన్న వ్యక్తులు బోర్డ్ మెంబర్లుగా ఉన్నారని చెబుతున్నారు. కాని రిజిష్టర్ ఆఫ్ కంపెనీ వివరాల ప్రకారం కేవలం ముగ్గురు మాత్రమే (ఎంజె ఖాన్, అలోక్ సిన్హా మరియు సునిల్ కుమార్ లు) కంపెనీ డైరెక్టర్లుగా నమోదయ్యారు. కాని మీరు చెబుతున్న పేరెన్నికగన్న వ్యక్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు RoC రికార్డులలో లేవు. ఇది మోసం గాద? ఒకవేళ వారంతా మీ కంపెనీతో సంనడం ఉన్న వారైతే, వారంతా విత్తనాల వ్యాపారం, వ్యవసాయయంత్రాలు, వ్యవసాయ సామాగ్రి పురుగులమందులు అమ్మే మల్టీనేషనల్ కంపెనీలకు సంధించిన వారు. దీన్ని బట్టి ప్రైవేట్ విత్తన సంస్ధలతో .లేదా వ్యవసాయ వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు గాదా?
§ స్వాతంత్ర్యం కు ముందు నుంచి ఫిక్కీ మరియు సిఐఐ లాంటి పెద్ద సంస్ధలు ప్రాధమికంగా వారి సభ్యులతో సహాయం తో న్నాయి. నిర్ణయానుసారంగా పరిశ్రమలు మరియు వ్యాపార అభివృద్లిలో భాగంగా అవి ఆయా సంస్ధలను ప్రభుత్వం ను ప్రభావితం చేస్తాయికూడా చేస్తున్నాయి.. అలాంటివి ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నేతకు అవార్డులు ప్రకటించలేదు. కాని M/s ICFA అనేసంస్ధ మాత్రం ప్రభుత్వాలను నడిపే రాజకీయ నేతలకు అవార్డులు ఇస్తోంది.. కారణాలేంటో మీకే తెలియాలి?
§ దేశంలో వ్యవసాయిక విధానం, రైతు సాంకేతిక విజ్నానం పై పరిశోధనలో తామే అపెక్స్ బాడీ అని ICFA ప్రకటించుకోవడం సరిగా లేదు. భారత వ్యవసాయిక రిసెర్చ్ కౌన్సిల్ (ICAR) మాత్రమే దేశంలో వ్యయసాయ రంగంలో అపెక్స్ బాడీ గా గుర్తింపు ఉంది. ICAR దేశవ్యాప్తంగా 101 ICAR కేంద్రాలతో సేవలందిస్తోంది. 71 వ్యవసాయిక విశ్వవిద్యాలయాలను దేశవ్యాప్తంగా విస్తరించింది.జూలై 16.1929లో స్ధాపించబడిన ICAR డిపార్ట్ మెంట్ ఆఫ్ వ్యవసాయిక పరిశోధన మరియు విద్య(DARE) కింద పనిచేస్తోంది. భారత ప్రభుత్వం ద్వారా జాతీయ స్ధాయిలో ఈ సంస్ధ అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్ధగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పోందింది. ICAR కు మీకు పోలిక ఏమిటి?
§ శ్రీయుత డాక్టర్ ఎంజె ఖాన్ , ఛైర్మెన్ ICFA గారు తెలంగాణా ముఖ్యమంత్రిగారికి రాసిన AT/ Awards/ 01/08/17 తేదీ 05.08.2017 లేఖలో ప్రోఫెసర్ స్వామినాధన్ గారి నేతృత్వంలోని నేషనల్ అవార్డ్ కమిటీ యే (పాలసీ నాయకత్వంకింద) ఈ అవార్డును ముఖ్యమంత్రిగారికి ఇచ్చినట్లు ఉంది. ఎలాంటి ప్రతిభను కనబరచని, అత్యంత బాధ్యత రహితంగా వ్యహరించిన తెలంగాణా ముఖ్యమంత్రికి ఈ అవార్డు ప్రకటించడం పట్ల మేం నిజంగానే ఆశ్చర్యం వ్యక్తం చేశాము. అది ముఖ్యమంత్రి చేస్తున్న మోసానికి పరోక్షంగా తోడ్పడ్డట్లు గాదా?
