Saturday 14 September 2019

డెంగీ మరణాలకు బాధ్యులుగా కేసీఆర్, ఈటెలను చేసి కేసులు నమోదు చేయాలి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌


Ø ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి
Ø రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన తెలంగాణ కాంగ్రెస్‌
Ø డెంగీ మరణాలకు బాధ్యులుగా కేసీఆర్, ఈటెలను చేసి కేసులు నమోదు చేయాలి :
ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌
Ø  వైద్య, ఆరోగ్య శాఖను టీఆర్ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందని మండిపాటు


హైదరాబాద్, సెప్టెంబర్‌ 14 :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనం రోగాలతో నానా కష్టాలు పడుతున్నారని, తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి వద్ద శనివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్ధేశించి శ్రవణ్‌ ప్రసంగించారు. డెంగూ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ 1.82 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టి అందులో వైద్య,ఆరోగ్య శాఖకు కేవలం రూ.5536 కోట్లు మాత్రమే కేటాయించారని, మొత్తం బడ్జెట్‌లో ఇది కేవలం మూడు శాతమేనని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సగటున వైద్య, ఆరోగ్య శాఖకు 4.8 శాతం చొప్పున బడ్జెట్‌ కేటాయించాయని, టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కమీషన్లు పొందేందుకే కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించారని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.
తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు వల్ల కేవలం కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, ఆర్జన చేశారని, తెలంగాణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు చెందిన ఒక కుక్కకు ఆనారోగ్యం చేస్తే వైద్యం చేసిన తర్వాత చనిపోయిందంటూ బంజారాహిల్స్‌ పోలీసులు పశువైద్యుడిపై కేసు పెట్టినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తను దాసోజు శ్రవణ్‌ ఉటంకించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో డెంగీ కారణంగా ఒకేరోజు ఆరుగురు పిల్లలు మరణిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యులుగా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లను చేసి వాళ్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి నెలకొని ఉందంటే గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా జఠిలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 20 రోజులకు ఒక్కసారి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యాన్ని హెలికాఫ్టర్‌ ద్వారా సేవలు అందిస్తామని గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ గాలి మాటగానే మిగిలిందన్నారు.
టీఆర్ఎస్‌ పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకలు, మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని దాసోజు శ్రవణ్‌ నిలదీశారు. అయిదున్నర ఏండ్లు గడిచినా ఆ హామీకి దిక్కు లేదని దుమ్మెత్తిపోశారు. గతంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని వెయ్యి పడకల స్థాయికి తీసుకువచ్చారని, ఇప్పటి టీఆర్ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఎంజీఎం ఆస్పత్రిని ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తగిన నిధులు ఇవ్వకుండా ఆస్పత్రికే అనారోగ్యం వచ్చిందనేలా చేశారన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్లు పనిచేయక గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క రోజులో 21 మంది రోగులు చనిపోయారని, ఇలాంటి ఘటనల తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణవిషయమన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్లాన్‌ చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించి దాని నిర్మాణ వ్యయ్యం 80 వేల కోట్ల రూపాయలకు పెంచి 18 లక్షల ఎకరాల్ని సాగు లక్ష్యంగా చేసి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేస్తోందని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రీడిజైన్‌ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ చర్యల్ని ఆయన తీవ్రంంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పాలన మొత్తంలో రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అయిదున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన గణాంకాల్ని వివరించారు. కేవలం 60 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేశారని డాక్టర్‌ శ్రవణ్‌ నిప్పులు చెరిగారు.
డెంగీ కేసుల నమోదు వివరాల్ని అందించేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగూ కేసుల సంఖ్య ఎంతో పత్రికల వారికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రుల్లోని డెంగీ కేసుల వివరాల్ని మీడియాకు చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడినట్లుగా తెలిసిందన్నారు. వైద్య, ఆరోగ్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శలు గుప్పించారు.

Congress demands health emergency in Telangana : AICC Spokesperson Dr Sravan Dasoju

Congress demands health emergency in Telangana

·         Cases must be booked against CM KCR, Etala for Dengue deaths: Sravan
·         AICC Spokesperson accuses TRS Govt of suppressing info on Dengue
·         Sravan slams TRS Govt for neglecting Health Sector


Hyderabad, September 14: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan demanded that the State Government declare Health Emergency in Telangana to take immediate measures to control spread of viral diseases.

He was addressing the hunger strike camp organised by Congress party at MGM Hospital in Warangal on Saturday. He alleged that the State Government has failed to react promptly on the spread of Dengue, Malaria, Cholera and other viral diseases despite many deaths being reported from across the State. He accused the TRS Government of completely neglecting the Health Sector. He pointed out that of Rs. 1.82 lakh crore Vote on Account budget for 2019-20 only Rs. 5,536 crore were earmarked for Health Sector which was about 3% of the total expenditure. He said other States, on an average, were spending about 4.8% of budget on public health. He said huge budget was allocated for Kaleshwaram Project and other irrigation schemes as Chief Minister K. Chandrashekhar Rao was allegedly getting commission from contractors.

Sravan said that the benefits of separate Telangana State were being enjoyed only by KCR and his family while the creation of new State did not change the lives of common people. Referring to a news item, he said a criminal complaint was lodged with the Banjara Hills against the veterinary doctor after a dog of Pragathi Bhavan, whom he was treating, died. However, he said no action was taken when six children died of Dengue in a single day in Gandhi Hospital. He asked whether or not criminal cases for negligence should be booked against CM KCR and Health Minister Etala Rajender. He said KCR was keen on constructing new buildings for Secretariat and Assembly. But he was not interested in improving the facilities in government hospitals. He said the Tribal and Agency areas of Telangana were not having any medical facilities and they get the access once in 20 days. He reminded that the Chief Minister had promised to provide Air Ambulance by deploying helicopters in the Tribal areas.

The Congress leader reminded that the TRS party, in its election manifesto for 2014 elections, had promised to construct a 1,000-bed hospital in every district headquarters and a 100-bed hospital in each mandal. Even after more than five-and-a-half years, this promise remained unfulfilled, he said. He also pointed out that the previous Dr. Y.S. Rajashekhara Reddy Government had upgraded MGM Hospital in Warangal to 1,000-bed. However, he said the present TRS Government has completed neglected the hospital and deprived it of required funds. He said Osmania General Hospital, Gandhi Hospital and Niloufer Hospital in Hyderabad lack proper facilities and infrastructure. He said 21 people died in a single day in Gandhi Hospital when ventilators went off due to power cut as there no back up.



Sravan said that the previous Congress Government had planned Pranahita Chevella Project to irrigate 16 lakh acres of land at an estimated cost of Rs. 35,000 crore. However, KCR escalated the cost in the name of re-designing and the State Government would be spending Rs. 80,000 crore to cultivate 18 lakh acres of land. He condemned the Chief Minister for wasting public money in the name of re-designing. The Congress leader said that Telangana had inherited a debt of only Rs. 60,000 crore in 60 years. However, CM KCR had pushed Telangana into a debt trap of over Rs. 2.50 lakh crore in 60 months.

He strongly condemned the State Government for trying to suppress information on rising number of Dengue cases by asking private hospitals not to reveal details to media. Similarly, the government hospitals have been directed not to disclose statistics pertaining to Dengue cases to media. He said instead of curbing information, TRS Government must focus on curbing the diseases which have played havoc in the lives of common people. (Ends)