Tuesday 30 April 2019

ఇంటర్‌ ఫలితాలపై కమిటీ నివేదికను తారు మారు చేసిండ్రు ; ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

1. ఇంటర్‌ ఫలితాలపై కమిటీ నివేదికను తారు మారు చేసిండ్రు  ...శ్రవణ్‌
2. 110 పేజీల విచారణ కమిటీ పూర్తి నివేదికను అధికారిక సంతకాలతో బహిర్గతం చేయాలి..శ్రవన్‌
3. జ్యుడిషియల్‌ విచారణను మరోమారు కోరిన కాంగ్రెస్‌ పార్టీ
4.  జగదీశ్‌రెడ్డిని కేబినెట్‌ నుంచి తప్పించండిఃశ్రవణ్‌

హైదరాబాద్‌/ న్యూఢిల్లీః ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకుగ్లోబరినా టెక్నాలజీస్‌ మరియు ఇంటర్మీడియట్‌ బోర్డుల నిర్లక్ష్యాన్ని దాచేందుకు నకిలీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం చెలామణిలో పెడుతోందని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ)  అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డిఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి అశోక్‌ ఈ అవకతవకల్లో కీలక పాత్ర పోషించారని వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మరియు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన దాసోజు శ్రవణ్‌ తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌ రావు సారథ్యంలోని కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి 110 పేజీల నివేదిక సమర్పించిందని తెలిపారు. నివేదికలోని అన్ని పేజీలపై సభ్యులు సంతకాలు చేశారని వెల్లడించారు. సమాధాన పత్రాల మూల్యంకనంలో దొర్లిన అనేక తప్పిదాలను ఈ నివేదికలో స్పష్టంగా వెల్లడించారని మరియు పలు ప్రతిపాదనలను సైతం చేశారని వివరించారు. అయితేమొత్తం నివేదికను బహిర్గతం చేయకుండాకేవలం 10 పేజీలను పైగా సభ్యుల సంతకాలు చేయకుండా మీడియాకు అందించడం వాస్తవాలను మరుగున పరిచేందుకేనని ఆరోపించారు. ఇంటర్‌ ఫలితాల్లో దొర్లిన భారీ ఎత్తున తప్పిదాలను వెల్లడించిన నివేదికను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించిన శ్రవణ్‌ ఇప్పటికీ మంత్రి జగదీశ్‌రెడ్డి మరియు ఇంటర్‌బోర్డు అధికారులు విద్యార్థులువారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమిటీ ఇచ్చిన వాస్తవ నివేదికను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
స్వతంత్య్ర ఏజెన్సీ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్‌ మరియు రీకౌంటింగ్‌ నిర్వహించాలని ముగ్గురు సభ్యుల కమిటీ సూచించిందని శ్రవణ్‌ పేర్కొన్నారు. అయితే,ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టితిరిగి ఈ తప్పిదంలో ప్రధాన దోషి అయిన గ్లోబరినా టెక్నాలజీస్‌ సంస్థతో ఈ ప్రక్రియను పూర్తి చేయడం వెనుక ఉద్దేశపూర్వకమైన తప్పుదోవ పట్టించే లక్ష్యం ఉందని ఆరోపించారు. దీంతో పాటుగా ఐవీఆర్‌ ఫీచర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని మరియు ఇంటర్‌బోర్డ్‌ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ ఫాం అందుబాటులో ఉంచాలని సైతం ముగ్గురు సభ్యుల కమిటీ ప్రతిపాదించిందని వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల కోసం ప్రత్యేకమైన సర్వర్‌ను ఏర్పాటు చేయాలని సైతం కమిటీ సూచించిందని వివరించారు. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీప్రచారం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క విషయాన్ని సైతం టీఆర్‌ఎస్‌ సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. తద్వారా లక్షలాది మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్మీడియట్‌ పలితాల్లో అవకతవకలకు గ్లోబరినా టెక్నాలజీస్‌ కారణమని ముగ్గురు సభ్యుల కమిటీ స్పష్టమైన అంశాలను పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని శ్రవణ్‌ ఆరోపించారు. దీనికి బదులుగాఆ ప్రైవేట్‌ సంస్థను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కోట్ల రూపాయల ఈ కాంట్రాక్ట్‌ను చట్టబద్దమైన ప్రక్రియ and Legal Agreement లేకుండా తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌బోర్డ్‌ గ్లోబరినా సంస్థకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ అంశం ముగ్గురు సభ్యుల కమిట Report Lo సైతం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితేటీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇటు గ్లోబరినా టెక్నాలజీస్‌ లేదా ఇంటర్‌ బోర్డ్‌ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి గత ఏడాదికి చెందిన రీకౌంటింగ్‌ మరియు రీవాల్యుయేషన్‌ అంశాలతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రవణ్‌ ఆరోపించారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 24,690  దరఖాస్తులు గత ఏడాది రాగా, 796 మంది అభ్యర్థుల మార్క్‌ షీట్లలో మార్పులు జరిగినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించడం పూర్తిగా అబద్దమని శ్రవణ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ షాహినాయత్‌గంజ్‌కు చెందిన వినోద్‌కుమార్‌ గుప్తా అనే వ్యక్తి ఇంటర్‌బోర్డ్‌ ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, 20465 మంది అభ్యర్థులు 2018 మార్చిలో రీవాల్యుయేషన్‌ మరియు రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారని వివరించారు. 6,419 మంది అభ్యర్థుల వివరాలను మార్పులు చేశారని వివరించార అయినప్పటికీమంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుడు సమాచారంతో ఈ అంశం యొక్క తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రోపించారు. ఇంటర్‌ అవకతవకలను తేల్చేందుకు జ్యుడిషియల్‌ విచారణ తప్పనిసరి నిర్వహించాలని శ్రవణ్‌ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. దీంతో పాటుగా విద్యాశాఖమంత్రి,ముఖ్యకార్యదర్శిఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి మరియు గ్లోబరినా టెక్నాలజీస్‌పై చర్యలు చేపట్టకపోతే అది లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment