Sunday 20 August 2017

Press Meet On #KCR Being #Awarded as Leader of #Agriculture 2017 by #ICFA

విత్త‌న కంపెనీల‌కు కేసిఆర్ దాసోహం .. ఫ‌లిత‌మే వ్య‌వ‌సాయ అవార్డు... దాసోజు శ్ర‌వ‌న్‌.. బిక్ష‌మ‌య్య గౌడ్
వ్య‌వ‌సాయ అవార్డు ఒక ప్రైవేట్ కంపెనీది.. ఆ సంస్థ చైర్మ‌న్ ఎం.జె ఖాన్ ఒక బ్రోక‌ర్
రైతుకు ఏం ఒరిగింద‌ని కేసిఆర్‌కు అవార్డు.. ప్రైవేట్ బ్రోక‌ర్ ఇచ్చే అవార్డుకు గ‌వ‌ర్న‌ర్ అభినందిస్తారా
స్వామినాథ‌న్‌కు లేఖ రాస్తాం.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి రైతుల ప‌రిస్థితి చూడ‌మంటాము..
రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. వ్య‌వ‌సాయ సంక్షోభం, రైతుల‌కు బేడీలు.. న‌కిలీ విత్త‌నాలు.. క‌ర‌వు
అప్ప‌లు ఊబిలో అన్న‌దాత‌.... పంట‌ల‌కు ద‌క్క‌ని గిట్టుబాటు, అంద‌ని వ్య‌వ‌సాయ రుణాలు... ఇదీ తెలంగాణ వ్య‌వ‌సాయం
ఇందుకోస‌మేనా కేసిఆర్‌కు వ్య‌వ‌సాయ నాయ‌క‌త్వ అవార్డు.. ఇచ్చే వాడికి ఇంగితం లేదు.. తీసుకునేవాడికి బుద్ది లేదు..
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్‌కు వ్య‌వ‌సాయ నాయ‌క‌త్వ అవార్డు ఇస్తున్న‌ట్టు భార‌తీయ ఆహార వ్య‌వ‌సాయ మండ‌లి ప్ర‌క‌టించ‌డం ఒక పెద్ద కుట్ర, రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మండ‌లి ఒక కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌గా భ్ర‌మింప‌జేసి, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిందీ, ఈ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ ఈ సంస్త‌కు ఎం.జె ఖాన్ అనే వ్య‌క్తి చైర్మ‌న్ ఆయ‌న ఒక విత్త‌న కంపెనీల బ్రోక‌ర్ తెలంగాణ‌ను సీడ్ బోల్ గా చేస్తామ‌నే కుట్ర‌లో ప్రైవేట్ విత్త‌న కంపెనీల‌ను దోచి పెట్టేందుకు ముఖ్య‌మంత్రికి అవార్డు ప్ర‌క‌టించారు. ఇది ప‌నికిరాని అవార్డు, ఇచ్చే వానికి ఇంగితం లేకున్నా.. తీసుకునే వారికి బుద్ది ఉండాలి క‌దా.. అని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌న్‌, న‌ల్గొండ డిసిసి అధ్యక్షులు బిక్ష‌మ‌య్య గౌడ్‌లు మండిప‌డ్డారు.