§ అసలు తెలంగాణా లో పర్యటించకుండా ఇక్క రైతులను కలువకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా ముఖమంత్రి పాలసీలు బాగున్నాయని యెట్లా నిర్ధారణకు వచ్చారో వివరణ ఇవ్వాలని కోరుతున్నాము.
§ అవార్డు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిగారి నుద్దేశించి డాక్టర్ఎంజె ఖాన్ గారు రాసిన లేఖలో రాసింది పూర్తిగా తప్పు. క్షేత్రస్ధాయిలో నిజానిజాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలియకుండా చేసిన చర్యగా భావిస్తున్నాం. నిజానిజాలేంటో మేం తెలియజేస్తున్నాం గమనించండి.
§ మీరు అవార్డు ప్రకటించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ గారు ఎలాంటి వ్యవసాయం పై ఎలాంటి విధాయక నిర్ణయాలు తీసుకున్నారో. ఎన్ని లక్షల మంది రైతుల జీవితాల్లో ఏమి మార్పు కనిపించిందో మిమ్మల్ని, మీ అవార్డుల కమిటీని (అగ్రికల్చరల్ పాలసి ) అంతగా ప్రభావితం చేసిన విషయమేంటో తెలపాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. మహారాష్ట్ర తర్వాత రైతుల ఆత్మహత్యల్లో దేశ వ్యాప్తంగా రెండో స్దానం వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి కి ఈ అవార్డు ఏ ప్రాతిపదిక మీద ఇస్తారో చెప్పండి
తెలంగాణా ప్రజలకు కు అర్ధం కావడం మీరు ఈ క్రింది విషయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము:
1. గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ 2017 కోసం ఎన్ని దరఖాస్తులు మీకు,,మీసంస్థకు వచ్చాయి ?
2. అవార్డు ఇవ్వడానికి మీరు ఎలాంటి నిబంధనలు పెట్టారు.?
3. కేసీయార్ గారికి అవార్డు ఇవ్వడానికి ఆయన పాలసీలకు సంబందించి మీరు ఎలాంటి పత్రాలను తీసుకున్నారు.?
4. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అవార్డు కమిటీ వారు ఎన్ని వ్యవసాయక్షేత్రాలను
5. పరిశీలించారు. ఎవరి అధ్వర్యంలో పరిశీలించారు.?
6. అవార్డును నిర్ణయించేముందు ఎన్ని సమావేశాలను అవార్డుకమిటీ నిర్వహించింది?
7. మీరు సమావేశాలను నిర్విహిస్తే అవి ఎక్కడ ఎప్పుడు నిర్వహించారు.?
8. మీ అడ్వైజరీ కమిటీ ద్వారా మీరు నిర్వహించిన సమావేశాల ప్రతులను మాకు అందచేయగలరా?
9. అవార్డు కు అర్హులను ఎన్నుకునే మొత్తం విధానం ఏంటి.?
10. ఈ అవార్డు కమిటీ కి సంబంధించిన పూర్తి రాజ్యాంగం ఏమిటి ?
గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్షిఫ్ అవార్డు ను ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి ఇవ్వడంపై
తెలంగాణా సమాజం ముందు అవార్డుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచాలని కోరుతున్నాను. తేదీ 02.06.2014 నుంచి ఆగస్ట్ 25 2017 వరకు శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారి పాలన కాలం కూడా దృష్టిలొ ఉంచుకోవాలి. ఆయన పరిపాలనా కాలంలో ఇప్పడి వరకు 3141మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో ఆయన స్వంత నియోజక వర్గం ఉన్న జిల్లా సిద్దిపేటలోనే ఏకంగా 271 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సహాయం మాట అటుంచితే..ఇప్పడి వరకు ముఖ్యమంత్రి వారిని కనీసం ఓదార్చిన పాపాన పోలేదు. అటువంటి వ్యక్తి కి అవార్డు యెట్లా ఇస్తారు.
ICFA అవార్డు ఇచ్చేముందు, ఈ క్రింది తెలంగాణా వ్యవసాయానికి సంబంధించి వాస్తవ విషయాలను తెలిసికునుంటే బాగుండేది.
గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విషయాలపై పూర్తిగా విఫలమయ్యారు. రైతులకు ఇస్తామన్నరుణమాఫీ పూర్తిచేయలేదు. తెలంగాణా కాంగ్రెస్ కమిటీ మరియు ఇతర ప్రజాసంఘాల తీవ్ర వత్తిడితో నాలుగువిడుతలుగా ఇస్తామని అంగీకరించారు. కాని వారిచ్చిన డబ్బుతో కేవలం మిత్తీ మాత్రమే తీరింది అసలు అలాగే మిగిలిపోయింది..దీంతో వారి రుణాలు అలాగే బకాయిలుగా మిగిలిపోయాయి.. దీంతో 36 లక్షల మంది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.దీనికి నిదర్శనంగా బ్యాంకులవద్దవారి యొక్క పాస్ బుక్కులు జప్తుచేయబడ్డాయి.బంగారు ఆభరణాలు సైతం బాంకుల్లో తాకట్టుల్లో ఉన్నాయి.
కరువు పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది.ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఎలా మేనేజ్ చేయాల్లో ప్రణాళిక లేదు. మార్కెట్ హెచ్చుతగ్గులను ఎలా అంచనావేయాలో సరైన ప్రణాళిక లేదు. ఊహాతీత కల్పిత చర్యలద్వారా ప్రభుత్వం ముందకు పోతోంది..దీనివల్ల దళారులు రైతులను సులభంగా మోసగిస్తున్నారు.రైతులు పండించే పంటల నష్లాలకు సంబంధించిన రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం కు సరయిన సమయంలో పంపడంలో పూర్తిగా విఫలం అయింది. నోట్ల రద్దు అంశంతో గ్రామీణ బ్యాంకుల్లో డబ్బులు సరయిన సమయానికి అందక రైతులు తీవ్ర ఇబ్బందుకు గురయ్యారు.స్ధానిక మార్కెట్లలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు ,పురుగులమందులు కోనేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇదంతా జరుగుతున్నా తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.
గత సీజన్ లో రైతులకు సరైనMSP కనీస మద్దతు ధర కల్పించలేకపోయారు.దీంతో చాలా మంది రైతులు కనీస గిట్టుబాటు ధర లేక తాము పండించిన పంటలను తామేకాల్చివేసారు. తెలంగాణాలో రైతన్నలు రోజంతా కష్టపడి చెమట ధారపోసినా వారికి సరియైన ధర పొందలేకపోయారు. ఇదంతా ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడమే, వారికెలాంటి న్యాయం ప్రభుత్వం చేయలేకపోయింది.. ఎవరన్నా రైతులు తమకు అన్యాయం జరుగుతోందని ఎదురుతిరిగితే వారిపై దారుణంగా దాడులకు పాల్పడ్డారు. పోలీసులతో కొట్టించారు రైతులను రౌడీలగా చిత్రీకరించారు. వారిచేతులకు బేడీలు వేసి జైల్లో తోయించారు. గతంలోనే నిర్మాణం ప్రారంభం అయిన వాటిని ప్రాజెక్టల రీడీజైన్ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్లాను సారంగా ఖర్చు చేస్తూ పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. నిర్ధాక్షిణ్యంగా తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయిక భూములునుదోచుకుంటోంది. దొడ్డిదారిన తెచ్చి కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చి చిన్న సన్నకారు రైతులనుంచి బలవంతంగా భూములు సేకరిస్తూ భయభ్రాంతులకుగురిచేస్తోంది.. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం వ్యవహరిస్తూ అసలైన భూసేకరణ చట్టాన్ని భూసేకరణ చట్టం 2013 ను తుంగలో తొక్కింది. గ్రామాల్లో పోలీసులను రెవెన్యూ యంత్రాంగాన్ని మోహరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.పర్యావరణ చట్టాలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు.ప్రజల జీవితాలంటేవిలువ లేదు. పేద రైతులు భూమిలేని కూలీలంటే లెక్కెలేదు.
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇబ్భందులపాలయిన రైతులకు న్యాయం జరుగాలని వారిని ఆదుకోవాలని మే 2015లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీయుత రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పటికిని, తెలంగాణాలో ఉన్న నియంత ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చడం లేదు. 2014 నుంచి ఇప్పడివరకు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదు.రైతుల మాట వినేందుకు ప్రభుత్వంలో ఎవరికి తీరిక లేదు. బీద బడుగు బలహీన వర్గాల గొంతులు పూర్తి నొక్కివేయబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
వ్యవసాయం పాడయిపోయి తీవ్ర నిరాశలో ఉన్న తెలంగాణా రైతాంగం ఇప్పడివరకు చెప్పిన విషయాలు కేవలం మచ్చు మాత్రమే.. గుండె పగిలే నిజాలు రైతులను కదిలిస్తే తెలుస్తాయి..ఇవేవీ పట్టించుకోని ముఖ్యమంత్రికి ఎలాంటి అవార్డుకు అర్హుడు కాడు. మీలాంటి మీకు ముఖ్యమంత్రికున్న వ్యాపార సంభంధం ఏమిటి చెప్పాలి?
మీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముంఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికిమొదటి బెస్ట్ అగ్రికల్చరల్ అవార్డ్ 2008 ఇచ్చామని చెబుతున్నారు. కాని మీరు రాసిన లేఖ ప్రకారం మీ సంస్ధ ICFA 2015లో ప్రారంభం అయిందని తెలిపారు.
ఏదేమైనప్పడికి మీరు చెప్పిన విషయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రికి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారికి ఏమాత్రం పోలిక లేదు. 2004 నుంచి 2009 వరకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారి ఆధ్వర్యంలో ఎన్నో నూతన వ్యవసాయిక విధానాలను ప్రవేశ పెట్టి రైతు బాంధవుడిగా మారారు. ఉచిత విద్యుత్త్ అందించారు. రుణమాఫీ ఏకకాలంలో చేపట్టారు. ఇప్పడికి ఆయన రైతుల మదిలో చిరస్ధాయిగా నిలిచారు. ఇప్పడికి ఆయనే ఎలాంటి అవార్డుకు అయినా అర్హుడు.ఇది ఎంత మాత్రం అతిశయోక్తికాదని నిర్ధద్వందంగా చెప్పగలను. వ్యవసాయాన్ని పండుగ చేసిన పెద్ద మనిషి వైస్సార్, వ్యవసాయాన్ని దండుగ చేసిన మనిషి కెసిఆర్
తనస్వంత వ్యవసాయ క్షేత్రంలోఎకరానికి కోటి రూపాయలు పంటతీసే చంద్రశేఖర్ రావుగారికి వ్యక్తిగతం గా మీరు గ్లోబల్ లీడర్ అవార్డు ప్రకటిస్తే తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి ఎలాంటీ అభ్యంతరం లేదు. కాని తెలంగాణా ముఖ్యమంత్రి హోదాలో ఈ అవార్డు ప్రకటిస్తే తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం..ఇది తెలంగాణా రైతాంగ సమాజాన్ని అవమానపరిచినట్టే అవుతుంది.తన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణా వెనుకబాటు తనానికి కారణమవుతున్న ముఖ్యమంత్రికు అవార్డు ఇవ్వడం అన్యాయం.
మీరు రైతుల పట్ల, రైతులకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పని సరిగా అభినందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని మీ పరిశీలక బృందాన్ని ఇక్కడ పర్యటించమని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. క్షేత్రస్ధాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనావేయండి. చంద్రశేఖర్ రావు గారు ఈ అవార్డుకు అర్హులా కారా అన్నవిషయాన్ని రైతులే తీర్పుఇస్తారు.
మేము చంద్రశేఖర్ రావు గారిని విభేదిస్తున్నది కేవలం గొంతులేని పేద బీద రైతుల గొంతు వినిపించేందుకే కాని మీరన్నట్లు మాకేదో రాజకీయ లబ్దికోసం మాత్రం కాదు. మా వ్యాఖ్యలను మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు, మేము కేవలం ఒక అసమర్ధ ముఖ్యమంత్రి కి, అభూత కల్పనలతో రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కి, ఈ అవార్డు ఏ హేతుబద్ధతతో ఇచ్చారని మాత్రమే ప్రశ్నించాము మరియు ప్రభుత్వం మరియు గవర్నర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాము అన్న కీలక విషయాన్నీ మాత్రమే గమనించాలని కోరుతున్నాము.
డా.శ్రవణ్ దాసోజు.
జనరల్ సెక్రెటరీ
చీఫ్ స్పోక్స్ పర్సన్
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,
గాంధీభవన్ హైదరాబాద్,500001
Better POLITICS 4 Better INDIA
Cc to 1. Smt Sonia Gandhi , President, AICC
2 . Shri Rahul Gandhi Ji, Vice President, All India Congress Committee
3. Prof MS Swaminathan, Founder, MS Swaminathan Research Foundation & Chairman National Awards Committee
4. Capt N Uttam Kumar Reddy, President, Telangana Pradesh Congress Committee


No comments:

Post a Comment