Wednesday 1 May 2019

రాహుల్‌ గాంధీ పౌరసత్వాన్ని సవాల్‌ చేసిన బీజేపీని తీరును ఖండించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ


Ø  రాహుల్‌ గాంధీ పౌరసత్వాన్ని సవాల్‌ చేసిన బీజేపీని తీరును ఖండించిన కాంగ్రెస్‌
Ø  మోదీ అండ్‌ టీం మానసికంగా దివాళాకోరుతనం కాంగ్రెస్‌
Ø  శిఖండి రాజకీయాలకు తెర తీస్తున్న మోదీ ప్రభుత్వం
Ø  నిరాధార ఆరోపణలతో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే కుట్రలు
Ø  కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శ


హైదరాబాద్‌, మే 1: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వాన్ని భారతీయ జనతాపార్టీ సవాల్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ తీవ్రంగా ఖండించారు. రాహుల్‌గాంధీ పౌరసత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీకే చెల్లిందని విమర్శించారు.

బుధవారం న్యూదిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ పౌరసత్వాన్ని బీజేపీ వివాదం చేయడం ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఉగ్రమూకలు గత ఫిబ్రవరిలో పుల్వామాలో జరిపిన దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. నేడు గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో ఏకంగా 16 మంది వీర జవాన్లు మరణించారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దారుణంగా వైఫల్యం చెందింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బీజేపీ చేతుల్లో రాజకీయ సాధనంగా మారిపోయింది. ఇలాంటి దేశ భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. రాహుల్‌గాంధీ పౌరసత్వ వివాదాన్ని మాత్రం రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని ప్రయత్నించడం దారుణమైన విషయం. రాహుల్‌గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసు ఇవ్వడానికి రాజ్‌నాథ్‌సింగ్‌ అనుమతి ఇవ్వడం ద్వారా ఆయన పిచ్చి పరాకాష్టకు చేరినట్లు అయింది.. అని దాసోజు శ్రవణ్‌ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. 

‘‘రాహుల్‌గాం్ధధీ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, నానమ్మ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ముత్తాత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అనే విషయం యావత్‌ ప్రపంచానికి తెలుసు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. రాహుల్‌గాంధీ 2004 నుంచి పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు ఎన్నిక అయ్యారు. ఇంతకాలం లేని పౌరసత్వ వివాదాన్ని ఇప్పుడు బీజేపీ తెరపైకి తీసుకురావడం ద్వారా కుట్ర చేయాలని ఎత్తుగా అనిపిస్తోంది. త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన వ్యక్తి రాహుల్‌గాంధీ పౌరసత్వంపై వివాదం రేకెత్తించి కేంద్ర హోం శాఖ ద్వారా నోటీసు ఇచ్చే కుట్ర చేసిన బీజేపీ చర్యలు హేయమైనవి. ఈ చర్య దారుణమైనది... ’’అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘‘దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీ నాయకత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకోలేక బీజేపీ ఇలాంటి నిరాధార ఆరోపణలను నిస్సుగ్గుగా చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన బ్యాకూపూస్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఇన్‌కార్పొరేషన్‌ ద్వారా రాహుల్‌గాంధీ భారతీయుడేనని ఏనాడో చెప్పింది. ఇదే వివాదంపై దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు 2015లోనే తోసిపుచ్చింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని ఈ వివాదాన్ని తిరిగి బీజేపీ తెర మీదకు తెచ్చి నీచ స్థాయిలో లబ్ధి పొందాలనే చౌకబారు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చిల్లర స్థాయి చర్యలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనలేని మానసికంగా దివాళా తీసిన పరిస్థితుల్లో బీజేపీ ఉంది. మోదీ, ఆయన కనుసన్నల్లోని బీజేపీ టీం ఓటమిని చవిచూడాల్సివస్తుందనే భయం పట్టుకుంది. అందుకే దేశం కోసం ప్రాణాలను బలిదానం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల కుటుంబ వ్యక్తి రాహుల్‌గాంధీ పౌరసత్వంపై తప్పుడు వివాదం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనే కుట్రలు ఏమాత్రం పనిచేయబోవు.. ’’అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. 

విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ఇంధన ధరల్ని తగ్గిస్తామన్న మాటలు కూడా నీటి మూటలయ్యాయి. పది కోట్ల ఉద్యోగాల కల్పన హామీ కాగితాలకే పరిమితం అయ్యింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామనే భరోసా బూడిదలో కలిసింది. బీజేపీ హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని రాహుల్‌గాంధీ ప్రజలకు వివరించడంతో ఆ పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. అందుకే వీటన్నింటì నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్‌గాంధీ పౌరసత్వ వివాదాన్ని బీజేపీ లేవనెత్తుతోంది... అని ఆయన విమర్శించారు.

కాపలాదారుడిగా ఉంటానని పదేపదే చెప్పుకునే నరేంద్ర మోదీ రాఫెల్‌ కుంభకోణానికి పాల్పడ్డారు. కాపలాదారుడే (మోదీ) దొంగగా మారాడు.. అని రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేశారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలందరికీ రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణం గురించి సమగ్రంగా వివరించారు. అదేవిధంగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడిన కష్టనష్టాల గురించి కూడా రాహుల్‌ గాంధీ గట్టిగా విమర్శల దాడి చేశారు. దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఇతర హిందీ భాషా రాష్ట్రాల్లో అనూహ్య స్పందన లభించడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అయిదు, ఆరు విడతల పోలింగ్‌ జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రహించిన బీజేపీ రాహుల్‌గాంధీ పౌరసత్వ వివాదాన్ని లేవనెత్తడం ద్వారా చౌక బారు ఎత్తుగడలకు దిగుతోంది. ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో మోదీ, బీజేపీ టీమ్‌లు స్థాయి తగ్గిపోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి.. అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మోదీ, బీజేపీలు స్థాయి తక్కువ చర్యలు ఎన్ని తీసుకున్నా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హిందీ భాషా రాష్ట్రాల్లో బాగా పుంజుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు ఓటమి పరంపర కొనసాగుతుందని, ప్రజా క్షేత్రంలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment