Wednesday 14 November 2018

శ్రవణ్ దాసోజు ప్రస్ధానం

శ్రవణ్ దాసోజు ప్రస్ధానం
ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు(53) ఎంఏ, ఎంబీయే, పీహెచ్ డీ(ఆర్గనైజేషనల్ సైకాలజీ)
తండ్రి : కృష్ణమాచారి, తల్లి : జోగమ్మ, గృహిణి.
భార్య: ప్రొఫెసర్ శశికళ (ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, రాజేంద్రనగర్)
కుమారుడు: మృణాల్ (ఆక్సెంచర్ ఐటీ ఉద్యోగి) కుమార్తె : గౌరీనారాయణి. 9 వ తరగతి
...................................................................................................................
విద్యార్ధి రాజకీయాలు
ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల జనరల్ సెక్రెటరీ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శ్రవణ్ దాసోజు, విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ ఎన్నో సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేసి, అనేక సార్లు జైలుకు వెళ్లిన్రు. బడుగు బలహీన వర్గాల  ప్రజల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశిన్రు. ఉన్నత విద్యావంతుడైన శ్రవణ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (IPE) లో ప్రొఫెసర్ గా, హిటాచీ కన్సల్టింగ్ ,మరియు సత్యం కంప్యూటర్స్ లో హెచ్ ఆర్  జనరల్ మేనేజర్ గా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన్రు. ప్రజా సేవ  కోసం ఉన్నత ఉద్యోగం వదులు కొని బెటర్ పాలిటిక్స్ ఫర్ బెటర్ సొసైటీ " కోసం ప్రజల చేతుల్లో దశాబ్ద కాలంగా పాశుపతాస్త్రంగా పనిచేస్తున్రు.


ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర  
సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల సారధ్యంలో ప్రారంభమైన ప్రజా రాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించిన్రు. ఆ పార్టీ కి వ్యూహకర్తగా,నిబద్దత కల సైనికుడిగా పనిచేశిన్రు. 2009  ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేసిన్రు.
తెలంగాణా ఉద్యమం(టీఆర్ఎస్ పార్టీ)లో కీలక పాత్ర
ఆతర్వాత అరవై ఏళ్ల పోరాటం, ప్రజల ఆరాటాన్ని గమనించి, ప్రత్యేక తెలంగాణా కోసం తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో కేసీఆర్ కు ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన్రు. టీఆర్ఎస్ పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్ గా, అధికార ప్రతినిధిగా ఉద్యమ ఆకాంక్షలను బలంగా ఎలుగెత్తి చాటిన్రు. తెలంగాణా బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పడు తూర్పార బట్టిన్రు. పార్టీ వేసే ప్రతి అడుగులో అడుగై, ఉద్యమ వ్యూహాలను రచించిన్రు. ఉద్యమంలో లాఠీలకు, తూటాలకు వెరవకుండా, చావునోట్లో తలబెట్టి పోరాడిన్రు. మొక్కవోని దీక్షతో అపజయం ఎరుగని సుశిక్షితుడైన సైనికుడిగా ముందుకు కదిలిన్రు. ఉద్యమ రథ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలోని తెలంగాణా జేఏసీ తరఫున ఛలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సాగరహారం, సంసద్ యాత్ర లాంటి ప్రజాఉద్యమాల్లో పాల్గొని ప్రజాఆకాంక్షలను వెలుబుచ్చిన్రు.
తెలంగాణా ప్రదాత కాంగ్రెస్ పార్టీలో  కీలక పాత్ర
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియంత వైఖరితో విభేధించి, పక్క రాష్ట్రంలో నష్టపోయినా ఫర్వాలేదని కడుపు చించుకుని రాష్ట్రం ఏర్పాటు  చేసిన తల్లి సోనియాగాంధీ త్యాగాన్ని గుర్తించిన శ్రవణ్, కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక చొరవతో  కాంగ్రెస్ పార్టీలో చేరారు.తనకు వెన్నుదన్నుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, జైరాం రమేశ్, కొప్పుల రాజు లాంటి పెద్దల సహకారంతో, తన ప్రతిభా పాటవాలతో అనతి కాలంలోనే పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగాప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడుగా2018 ఎన్నికల క్యాంపైన్ కమిటీ కన్వీనర్ గా ఎదిగి ఎన్నోసరికొత్త ఆలోచనలతో, అధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ టీఆర్ఎస్  ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ప్రజాసమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ (ఫేస్ ఆఫ్ ది పార్టీ) గొంతుక గా మారిన్రు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీల ప్రసంగాలను ఉన్నదున్నట్లుగా తర్జుమా చేసి  వారికి తెలుగు గొంతుకగా మారిన్రు. వారి సందేశాలను రాష్ట్ర ప్రజలకు తెలుగులో అనువదించి అత్యుత్తమ విశ్లేషణ చేసిన్రు.
విద్యార్ధులకు అండదండ
ఫీజు రీయంబర్స్ మెంట్ వల్ల విద్యార్ధులు ఎదుర్కుంటున్న సమస్యలు, విద్యార్ధుల పట్ల కేసీఆర్ చూపిన వివక్షపై ఎండగట్టి, విద్యార్ధిలోకం ఎదుర్కుంటున్న సమస్యల సాధన పట్ల నిబద్దతతో వ్యవహరించిన్రు. విద్యా, వైద్య, సంక్షేమం, ఎక్కడ అక్రమాలు జరిగినాఅక్కడ తానున్నానంటూ వారందరి తరుఫున మాట్లాడిన్రు.   
దళితులకు పెద్దన్నగా
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, దళిత ముఖ్యమంత్రి చేస్తానని  వాగ్దానం చేసి మోసం చేసిన కేసీఆర్ ను అడుగడుగునా ఎండగట్టడంలోఎన్నో వేదికల పై దళిత గొంతుకగా నిలిచారు. దళిత నాయకత్వం కోసం ఎదిగేందుకు ఎల్డీఎమ్మార్సీ ప్రజంటేషన్ చేసి దళితుల కు పెద్దన్నగా నిలిచిన్రు.