ఆదివారం నాడు వారు గాంధీభ‌వ‌న్ లో వారు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ దున్న‌పోతు ఇనింది అంటే దొడ్లొ క‌ట్టేయ్య‌మ‌న్న చందంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఒక రాజ్యంగ బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉండే ఆ అవార్డు ఏమిటో, ఏందోకూడా తెలుసుకోకుండా ముఖ్య‌మంత్రిని అభినందించ‌డం ఏమిటి, ఈ గ‌వ‌ర్న‌ర్‌కు ఎప్పుడు కేసిఆర్ ను పొగుడుదామా అంటు కాచుకుని కూర్చుంటాడ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. గ‌వ‌ర్న‌ర్‌కు నైతికత ఉంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన అవార్డుకు తెల‌సుకోకుండా అభినంద‌న‌లు తెలిపాన‌ని వాటిని విర‌మించుకుంటున్న‌ట్టు మీడియాకు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వారు అన్నారు. అస‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రికి వ్య‌వసాయ నాయ‌క‌త్వ అవార్డు ఇవ్వ‌డ‌మంటే ఒక మిలినియం జోక్ అని తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ తీవ్ర‌మైన సంక్షోభంలో ఉండి, రైతులు పెద్ద ఎత్తున ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే, దేశంలో తెలంగాణ వ్య‌వ‌సాయంలో పూర్తిగా వెనుక‌బ‌డి ఉంటే, అందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ తీసుకుంటున్న రైతు వ్య‌తిరేక విధానాలు కార‌ణంగా ఉంటే ఆయ‌న‌కు ఈ అవార్డు ఎలా ఇస్తార‌ని వారు ప్ర‌శ్నించారు.
భార‌తీయ ఆహార వ్య‌వ‌సాయ మండ‌లి ఒక ప్రైవేట్ సంస్త దాని చైర్మ‌న్ ఎం.జె ఖాన్ ఒక విత్త‌న కంపెనీల బ్రోకర్ తెలంగాణ‌లో విత్త‌నాల కంపెనీల‌ను దించ‌డానికి, న‌కిలీ విత్త‌నాలతో రైతుల‌ను ముంచ‌డానికి, జ‌న్యు విత్త‌నాల‌ను తెలంగాణ‌లో స‌ర‌ఫ‌రా చేయ‌డానికి చేస్తున్న కుట్ర‌లో భాగంగా ఖాన్ ఈ అవార్డు కేసిఆర్‌కు ప్ర‌క‌టించార‌ని అంతేకానీ తెలంగాణ‌లో కేసిఆర్ ఏదో వ్య‌వ‌సాయానికి గొప్ప చేయ‌డం వ‌ల్ల వ‌చ్చింది కాద‌ని విమ‌ర్వించారు. దేశంలోనే తెలంగాణ రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌లో నెంబ‌ర్
2 గా ఉంద‌ని అంతేకాకుండా తెలంగాణ‌లో 3500 మంది అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే ముఖ్య‌మంత్రి జిల్లా సిద్దిపేట రెండో స్థానంలో ఉండ‌గా కేసిఆర్ నియోజ‌క‌వ‌ర్గం గజ్వెల్ తెలంగాణ‌లో మొద‌టి స్థానంలో ఉంద‌ని ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థ‌తిలో తెలంగాణ రైతాంగం ఉంటే కేసిఆర్ ఈ అవార్డుకు ఎలా అర్హులు అవుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక రైతు కుటుంబాని్న కూడా ప‌రామ‌ర్శించి ప్ర‌భుత్వ జి.ఓల ప్ర‌కారం వారికి న‌ష‌ప‌రిహారం ఇవ్వ‌లేద‌ని, వేలాది రైతు కుటుంబాలు వీదిన ప‌డ్డాయ‌ని వారు అన్నారు. ఏక‌కాలంలో రుణ చేస్తామ‌ని చెప్పి ఓట్లు వేయించుకున్న కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చాక గ‌జ్వెల్‌లో పెట్టిన మొద‌టి మీటింగ్‌లోనే రుణ మాఫీ ఒక్క ఈ ఏడాదికే ప‌రిమితమ‌ని చెప్ప‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు టిఆర్ ఎస్ గ‌ద్దెలు కూల్చి, జెండాలు కాల్చ‌డంతో భ‌య‌ప‌డ్డ కేసిఆర్ త‌రువాత నాలుగు విడ‌త‌లుగా రైతు రుణ మాఫీ అమ‌లు చేశార‌ని అది కూడా నాలుగు విడ‌త‌లుగా ఇవ్వ‌డంలో కేవ‌లం వ‌డ్డీ మాఫీగా మారింద‌ని వారు అన్నారు.
36 లక్ష‌ల మంది రైతుల పాసు పుస్త‌కాలు, బంగారు ఆభ‌ర‌ణాలు ఇంకా బ్యాంకుల‌లోనే ఉన్నాయ‌ని, కొత్త‌గా ఒక్క రైతుకు వ్య‌వ‌సాయ రుణం అంద‌క ప్రైవేట్ వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద పెట్టుబ‌డుల కోసం అప్ప‌లు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేవ‌ని, రైతులు రోడ్ల‌పైకి వ‌చ్చి ధ‌ర్నాలు చేశార‌ని, ప‌త్తి పంట‌లు వేసుకోవ‌ద్దు, మిర్చి, కంది పంట‌లు వేస‌కుంటే మంచి గిట్టు బాటు ధ‌ర‌లు వ‌స్తాయ‌ని ఇదే కేసిఆర్ చెబితే రైతులు ఆ పంట‌లు వేసుకు్న్నార‌ని తీరా పంట‌లు పండాక ధ‌ర‌లు తీవ్రంగా ప‌డిపోతే క‌నీసం రైతుల‌కు భ‌రోసా ఇవ్వలేద‌ని, క‌నీసం ప్ర‌బుత్వ సంస్థ‌లు కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో దేశంలో ఎక్క‌డా లేని విధంగా వేలాది ట‌న్నుల మిర్చి పంట‌ల‌ను రైతులు త‌గ‌ల‌బెట్టార‌ని, ఇంత‌కంటే ఘోరంగా ఎక్క‌డలేద‌ని అన్నారు. మిర్చి పంట‌ల‌కు ధ‌ర‌లు లేవ‌ని రైతులు ఉద్య‌మిస్తే వారికి దోపిడీ దొంగలుగా చిత్రీక‌రించి ఖ‌మ్మంలో గిరిజ‌న రైతుల‌పై కేసులు పెట్టి జైల్లో పెట్టి బేడీలు వేసి కోర్ట‌ల‌కు పంపార‌ని ఇలాంటి కేసిఆర్‌కు అవార్డు ఇవ్వాలా అని వారు ప్ర‌శ్నించారు.
తెలంగాణ‌ను సీడ్ బోల్‌గా మారుస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పిన కేసిఆర్ న‌కిలీ విత్త‌న కంపెనీల‌కు బార్ల తెరిసి న‌కిలి విత్త‌న బోల్‌గా మార్చ‌ర‌ని రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయినా కూడా ఒక్క విత్త‌న కంపెనీపైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అందుకు కేసిఆర్‌కు అవార్డు ఇస్తారా అని ప్ర‌శ్నించారు. క‌ర‌వు, వ‌ర‌ద‌లు, ప్ర‌కృతి వైప‌రిత్యాలు వ‌చ్చి తెలంగాణ రైతాంగం న‌ష్ట‌పోయి కుదేలు అయితే వారికి ఆదుకునే విష‌యంలో ఎలాంటి ఆస‌క్తి చూప‌ని కేసిఆర్‌, కేంద్రం నుంచి వ‌చ్చిన 790 కోట్ల రూపాయ‌ల ఇన్ పుట్ స‌బ్సీడీ నిధుల‌ను త‌న మిష‌న్ భ‌గ‌ర‌థ‌కు త‌ర‌లించి క‌మీష‌న్లు దండుకున్నందుకు అవార్డు ఇవ్వాలా..? చ‌త్తీస్ గ‌డ్‌తో దీర్థ‌కాల విద్యుత్ ఒప్పందాలు చేసుకొని ఎక్కువ డ‌బ్బుల‌కు విద్యుత్ కొనుగోలు చేసి క‌మీష‌న్లు దండుకుంటుకుంటున్నందుకా..? కాంగ్రెస్ ప్ర‌బుత్వ హాయంలో చేప‌ట్టిన విద్యుత్ ప్రాజెక్టుల వ‌ల్ల ఇప్ప‌డు ఉత్ప‌త్తి ప్రారంభ‌మై విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుప‌డితే అది త‌న ఘ‌న‌త అని అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసుకొని రాజ‌కీయంగా ల‌బ్ది పొందుతున్నందుకు అవార్డు ఇవ్వాలా.. ? గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హాయంలో తెలంగాణ‌లో చేప‌ట్టిన నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను ప‌క్క‌న పెట్టి రీ డిజైనింగ్ పేరుతో కొత్త ప్రాజెక్ట‌లు, కాంట్రాక్టులు ఇస్తూ వేల కోట్ల రూపాయ‌ల క‌మీష‌న్లు నొక్కేసినందుకు అవార్డు ఇవ్వాలా.. ఒక ఎక‌రాకు కూడా అద‌నంగా సాగునీరు అందించ‌కుండా అనాలోచిత నిర్ణ‌యాల‌తో కాల‌యాప‌న చేస్తూ రైతాంగానికి ద్రోహం చేసినందుకు అవార్డు ఇవ్వాలా.. అని ప్ర‌శ్నించారు.
ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం యుపిఎ ప్ర‌భుత్వం తెచ్చిన 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని ఇష్టానుసారంగా ఒక బ్రోక‌ర్ లాగా సాగునీటి ప్రాజెక్ట‌లు, ఫార్మా ప్రాజెక్టుల పేరిట ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని రైతుల‌నుంచి గుంజుకొని వారికి భూమి లేని వారికి చేసినందుకు అవార్డు ఇవ్వాలా.. రైతు కూలీల‌కు అక్ష‌య‌పాత్ర లాగా, కామ దేనువు లాగా ఉన్న జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరు గార్చి కూలీల‌కు ఇవ్వాల్సిన కూలీ డ‌బ్బుల‌ను స‌కాలంలో ఇవ్వ‌కుండా వారి ప‌నిదినాలు త‌గ్గించి వారి ఆక‌లి మంట‌ల‌కు కార‌ణ‌మైనందుకు కేసిఆర్‌కు ఈ అవార్డు ఇవ్వాలా అని వారు ప్ర‌శ్నించారు.
వ్య‌వ‌సాయ శాస్త్ర వేత్త ఎం.ఎస్ స్వామినాథ‌న్ అంటే కాంగ్రెస్ పార్టీ అపార‌మైన గౌర‌వం ఉంద‌ని తెలంగాణ‌లో ఎలాంటి వ్య‌వ‌సాయం ఉందో, రైతుల ప‌రిస్థ‌తి ఎలా ఉందో, ప్ర‌భుత్వానికి ఆయ‌న చేసిన సిఫార‌సులు ఇక్క‌డ ఏమైనా అమ‌లు అవుతునా్న‌యో లేదో అని తెలుసుకోవ‌డానికి తెలంగాణ‌కు స్వామినాథ‌న్ రావాల‌ని తాము కోరుతున్నామ‌ని ఈ అంశాల‌తో ఆయ‌న‌కు లేఖ రాస్తున్నామ‌ని వారు తెలిపారు. ఆయ‌న వ‌చ్చి ఇక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌ను, మ‌ద్ద‌తు ధ‌ర‌లు అడిగిన పాపానికి గిరిజ‌న రైతుల‌కు బేడీలు వేసి, కేసుల చుట్టు తిప్పిన అంశాల‌ను, మార్కెట్‌ల‌లో ధ‌ర‌లు లేక వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను ద‌గ్దం చేసిన అన్ని ప‌రిస్థితుల ప‌రిశీలించిన త‌రువాత ఈ అవార్డు ఇస్తే బాగుంటుంద‌ని తాము కోరుతున్నామ‌ని వారు అన్నారు.


https://www.facebook.com/sravan.dasoju/videos/1824460807570649/

No comments:

Post a Comment