నీళ్లు నిజాలు ప్రజెంటేషన్
సాగునీటి ప్రాజెక్ట్ ల పై మోసాలకు పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వ చర్యలకు వందరోజులు అవిశ్రాంతంగా శ్రమించి, తనదైన టెక్నాలజీని ఉపయోగించిఅద్భుతమైన "నీళ్లు నిజాలు" ప్రజెంటేషన్ చేసి  టీఆర్ఎస్  ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా చేశిన్రు.
మల్లన్నసాగర్ భాధితులకు అండ
ఏటా మూడు పంటలు పండే భూములను అన్యాయంగా, అక్రమంగా మల్లన్నసాగర్ పేరిట లాక్కుంటుంటే వేములఘాట్ ప్రజలకు, మాజీ డిప్యూటీ సీయం దామోదర్ రాజనర్సింహ్మగారితో కలిసి అండగా నిలిచిన్రు. తన గంభీర మైన వాక్కులతో వారందరికి భరోసా కల్పించిన్రు. అక్కడి రైతుల్లోఎంతటి అన్యాయాన్నైనా ఎదిరించే సాహసాన్ని, గుండె ధైర్యాన్ని నింపిన్రు.
విద్యుత్ వాస్తవాల పై ప్రజెంటేషన్
గత కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చిన్నాటి నుంచి చేపట్టిన ఎన్నో అభివృద్ది పనులను  ఏకరువు పెట్టి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన్రు.  
ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తానున్నానంటూ అన్ని రంగాల్లో అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించి ప్రభుత్వానికి చెమటలు పట్టిచ్చిన్రు.  
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ముందుచూపుతో వచ్చిన కరెంట్ తమ గొప్పేనని డంబాలు పలుకుతున్న కేసీఆర్ కు అదంతా కాంగ్రెస్ ఘనతేనని నిరూపించే ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్ కు దిమ్మతిరిగేలా చేసిన్రు.  
మెట్రో రైల్  ఛార్జీల పై కన్నెర్ర
సామాన్యుడికి అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ చార్జీలతో మెట్రో రైల్ తెస్తే అడ్డగోలుగా ధరలు పెంచిన ప్రభుత్వాన్ని నిలదీసిన సాహసి శ్రవణ్ దాసోజు.
కాగ్ రిపోర్ట్ పై ప్రజెంటేషన్
తెచ్చిన అప్పులనే ఆదాయంగా చూపుతున్న మోసపూరిత టీఆర్ ఎస్ విధానాన్ని కాగ్ ఎత్తిచూపితే కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్  దొంగ మాటలనుజనం దృష్టికి తెచ్చిఅద్భత మైన ప్రజెంటేషన్ ఇచ్చిప్రభుత్వ పెద్దలకు దిమ్మతిరిగేలా చేసిన్రు.
బీసీల ఐక్యత కు కృషి
రాష్ట్రంలో అరశాతం ఉన్న బీసీ బిడ్డలను కులాల పేరిట విభజన చేస్తూ అడుగడుగునా మోసగిస్తుంటే అడ్డుకుని మోసాల కేసీఆర్ ను నిలదీయాలని పిలుపు నిచ్చిన్రు.
బీసి బిడ్డలకు ఉద్యోగాలిమ్మంటే గొర్లు, బర్లు, చేపలు, కోళ్లివ్వడమేంటని  రాజ్యాధికారం కావాలని నినదించి బీసీలను ఒక్కటి చేసిన్రు.
రైతన్నలకు బాసట
వ్యవసాయంలో అడుగడుగునా రైతన్నను మోసగిస్తూ, అన్నదాత ఆత్మహత్యల బాట పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ లెక్కలేనితనాన్ని ప్రశ్నించి
ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్  చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్  కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చిన్రు. జిల్లాల వారిగా శిక్షణా శిబిరాలు నిర్వహించి తన ప్రసంగాల ద్వారా వారిలో చైతన్యం నింపిన్రు.
ధర్నాచౌక్ పై పోరాటం
కేసీఆర్  ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసి ప్రజాసంఘాల గొంతు నొక్కేస్తే వారికి మద్దతు ప్రకటించి ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టిన్రు.
ప్రొఫెషనల్ కాంగ్రెస్ తో చైతన్యం
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ఆనాటి  ప్రొఫెషనల్స్ గాంధీ, నెహ్రూ, వల్లబాయ్, గోఖలే, తిలక్ లాంటి ప్రొఫెషనల్స్ మళ్లీ ఈ దేశానికి అవసరమని నమ్మిన రాహుల్ సిద్దాంతాన్ని తానూ తు.చ. తప్పకుండా ఆచరిస్తూ తెలంగాణా పునర్వైభవానికి రాష్ట్ర ప్రొఫెషనల్ కాంగ్రెస్ బాధ్యతలను మోస్తూ అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నరు.
నేటి యువతరం ప్రస్తుత రాజకీయ వ్యవహారాల పై విసుగెత్తుతున్న తరుణంలో... రాజకీయాల్లో నూతన మార్పుల కోసం చదువుకున్న వారు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనే ఉద్దేశ్యంతో  ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను భుజాన వేసుకుని ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన్రు.  
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కోర్టుల్లో విజయం
తెలంగాణాలో ప్రజాస్వామ్యం, అన్యాయమై పోతున్నప్పుడల్లా తానున్నానంటూ కోర్టుల్లో కేసులేసి విజయం సాధించిన్రు.
ఆర్టీఐ చట్టాన్ని... కేసీఆర్ తన చుట్టంగా మార్చుకుని, ప్రజల కు అందుబాటులో ఉండాల్సిన జీవోలను అడ్డుకుంటే, కోర్టుల్లో కొట్లాడి జీవోలను తిరిగి ఆన్ లైన్ లో  పునరుద్దరించేలా కృషి చేసిన్రు.
ఎన్నికల అక్రమాలపై విజయం
ఎన్నికల్లొ అక్రమాలు నిరోధించాలని,ఖమ్మం ఉపఎన్నికల్లో  ఈవియంల కు వీవీప్యాట్ లు అమర్చి పారదర్శక ఓటింగ్ జరిగేలా ఎన్నికల సంఘంతో పోరాటం చేశిన్రు.
జీహెచ్ ఎంసీలో ఎక్స్ అఫీషియో మెంబర్ల  ద్వారా దొడ్డిదారిన మేయర్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే దాన్ని నిలువరించి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగి బడుగు వర్గాల ప్రజలకు అవకాశం వచ్చేందుకు కారణమయ్యిన్రు.
బీసి రిజర్వేషన్ల కోసం పోరాటం
కుల గణన చేయకుండా గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం  బీసీ వర్గాల నోళ్లలో మన్నుగొట్టే విధంగా ప్రవర్తిస్తే  కోర్టు తలుపులు తట్టి,  బీసి వర్గాలకు న్యాయం జరిగేలా, ప్రభుత్వానికి మొట్టికాయలు పడేలా చేశిన్రు.
మోసపూరిత అవార్డులపై కన్నెర్ర
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్(ఐ సీ ఎఫ్ ఏ) పేరిట బోగస్ అవార్డులతో  కేసీఆర్  గొప్పలు పోతుంటే.. ఆ బోగస్ అవార్డుల కమిటీ బండారం బయటపెట్టిన్రు.
రైతు ప్రగతి సదస్సు పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్
వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ నాడు పట్టించుకోని కేసీఆర్, రైతుబంధు పేరిట పేద రైతులను మోసగిస్తున్న తీరును రైతు ప్రగతి సదస్సు పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాస్తవాలను వెలికి తీసిన్రు.
అధికారుల అక్రమాలపై ధ్వజం
విద్యా సంస్ధ ల్లో అక్రమ ట్రాన్స్ ఫర్ లు చేస్తున్నవిద్యాశాఖ కమీషనర్  నవీన్ మిట్టల్ లాంటి అధికారుల పక్కల్లో బల్లెంలా మారిన్రు. ఉద్యోగులకు అన్యాయం జరుగొద్దని ఉద్యోగులను చైతన్యం చేసేందుకు ప్రయత్నం చేసిన్రు.

ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం పోరాటం
బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుకు ఆటంకం కలిగించి ఫీజురీయంబర్స్ మెంట్ పథకాన్ని నిలిపేందుకు కుట్ర చేస్తే అడుగడుగున పోరాటం చేశిన్రు. పేద విద్యార్ధులకు అండగ నిలిచిన్రు. కార్పోరేట్ విద్యాసంస్ధల దోపిడిని అరికట్టి, విద్య అందరికి అందుబాటు లో ఉండాలని పోరాటం చేశిన్రు.

మారోజు వీరన్న వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అలుపెరుగని పోరాటం చేస్తున్న శ్రవణ్ దాసోజు బెటర్ పాలిటిక్స్..ఫర్ బెటర్ సొసైటీ అంటూఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు.

ఇట్లు
ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి
ఉద్యమకారులను లాఠీలతో తరిమికొట్టిన వారు కావాలా..
ఉద్యమంలో లాఠీ, తూటాలకు ఎదురొడ్డిన దాసోజు కావాలా... నిర్ణయించండి...

బెటర్ పాలిటిక్స్.....................ఫర్ బెటర్ సొసైటీ

No comments:

Post a Comment